అన్వేషించండి
Jagadhatri Serial Today November 28th: ఇంద్రాణి మళ్లీ కౌషికి ఇంటికి ఎందుకు వస్తుంది. ఆమెను చూడగానే నిషిక, యువరాజు ఎందుకు కంగారు పడతారు..?
Jagadhatri Serial Today Episode November 28: నిషిక మీద కోపంతో కౌషికి ఆస్తిమొత్తం కేదార్ పేరిట రాసిందా...యువరాజు,నిషికను నిజంగానే ఇంట్లో నుంచి బయటకు గెంటివేసిందా..?ఈరోజు ఏపిసోడ్‌లో చూద్దాం.

జగద్ధాత్రి సీరియల్ టుడే ఎపిసోడ్
Source : youtube
Jagadhatri Serial Today Episode: కేదార్ బాధపడుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీవల్లి అన్నయ్యను ఓదార్చుతుంది. నీ సమస్య,నా సమస్య ఒక్కటేనని అంటుంది. నీకు నాన్న గుర్తింపు ఇవ్వడం లేదు, నన్ను అమ్మ ఒప్పుకోవడం లేదని అంటుంది. ఇన్ని కష్టాలన తట్టుకుని ఎలా నిలబడగలుగుతున్నావని అడగగా....సొంతమనుషులను తిరిగి కొట్టలేం కదా శ్రీవల్లి అని జగధాత్రి అంటుంది. శ్రీవల్లి అక్కడ నుంచి వెళ్లిపోగానే...నాకు చెల్లి ఉంటే ఇలాగే ఉంటుందేమోనని కేదార్ అంటాడు. అప్పుడు జగధాత్రి నీ తర్వాత పుట్టింది ఎవరో మనం తెలుసుకుంటే....నీవు ఒంటరి కాదన్న ఫీలింగ్ వస్తుందని జగధాత్రి సలహా ఇస్తుంది. వాళ్లను కనిపెట్టడం ఎలా అని ఆలోచిస్తూ....పేపర్‌లో యాడ్ ఇస్తే బాగుంటుందని జగధాత్రి సలహా ఇవ్వడంతో ఇద్దరూ లేచి వెళతారు.
కోట్ల ఆస్తి ఉన్నా నచ్చింది కొనుక్కునే స్వేచ్ఛ లేదని నిశ యువరాజును దెప్పిపొడుస్తుంది. మీ అమ్మా,నాన్న చేసిన తప్పులకు చేతిలో డబ్బు లేదని, ఇంట్లో మర్యద కూడా లేదని మండిపడుతుంది. సిరి కోసం తీసుకున్న నెక్లెస్ డబ్బులు తిరిగి ఇవ్వాలని...ఆ డబ్బులు ఎలాగైనా ఏర్పాటు చేయాలని అదే నా టెన్షన్‌కు కారణమని చెబుతుంది. నేను ఏం చేయలేనని....అక్కకి, నాన్నకు నాపై నమ్మకం వస్తే తప్ప ఏం చేయలేనని యువరాజు అంటాడు. అప్పు ఇచ్చిన వాడు ఫోన్ చేస్తాడని భయపడి చస్తున్నానని ఆమె అంటుండగానే...అప్పుల వాళ్లు ఫోన్ చేసి బెదిరిస్తాడు. మొత్తం 35లక్షలు కట్టాలని చెప్పగా....తాను ఇవ్వాల్సింది 30లక్షలేనని నిశి అంటుంది. నా దగ్గర అగ్రిమెంట్ కూడా ఉందని అప్పు ఇచ్చిన వాడు గట్టిగా బెదిరిస్తాడు. ఇప్పుడే మీ ఇంటికి వచ్చి నీ సంగతి తేలుస్తానని నిశి చెప్పడంతో...నీకు అంత శ్రమ వద్దని నేనే మీ ఇంటి గేటు ముందు ఉన్నానని రెండు నిమిషాల్లో లోపలికి వస్తున్నాని చెప్పడంతో నిశి భయపడిపోయి ఫోన్ పెట్టేస్తుంది. ఇంట్లో అమ్మ,నాన్న అందరూ ఉన్నారని....ఇప్పుడు ఈ అప్పుసంగతి వాళ్లకు తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుందని నిశి, యువరాజు భయపడిపోతారు.
రంగాను గేట్ బయటే ఆపాలని యువరాజు,నిశి కంగారుగా వస్తుండగా....హాల్లో ఉన్న కేదార్ వారిని ప్రశ్నిస్తారు. ఏం లేదు బయటకు వెళ్తున్నామని చెబుతారు. ఈలోగా అప్పు ఇచ్చిన రంగా నేరుగా ఇంట్లోకి వచ్చేస్తాడు. జగధాత్రి అతన్ని ఆపి ఎవరని ప్రశ్నించగా...వాళ్లను కలవడానికే వచ్చామంటాడు. అతనితో మీకు ఏం పని అని అడగ్గా వారిద్దరూ నీళ్లు నములుతారు. అయితే కలవడానికి వచ్చింది తాను కాదని...మా మేడం వచ్చిందని రంగా చెప్పడంతో నిశి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అవుతుంది. అక్కడ ఇంద్రాణీని చూసి అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. ఈ రంగా వెనక ఉండి తమకు డబ్బులు ఇప్పించింది ఇద్రాణీ అని తెలుసుకుని నిశి ఆశ్చర్యపోతుంది.ఇంద్రాణి పేరు చెబితేనే కౌశికి ఇల్లుపీకి పందిరివేస్తుంది.అలాంటిది ఇప్పుడు ఇక్కడే వచ్చిందంటే ఈ ఇంట్లో ఇక యుద్ధమేనని వైజయంతి అనుకుటుంది.
