Illu Illalu Pillalu Serial Today November 29th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నగలు పాతేసిన వల్లీ! పది లక్షలు పొగొట్టేసిన ఇడ్లీ బాబాయ్! ఈ స్వామీజీ ఎవరు!
Illu Illalu Pillalu Serial Today Episode November 29th ఇడ్లీబాబాయ్ పది లక్షలు పొగొట్టడం, వల్లీ నగలు మట్టిలో పాతేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode గిల్ట్ నగలు తనవే అని తెలిసిపోతుందేమో అని శ్రీవల్లి చాలా కంగారు పడుతుంది. అద్దంలో తనని తాను చూసుకొని తిట్టుకుంటుంది. వెనకా ముందు ఏం ఆలోచించకుండా అమ్మ ఏం చెప్తే అది ఆలోచించకుండా చేసేయడమేనా బుర్ర లేని దానా అని తనని తాను తిట్టుకుంటుంది.
ఆనంద్ రావు పది లక్షలు తీసుకెళ్లి సాయంత్రానికి 20 లక్షలు తీసుకొస్తాడని భాగ్యం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటుంది. కానీ ఇడ్లీబాబాయ్ మాత్రం నెత్తిమీద టవల్ వేసుకొని వస్తాడు. ఇలా వచ్చారేంటి అని భాగ్యం అడిగితే టైం బ్యాడ్ అయితే ఇడ్లీకి కూడా చీమలు పడతాయి అని ఇడ్లీబాబాయ్ వణికిపోతాడు. భాగ్యం డబ్బు అడిగితే అత్యాశ అంటే బురద రాసుకోవడం అని డబ్బు పోయిందని చెప్తాడు. మాయం చేసి రామరాజు అన్నయ్య దగ్గర డబ్బు తీసుకొస్తే మొత్తం నాశనం చేశావ్ కదరా అని భర్తని చీపురుతో చితక్కొడతాడు.
వల్లీ తల్లికి కాల్ చేస్తుంది. మార్చేసిన ప్రేమ నగల మేటర్ బయట పడిందని చెప్తుంది. భాగ్యానికి మరోసారి షాక్ తగులుతుంది. ప్రేమ నగలు మార్చింది నేనే అని తెలిస్తే నన్ను గెంటేస్తారు.. నాతో పాటు మీ పని కూడా అయిపోతుంది అని వల్లీ అంటుంది. దాంతో భాగ్యం ప్రేమ నగలు బయటకు వెళ్లి గొయ్యి తీసి పాతేయ్ గొడవ పూర్తయిన తర్వాత తెచ్చుకోవచ్చు అని అంటుంది.
నర్మద, ప్రేమ ఇద్దరూ వల్లీనే నగలు మార్చేసిందని బంగారం మార్చేసి గిల్ట్‌వి పెట్టిందని అనుకుంటారు. ప్రేమ గతంలో వల్లీ ప్రవర్తన గురించి చెప్తుంది. వల్లీకి ఈ నగలికి ఏదో సంబంధం ఉందని వల్లీ గదిలో వెతకాలి అని వెళ్తారు. వల్లీ నగలు మూటలో కట్టుకొని పాతేయడానికి రెడీ అవుతుంది. వల్లీ నగలు మూట కట్టేసి బయటకు తీసుకెళ్తుంది. ప్రేమ, నర్మద వల్లీ గదికి వచ్చి మొత్తం వెతుకుతారు. ఇల్లంతా వెతికిన నర్మద, ప్రేమలు వల్లీ ఎక్కడో నగలు రాయాలని అనుకుంటుందని మొత్తం వెతకడానికి వెళ్తారు. ఈ లోపు వల్లీ పెరట్లో గొయ్యి తీసి నగలు పాతేస్తుంది.
ప్రేమ, నర్మద చూసే సరికి వల్లీ పూజ చేస్తూ ఉంటుంది. ఇద్దరూ వల్లీని అనుమానంగా చూస్తారు. వాళ్లని చూసి వల్లీ నగలు పోయావు దొరికేలా చూడు అని అంటుంది. ప్రేమ వల్లీ దగ్గరకు వచ్చి నటించకు ఆ నగలు నీ దగ్గరే ఉన్నాయి అని నాకు తెలుసు.. అమాయకంగా నటిస్తే నేను నిన్ను నమ్మేస్తా అనుకోవద్దు.. అని అంటుంది. కోపంవస్తే కొట్టే చెల్లాయ్,, నన్ను శిక్షించడం నా చెల్లాయికి అంత ఆనందం అయితే భరిస్తా కానీ ఏం పాపం తెలీని నా మీద ఇంత దారుణమైన నిందలు వేస్తే ఒప్పుకోను అంటుంది.
నర్మద వల్లీతో నీకు నగలకు ఏం సంబంధం లేకపోతే మరి నగలు గురించి అన్ని సార్లు ఎందుకు అడిగావ్,, అని ప్రశ్నిస్తుంది. ఇంటి పెద్ద కోడలిగా అది నా బాధ్యత అని వల్లీ అంటుంది. ఏడుపు నటించిన వల్లీ గదిలోకివెళ్లి నగలు దాచేస్తుంది. వెంటనే విషయం తల్లికి చెప్తుంది. ఇక నర్మద, ప్రేమలు ఇంటికి ఓ స్వామీజీని తీసుకొస్తారు. వల్లీ అంతు చూడటానికి నర్మద, ప్రేమలు స్వామీజీ నాటకం మొదలు పెడతారు. వేదవతి ఆయన్ను చూసి ఎవరు అని అడుగుతుంది. ఏ పెట్టెలో బంగారం దాచి ఉందో కనిపెడతా అని ఆయన అంటారు. వీడి ముఖం వేరు ముక్కలు అమ్ముకునేవాడిలా ఉన్నాడు అని అంటుంది. వల్లీ ఎవరు అతను అని అడిగితే నా నగలు కొట్టేసింది ఎవరో చెప్తారని ప్రేమ అంటుంది. వల్లీ చాలా కంగారు పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















