By: ABP Desam | Updated at : 30 Jul 2023 07:18 PM (IST)
Hyper Aadi: తెలుగు బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హైపర్ ఆది. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన ఆది తన కామెడీ టైమింగ్ తో విశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. అదే క్రేజ్ తో సినిమాల్లోనూ నటిస్తూ స్క్రిప్స్ రైటర్ గా కూడా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. గత కొంత కాలంగా ఆది పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మధ్య తాను కూడా త్వరలో ఓ ఇంటివాడిని అవ్వాలని భావిస్తున్నట్లు చెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీంతో ఆది చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే చర్చ మొదలైంది.
హైపర్ ఆది పెళ్లి గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆది కూడా తాను త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఆది ప్రేమ పెళ్లి చేసుకుంటాడనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినబడుతోంది. ఓ ప్రముఖ యూట్యూబ్ యాంకర్ తో ప్రేమలో ఉన్నాడని తెలుస్తోంది. ఆదికు ఆమెతో చాలా సంవత్సరాల నుంచే పరిచయం ఉందని చెబుతున్నారు. ఆయన ఇండస్ట్రీకు వచ్చిన కొత్తలో ఆమె చాలా సపోర్ట్ గా నిలిచిందట. దీంతో వాళ్లదరి మధ్య స్నేహం కుదిరి అది కాస్తా తర్వాత ప్రేమగా మారిందట. ఇప్పుడు ఆది ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోనున్నాడని సమాచారం.
హైపర్ ఆది ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నాడట. అయితే ఈ విషయం చాలా మందికి తెలియలేదు. ఇప్పటి వరకూ ఆది కూడా ఎక్కడా ఆ టాపిక్ గురించే మాట్లాడలేదు. అయతే ఇన్నేళ్ల తర్వాత తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట ఆది. అందుకే వారి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పారట. ఇంట్లో వాళ్లు కూడా అంగీకరించడంతో వీరి పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టు సమాచారం. త్వరలోనే ఈ జంటకు నిశ్చితార్థ ఏర్పాట్లు కూడా చేస్తున్నారట కుటుంబ సభ్యులు. ఈ వార్త ఇప్పుడు బయటకు రావడంతో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిందట. ఇక పెళ్లికి సబంధించిన విషయాన్ని ఆది స్వయంగా చెబుతాడని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆది ప్రేమించిన అమ్మాయి ఎవరు అనేది సస్పెన్స్ లా మారింది. ఇప్పటికే ఆయన అభిమానులు ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తున్నారు. మరి తాను చేసుకోబోయే అమ్మాయిని ఆది ఎప్పుడు పరిచయం చేస్తాడో చూడాలి.
చదువుకునే రోజుల్లో సరదాగా చేసిన ఓ షార్ట్ ఫిల్మ్ ఆది కెరీర్ ను మార్చేసింది. అది బాగా పాపులర్ అవ్వడంతో అతనికి ‘జబర్దస్త్’ అనే కామెడీ షో లో అవకాశం వచ్చింది. అక్కడి నుంచి ఆది ప్రస్థానం మొదలైంది. తనదైన కామెడీ టైమింగ్ తో అతి తక్కువ కాలంలోనే ఆ కామెడీ షోలో కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ గా ఎదిగి హైపర్ ఆది గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే క్రేజ్ తో వరుస సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. అంతే కాదు స్క్రిప్ట్ రైటర్ గానూ రానిస్తున్నాడు ఆది. ఓ వైపు టీవీ షోలలో చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు హైపర్ ఆది.
Also Read: ‘భోళా శంకర్’ సీక్రెట్ చెప్పేసిన తమన్నా - ఇది ‘వేదాళం’కి రీమేక్ కాదా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?
Gundeninda Gudi Gantalu Serial : మదర్ సెంటిమెంట్తో 'స్టార్ మా' సరికొత్త సీరియల్ 'గుండె నిండా గుడిగంటలు'
Bigg Boss Telugu 7: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్పై రతిక చెత్త కామెంట్స్
Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు- చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం
/body>