Illu Illalu Pillalu Serial Today August 29th: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: 'ప్రేమ' సాక్ష్యాలు వల్లీ కొట్టేసిందా? నర్మద పరిస్థితేంటి? చందు పరిస్థితి ఘోరం!
Illu Illalu Pillalu Serial Today Episode August 29th చందుకి ప్రమాదం నుంచి తప్పించిన ధీరజ్ చందుకి లక్ష రూపాయలు ఇస్తానని మాటివ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమకి వచ్చిన కవర్‌లో ఏం ఉందో తెలుసుకోవడానికి వల్లి ప్రేమ గదికి వెళ్లి అత్త పిలుస్తుందని చెప్పి ప్రేమని పంపి గది మొత్తం వెతుకుతుంది. అక్కడ ప్రేమ పెట్టిన బుట్టలు తట్టలు వల్ల మీద పడి రెండు మొట్టికాయలు వేస్తాయి.
ప్రేమ వేదవతి దగ్గరకు వెళ్లి చెప్పండి అత్తయ్యా అని అడుగుతుంది. నేనేం చెప్పాలే అని వేదవతి అడిగితే మీరే పిలిచారని మీ అగ్గిపుల్ల కోడలు చెప్పిందని అంటుంది. నేనేం పిలవలేదు అని వేదవతి అంటే ఎందుకు అలా చెప్పింది అని ప్రేమ అనుకుంటుంది. ఇక వల్లి గది మొత్తం వెతికి మొత్తానికి కవర్ సంపాదిస్తుంది. అందులో ఏం ఉందో చూసే టైంకి ప్రేమ దాని సంగతి చెప్తానని వెళ్తుంది. వల్లి దగ్గరకు ప్రేమ కోపంగా వెళ్లి అత్తయ్య పిలవకుండా ఎందుకు అలా చెప్పావని కోప్పడుతుంది. ప్రేమ రావడంతో వల్లి షాక్ అయిపోతుంది. నా గదికి ఎందుకు వచ్చావ్ అని ప్రేమ అడిగితే నీ గది చాలా బాగుంది చూద్దామని వచ్చానని అంటుంది. ఇక వల్లి వెళ్లిపోయిన తర్వాత అక్కడే ఉన్న కవర్ ప్రేమ చూసి కొంప తీసి చూసేసిందా ఏంటి అని అనుకుంటుంది.
సాగర్ నర్మదని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీ నాన్నకి ఏం కాదని డాక్టర్ చెప్పారు టెన్షన్ పడకు అని చెప్పి రైస్ మిల్లుకు వెళ్తాడు. నర్మద అక్కడే బాధగా ఉంటే వేదవతి చూసి ఏంటి గవర్నమెంట్ కోడలా అప్పుడే వచ్చేశావా ఈ అత్తమీద బెంగ పెట్టుకున్నావా అని అడిగితే నర్మద ఏడుస్తూ వేదవతిని హగ్ చేసుంటుంది. మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని అంటుంది. వేదవతితో పాటు రామరాజు కూడా వెళ్దామని అంటాడు. నర్మద బాగానే ఉన్నారని అపేస్తుంది. మా నాన్న ఇంకా మీ మీద అదే కోపంగా ఉన్నారు అని నర్మద అంటుంది. పర్లేదులేమ్మా ఇలాంటప్పుడు అవన్నీ ఏం పట్టించుకోరులే పలకరించి ధైర్యం చెప్పడం మా ధర్మం అని అంటాడు. కానీ నర్మద ఆపి మీ మీద కోపంతో మళ్లీ స్ట్రోక్ వస్తే ప్రాబ్లమ్ అని అంటుంది. వదిలేయండి బాధ పడకండి అని చెప్తుంది. సరే అని ఫోన్‌లో మాట్లాడమని వేదవతికి చెప్తుంది.
వేదవతి నర్మద తల్లితో మాట్లాడుతుంది. మేం హాస్పిటల్‌కి రావాలి అనుకున్నాం కానీ అన్నయ్య గారు కోపంగా ఉన్నారని ఆగిపోయాం అని అంటుంది. పర్లేదులే వదినా అందరి కలిసి పోయే రోజు దగ్గర్లోనే ఉందని నర్మద తల్లి అంటుంది. వేదవతి నర్మదని ఓదార్చుతుంది. సేటు చందు కాలర్ పట్టుకొని డబ్బు కోసం నిలదీస్తాడు. చందు ఓనర్ వచ్చి ఏమైంది అని అడిగితే సేటు మొత్తం చెప్తాడు. ఓనర్ చందుతో ఇలాంటివి షాప్‌లో చూస్తే నిన్ను ఉద్యోగంలో తీసేస్తా అంటాడు. చందు అతన్ని చాలా బతిమాలుతాడు. నెలకు రెండు లక్షలు చొప్పున ఇస్తానని ఒక్క అవకాశం ఇవ్వమని బతిమాలుతాడు. దాంతో సేటు ఇల్లుండి సాయంత్రం 2 లక్షలు ఇవ్వాలని అంటాడు.
చందు జరిగింది అంతా తలచుకొని ఆ పది లక్షల గొడవ గుర్తు చేసుకొని రోడ్డు మీద సోయ లేకుండా నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఇంతలో ఓ లారీ తన వైపు దూసుకురావడం గమనించడు. సరిగ్గా చందుని లారీ గుద్దేసే టైంకి ధీరజ్ వచ్చి చందుని పక్కకి లాగుతాడు. రేయ్ పెద్దొడా ఒక్క క్షణం లేటు అయితే లారీ గుద్దేసేది అంతగా ఏం ఆలోచిస్తున్నావ్‌రా అని అడుగుతాడు. వెంటనే సాగర్‌కి కాల్ చేసి రమ్మని విషయం చెప్తాడు. సాగర్ పరుగున వస్తాడు. ఏం విషయం గురించి ఇంతలా ఆలోచిస్తున్నావ్‌రా అని ఇద్దరూ అడుగుతారు. దాంతో రేపటికి లక్ష కావాలి అని చందు అంటాడు. ఇద్దరూ షాక్ అయిపోతారు. ప్రాబ్లమ్ ఏంటి అని అడిగితే ఏం చెప్పలేను అని చందు అంటాడు. ఇక సాగర్ వంద కావాలి అన్నా నేను నాన్నని అడుగుతానురా అలాంటిది ఒక్క రూపాయి ఇవ్వలేనురా నీ బాధ మాత్రమే పంచుకోగలను అంటాడు. ఇక ధీరజ్ ఏదో ఒకటి చేసి రేపు సాయంత్రానికి నీకు లక్ష ఇస్తానురా అని అంటాడు. నీకు ఏమైనా అయితే మేం బతకలేంరా అని హగ్ చేసుకుంటాడు. ధీరజ్ తన ఫ్రెండ్స్ అందర్ని లక్ష కోసం అడుగుతాడు. ఎవరూ లేవని చెప్తారు. నా దగ్గర డబ్బులు లేవు కానీ సాయంత్రానికి వాడికి డబ్బు ఇవ్వాలి లేదంటే పెద్దోడు ఏమైపోతాడో అనే భయం ఉంది అని ధీరజ్ అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















