అన్వేషించండి

Ammayi garu Serial Today November 28th: విరూపాక్షిని హత్య కేసు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు రాజు,రూప చేసిన ప్రయత్నాలేంటి..?

Ammayi garu Serial Today Episode November 28: విరూపాక్షి గన్‌లోనుంచి బుల్లెట్‌ దొంగిలించే హత్య చేశారని రాజు అనుమానిస్తాడు. గన్‌లో నుంచి బుల్లెట్ తీసే క్రమంలో గన్‌ను జాగ్రత్త చేస్తాడు.

Ammayi garu Serial Today Episode: విరూపాక్షిని పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తీసుకెళ్తారు. ఆమె కోసం రూప, రాజు స్టేషన్‌కు వస్తారు. అసలు ఏం జరిగిందని అడగ్గా...తాను ఈ హత్య చేయలేదని చెబుతుంది. కానీ పోలీసులు చూపించిన వీడియోలో మేనేజర్‌ను నువ్వేకాల్చి చంపినట్లు ఉందని రూప వివరిస్తుంది. మనకు  ఉన్న సమస్యలు సరిపోనట్లు ఇప్పుడు ఇంకొకటా అని బాధపడుతుంది. నాన్న, నువ్వు దగ్గరవుతున్న సమయంలో మళ్లీ ఇలా జరిగింది ఏంటని ఏడుస్తుంది. అప్పుడు రాజు ఆమెను ఒక్క నిమిషం ఆగమని....అసలు మేనేజర్‌ దగ్గరకు మీరు ఎందుకు వెళ్లారని అడుగుతాడు. బస్తీ వాళ్లు ఆటోలు కొనుక్కోవడానికి దాచుకున్న సొమ్ములు తిరిగి ఇవ్వకపోతుంటే...తాను వెళ్లి అతన్ని బెదిరించి వారి సొమ్ము వాళ్లకు ఇవ్వాలని చెప్పానని విరూపాక్షి వివరిస్తుంది.
 
నేను అతన్ని బెదిరించినప్పుడు జనం కూడా అక్కడే ఉన్నారని....అంతమంది ఉండగా నేను ఎలా చంపగలుగుతానని అంటుంది. మీరు చంపనప్పుడు మీ గన్‌లో ఉండాల్సిన బుల్లెట్ అక్కడ ఎలా ఉందని ప్రశ్నిస్తాడు. అదే నాకు అర్థం కావడంలేదని ఆమె అంటుంది. మీ గన్‌ ఎవరికైనా ఇచ్చారా అంటే లేదు అని బదులిస్తుంది. మేనేజర్‌ బాడీలో ఉన్న బుల్లెట్‌ మీ గన్‌లో నుంచి వచ్చిందే కాబట్టి...ఆ గన్‌ మీరు కాకుండా ఎవరైనా ఉపయోగించి ఉండాలని రాజు చెబుతాడు. గన్‌ కారులో పెట్టి ఎక్కడికైనా వెళ్లావా గుర్తుచేసుకోమని రూప అడుగుతుంది.
 
మీ దగ్గరకు వస్తున్నప్పుడు మధ్యలో చిన్న గొడవ జరిగితే కారు దిగి వాళ్లకు సర్ధిచెప్పి వచ్చానని...అప్పుడే ఏదో జరిగి  ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తుంది. రాజు కూడా  అక్కడే బుల్లెట్ తీసి ఉంటారని చెబుతాడు.  మిమ్మల్ని ఎవరో ఫాలో అయ్యి ఈ  పని చేశారని అంటాడు. గన్‌ ఎక్కడ ఉందని అడగ్గా కారులోనే ఉందని...ఆ కారు ‌అనాథ శరణాలయం వద్దే ఉందని విరూపాక్షి చెబుతుంది.
 