ఇంద్రాణి ఇంట్లోకి కాలుపెడుతుండగా...కౌశికి అరవడంతో ఆగిపోతుంది. ఒక్క అడుగు ముందుకు వేసినా...పోలీసులను పిలిపించి అరెస్ట్ చేయిస్తామని హెచ్చరిస్తుంది. ఇంటికి వచ్చిన అతిథికి ఇదేనా ఇచ్చే మర్యాద అంటూ ఇంద్రాణి అనగా...మనుషులను బట్టి మర్యాద ఇస్తామని జగధాత్రి బదులిస్తుంది. ఒక్కసారి ఈ ఫ్యామిలీ జోలికి వచ్చినందుకే జైలు పాలయ్యావని...ఇప్పుడు మళ్లీ వస్తేఏమవుతుందో ఆలోచించుకోమని కేదార్ హెచ్చరిస్తాడు. ముందు పోలీసులకు ఫోన్ చేసి ఇంద్రాణి ఇంటికి వచ్చి గొడవ చేస్తుందని చెప్పమని సుధాకర్ బాబాయి చెప్పగా...కౌశికి పోలీసులకు ఫోనే చేయడానికి సిద్ధమవుతుంది. పోలీసులను పిలిస్తే....నిశిక సంగతి వాళ్లతోనే తేల్చుకుంటానని ఇంద్రాణి బదులిస్తుంది. నిషిక పిలిస్తేనే ఇక్కడికి వచ్చానని చెబుతుంది. తనని కలవడానికే వచ్చానని అంటుంది. సుధాకర్‌తోపాటు వైజయంతి కూడా నిషికను నిలదీయడంతో ఆమె నీళ్లు నములుతుంది. మన ఇంటి పరువు తీసిన ఇంద్రాణిని ఇంటికి రమ్మంటావా అని జగధాత్రి నిషికపై మండిపడుతుంది. నేను అసలు ఇంద్రాణిని ఇంటికి రమ్మని చెప్పలేదని అంటుంది. మరి ఎందుకు వచ్చావని అడగ్గా....నిషిక తన దగ్గర 25 లక్షలు అప్పుగా తీసుకుందని చెప్పడంతో అందరూ షాక్‌కు గురవుతారు. వారంలో ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంతోనే నేను రావాల్సి వచ్చిందని ఇంద్రాణి చెబుతుంది. తన కోడలకు అంత ఖర్మ పట్టలేదని సుదాకర్ చెప్పగా....ఇంట్లో ఫంక్షన్ ఉంది అర్జెంట్‌గా నగలు కొనాలని చెప్పి తీసుకుందని ఇంద్రాణి బదులిస్తుంది. నేను చెప్పింది తప్పయితే నిషికను అడగమని చెబుతుంది. వాళ్లు మౌనంగా ఉండటంతో తప్పుచేశారని తేలిపోతుంది.
ఎన్ని అవకాశాలు ఇచ్చినా నిషిక,యువరాజు తప్పులమీద తప్పులు చేస్తూనే ఉన్నారని...వీరికి బుద్ధి రావాలంటే నా దగ్గర ఒకటేమార్గం ఉందని కౌషికి అంటుంది. లోపలికి వెళ్లి ఆస్తిపేపర్లు తీసుకుని వస్తుంది. ఆస్తి కోసమే మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని....అందుకే ఆస్తి మొత్తం కేదార్ పేరిట రాస్తున్నాని చెబుతుంది. ఇదే మీకు అసలైన శిక్ష అంటుంది. ఆస్తి పేపర్లపై సంతకాలు చేసి కేదార్ చేతుల్లో పెడుతుంది. అతను వారిస్తున్నా వినకుండా పేపర్‌లు అందజేస్తుంది. కౌషికి చేసిన పనిని సుధాకర్ మెచ్చుకుంటాడు. అదే చేతులతో నిషిక,యువరాజును కూడా ఇంట్లో నుంచి బయటకు తరిమేమయని చెబుతాడు. వెంటనే కౌషికి వాళ్లిద్దరిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకపోతే మెడపట్టి గెంటించేస్తాని హెచ్చరిస్తుంది. అయితే ఇదంతా నిషిక ఊహించుకుంటుంది. ఇదంతా కల అని తెలిసి ఉలిక్కిపడుతుంది. ఊహాలోకం నుంచి బయటకు వచ్చిన నిషికను జగధాత్రి మరోసారి గట్టిగా అడగ్గా...తాము బిజినెస్ చేసినప్పుడు మిగిలిపోయిన కొన్ని లెక్కలు సెటిల్ చేయాల్సిఉందని...అందుకే రమ్మన్నానని చెబుతుంది. బయటకు వెళ్లి నువ్వు మాట్లాడాల్సింది మాట్లాడి అటునుంచి అటే ఇంద్రాణిని బయటకు పంపించాల్సిందిగా కౌషికి ఆదేశిస్తుంది. దీంతో నిషిక ఇంద్రాణి వద్దకు వెళ్లి బయటకు వెళ్లి మాట్లాడుకుందాం రా అనిఅంటుంది. అప్పుడు ఇంద్రాణి ఇక్కడే మాట్లాడుకుందాం.. అప్పుడు నీ కొత్త లెక్కల సంగతి కూడా తెలుస్తాయికదా అనడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.
ఇంకా చదవండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం
టెక్
Advertisement





















