అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today April 9th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ కోసం గుండెలు బాదుకొని ఏడుస్తున్న ధీరజ్! ప్రేమ కండీషన్ ఏంటి?

Illu Illalu Pillalu Serial Today Episode April 9th ప్రేమకి యాక్సిడెంట్ అయిందని సేనాపతికి భార్య, అక్క చెప్పడం సేనాపతి తనవల్లే జరిగిందని కుప్పకూలిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode చందుని లారీ ఢీకొట్టడానికి వస్తూ ఉంటే అది చూసిన ప్రేమ చందుని పిలుస్తుంది. చందు ఫోన్లో మాట్లాడుతూ వినిపించుకోకపోవడంతో ప్రేమ పరుగున వెళ్లి చందుని పక్కకి తోసేస్తుంది. దాంతో లారీ ప్రేమని ఢీ కొట్టేస్తుంది. అమ్మా అని ప్రేమ పెద్దగా అరుస్తుంది. చందుకి యాక్సిడెంట్ ప్లాన్ చేసి భాగ్యం, వల్లీ, ఇడ్లీబాబాయ్ దూరం నుంచి చూసి ప్రేమ అని అరుస్తారు. ఇక అప్పుడే వచ్చిన ధీరజ్ కూడా ప్రేమ అని అరుస్తాడు. పరుగున ప్రేమ దగ్గరకు వెళ్లి హాస్పిటల్‌లో చేర్పిస్తాడు.

హాస్పిటల్లో ధీరజ్ ఏడుస్తూ ఉంటే చందు వెళ్తాడు. ధీరజ్ అన్నని పట్టుకొని పెద్దగా ఏడుస్తాడు. మరోవైపు రామరాజు, నర్మద, సాగర్, తిరుపతి, అమూల్య హాస్పిటల్‌కి వస్తారు. ప్రేమకి యాక్సిడెంట్ అవ్వడం ఏంట్రా అని అడిగితే నన్ను కాపాడబోయి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది నాన్న అని చందు చెప్తాడు. జరిగింది అంతా చెప్తాడు. ప్రేమ లేకపోయి ఉంటే తన స్థానంలో అక్కడ నేను ఉండేవాడిని నాన్న.. అసలు ప్రాణాలతో ఉండేవాడినో లేదో కూడా తెలీదు. పొరపాటున తనకి ఏమైనా అయితే నా వల్లే తనకి ఇలా అయింది అనే గిల్టీ లైఫ్ లాంగ్ నాకు ఉండిపోతుంది నాన్న అని చందు అంటాడు. అలా ఏం కాదురా.. ప్రేమకి ఏం కాదు అని అందరూ అంటారు. ధీరజ్ పక్కకి వెళ్లి ఏడుస్తాడు. నర్మద వెళ్లి ధీరజ్ అని అంటే వదినా ప్రేమ తలకి.. కాళ్లకి.. చూస్తూ కూడా కాపాడుకోలేకపోయాను.. అని ఏడుస్తాడు. నా వల్లే ప్రేమకి ఇలా అయింది వదినా.. నేనే తనని కాలేజ్‌కి తీసుకెళ్లకుండా వదిలేశాను.. పొరపాటున తనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను వదినా అని ఏడుస్తాడు. నీ ప్రేమే మన ప్రేమని రక్షిస్తుందని నర్మద చెప్తుంది.