రూపను తీసుకుని రాజు కారు వద్దకు బయలుదేరి వెళ్తాడు. అటు విజయాంబిక,దీపక్‌ సైతం ఎంతో సంతోషపడతారు. విరూపాక్షిని కరెక్ట్ సమయంలో ఇరికించామని ఆనందపడిపోతుంటారు. ఈ హత్య కేసు నుంచి ఆమె భయటపడటం అసాధ్యమని దీపక్‌ అంటాడు. చిట్‌ఫండ్ కంపెనీ మేనేజర్‌ను మనం చంపి...ఆ నేరం అత్తపై నెట్టేశామని తల్లితో అంటాడు. అప్పుడే అక్కడికి మందారం వస్తుంది. అందరూ బాధలో ఉంటే మీరు మాత్రం ఆస్తులు కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నారా అని మండిపడుతుంది. మీరు జీవితంలో మారరు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
 
అనాథ ఆశ్రమం వద్దకు చేరుకున్న రాజు,రూప...విరూపాక్షి కారులో ఉన్న గన్‌కోసం వెతుకుతారు. అది కనిపించగానే జాగ్రత్తగా వేలిముద్రలు పడకుండా కర్చీఫ్‌తో బయటకు తీస్తారు. బుల్లెట్‌ కోసం గన్‌తీసిన వారి వేలిముద్రలు ఖచ్చితంగా ఈ గన్‌ మీద పడి ఉంటాయని...దీన్ని పరీక్షలకు పంపితే అసలు నిందితులు ఎవరో తెలిసిపోయి విరూపాక్షి గారిని నిర్ధోషిగా బయటకు తీసుకురావచ్చని చెబుతాడు. అమ్మను ఈకేసులో ఇరికించాల్సిన అవసరం అత్తయ్యకు తప్ప ఎవరికీ లేదని రూప అంటుంది. అటు సూర్య కూడా  తన భార్య హత్య చేసి ఉండదని గట్టిగా నమ్ముతుంటాడు. సరిగ్గా అప్పుడే రాజు, రూప అక్కడికి వస్తారు. అమ్మ తప్పుచేసి ఉండదని రూప తన తండ్రితో అంటుంది. అత్తయ్య,దీపక్ బావపైనే అనుమాం ఉందని చెబుతుంది. దీంతో విజయాంబిక  మండిపడుతుంది.అనవసరంగా మమ్మల్ని అనుమానించొద్దని అంటుంది. అప్పుడు రాజు కలుగజేసుకుని అమ్మగారి గన్‌లో నుంచి బుల్లెట్ దొంగలించి ఈ పనిచేసి ఉంటారని అంటాడు. అలా చేసి ఉంటే అమ్మగారి గన్‌మీద ఆ బుల్లెట్ తీసిన వారి వేలిముద్రలు పడే ఉంటాయని చెబుతాడు. ఈ మాటలు విని దీపక్‌,విజయాంబిక కంగుతింటారు.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 23rd: 'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
Nindu Manasulu Serial Today July 23rd: నిండు మనసులు: రేపటి నుంచి గణ 2.0..! తల్లిలా చూసుకుంటా అన్న ఇందిరకు గణ చెప్పిన సమాధానం ఏంటి?
నిండు మనసులు: రేపటి నుంచి గణ 2.0..! తల్లిలా చూసుకుంటా అన్న ఇందిరకు గణ చెప్పిన సమాధానం ఏంటి?
Illu Illalu Pillalu Serial Today July 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అక్క కాళ్లు కడిగి కన్నీరు పెట్టుకున్న వేదవతి! రామరాజు ఇంట్లో సందడే సందడి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అక్క కాళ్లు కడిగి కన్నీరు పెట్టుకున్న వేదవతి! రామరాజు ఇంట్లో సందడే సందడి!
Podarillu Serial Today July 23th:డ్రైవింగ్ లైసెన్స్‌ తెచ్చుకున్న మహా...శైలూకు పెళ్లిచూపులతో ఇంట్లో గొడవలు
పొదరిల్లు: డ్రైవింగ్ లైసెన్స్‌ తెచ్చుకున్న మహా...శైలూకు పెళ్లిచూపులతో ఇంట్లో గొడవలు

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Embed widget