వల్లీ, భాగ్యం, ఇడ్లీబాబాయ్ చెరోవైపు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. వల్లీ తల్లీదండ్రుల మీదకు పెద్ద బండరాయి పట్టుకొని వెళ్తుంది. ఇలాంటి దిక్కుమాలిన ఐడియా ఇచ్చింది నువ్వే కదా అని భాగ్యం మీదకు వెళ్తుంది. ఇప్పుడు ఏమైంది మీ ఆయనకు ఏం కాలేదు కదా అని భాగ్యం అంటుంది. దానికి వల్లీ ఏయ్ చంపేస్తా.. కార్యేషుదాసీ కార్యేషుదాసీ అని పనికిమాలిన ప్లాన్ వేశావ్.. మనుషుల ప్రాణాలతో ఆడుకునే పనికి మాలిన ప్లాన్ వేశావ్.. పాపం ప్రేమ బలైంది.. అమాయకురాలు అయిన దాని ప్రాణాల మీదకు వచ్చింది.. పాపం ప్రేమ నేను దాన్ని ఎంత ఇబ్బంది పెట్టినా సరే నన్ను మాత్రం సొంత అక్కలా చూసుకునేది.. అంత మంచిది ఇప్పుడు ఎలా ఉందో ఎలాంటి పరిస్థితిలో ఉందో.. ఒకవేళ తనకి ఏమైనా అయితే నీ ప్రాణాలు తీసేస్తా.. నీ మాటలు విని నా కాపురాన్ని రోడ్డు మీదకు తెచ్చుకున్నా.. మీ మాటలు విన్నాను చూడు నిజంగా నాకు బుద్ధి లేదు.. పాపం ప్రేమకి ఎలా ఉందో ఏంటో అని శ్రీవల్లి ఏడుస్తుంది. ఇడ్లీబాబాయ్ భార్యతో పాపం ప్రేమకి ఏమైందో అని అమ్మడు ఎలా విలవిల్లాడిపోతుందో చూడు.. నీ మాటలు విని అలా తయారైంది కానీ లేదంటే అమ్మడు చాలా మంచిది.. అమ్మడికి చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అందుకే అంటారు తోడేలు కడుపులో కుందేలు పడిందని అంటాడు.

సేనాపతి ఇంటికి వచ్చి రామరాజు ఇంటిని చూసి ఏంటి కొడుకు యాక్సిడెంట్ విషయం ఇంకా రామరాజు ఇంట్లో తెలీదా.. శోకాలు పెట్టడం లేదు ఏంటి అని అనుకుంటాడు. ఇంతలో డ్రైవర్ సేనాపతికి కాల్ చేసి పని పూర్తి అవ్వలేదు అని ఒక అమ్మాయి మధ్యలో వచ్చేసిందని అంటాడు. కొంతకాలం ఎక్కడైనా దాక్కొని చావు అని సేనాపతి డ్రైవర్‌తో చెప్తాడు. సేనాపతి ఇంట్లోకి వెళ్తున్న టైంలో రేవతికి తిరుపతి కాల్ చేసి ప్రేమకి యాక్సిడెంట్ అయిందని చెప్తాడు. ప్రేమ అని రేవతి అరుస్తుంది. అత్తకి భద్రావతికి ప్రేమకి యాక్సిడెంట్ అయిందని చెప్తుంది. అందరూ షాక్ అయి ఏడుస్తారు. తర్వాత సేనాపతి వస్తే విషయం చెప్తారు. సేనాపతి కుప్పకూలిపోతాడు. 

హాస్పిటల్‌లో ప్రేమకి మెలకువ వస్తుంది. అందరూ వెళ్లి చూస్తారు. ప్రేమ, ధీరజ్కి ఏం కాలేదు అని సైగ చేస్తుంది. డాక్టర్ వచ్చి మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండీ.. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయిన పెద్ద గాయాలు ఏం కాలేదు.. వారం రెస్ట్ ఉండాలి.. కాలు కదపకూడదు అని చెప్తుంది. చందు ప్రేమతో ఎందుకు ప్రేమ నా కోసం నువ్వు ప్రాణాల మీదకు తెచ్చుకున్నావ్ అంటే.. బావ నా ప్లేస్‌లో మీ తమ్ముడు ఉంటే మిమల్ని అలా వదిలేస్తాడా.. మారింది మనిషే బావ బాధ్యత కాదు అని అంటుంది. భద్రావతి వాళ్లంతా హాస్పిటల్‌కి బయల్దేరుతారు. ఇంతలో రామరాజు వాళ్లు ప్రేమని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. సేనాపతి, భద్రావతి, రేవతి అందరూ ప్రేమ దగ్గరకు పరుగున వెళ్తారు. నీకేం కాలేదు కదమ్మా అని ఎమోషనల్ అవుతారు. నాకు ఏం కాలేదు నాన్న కాలికి దెబ్బ తగిలింది అంటే అని అంటుంది. ఈ మాటతో పోతున్న నా ప్రాణం నిలబడింది.. నన్ను క్షమించమ్మా అని సేనాపతి అంటాడు. వాడు ఎవడో యాక్సిడెంట్ చేస్తే మీరు ఎందుకు నాన్న క్షమాపణ చెప్తున్నారు అని ప్రేమ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget