అన్వేషించండి

Jagadhatri Serial Today April 8th: సుజాత హత్య కేసుతో గౌతమ్‌కు సంబంధం ఏంటి? జగధాత్రిని కేసులో ఇరికించేందుకు దివ్యాంక చేసిన పనేంటి..?

Jagadhatri Serial Today Episode April 8th:సుజాత హత్య కేసుతో గౌతమ్‌కు సంబంధం ఏంటి? జగధాత్రిని కేసులో ఇరికించేందుకు దివ్యాంక చేసిన పనేంటి..?


Jagadhatri Serial Today Episode: సుజాత హత్యకేసు విచారణలో భాగంగా జేడీ, కేడీ వాళ్ల ఇంటికి వెళ్తారు. అక్కడవాళ్ల అమ్మను ఓదార్చి...అనుమానితుడైన గౌతమ్‌ను కలుస్తారు. సుజాత చనిపోయినరోజు వాళ్ల  ఇంటికి  ఎందుకు వెళ్లావని ప్రశ్నిస్తారు.కానీ తాను అసలు వాళ్ల ఇంటికే వెళ్లలేదని చెబుతాడు.అయితే అతను షూ సైజు, సంఘటనాస్థలంలో దొరికిని సిగిరెట్‌ ముక్కలు పోల్చిచూసి ఆ హత్యతో గౌతమ్‌క సంబంధం ఉండి ఉంటుందని జేడీ భావిస్తుంది. మర్యాదగా నిజం చెప్పకపోతే..స్టేషన్‌కు తీసుకెళ్లాల్సి వస్తుందని చెప్పగా గౌతమ్‌ భయంతో వాళ్లను నెట్టేసి పారిపోతాడు. ఆ క్రమంలో జేడీ, కేడీ ఇద్దరూ గౌతమ్‌ను వెంబడిస్తారు. అతను తప్పించుకుని పారిపోతుండగా...ఓ కారు గుద్దుకుని తీవ్రంగా గాయపడతాడు. వెంటనే కేదార్‌ అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తాడు.
               భోజనానికి  అందరినీ పిలిచిన వైజయంతి....కౌషికిని  మాత్రం పిలవకపోయేసరికి సుధాకర్‌ భార్యను గట్టిగా మందలిస్తాడు. అబ్బోడు చిన్న తప్పు చేసినందుకే నెలరోజులపాటు అందరితో కలిసి భోజనం చేయవద్దని కండీషన్‌ పెట్టిన కౌషికి ఇప్పుడు మోసం చేసి కంపెనీ నడుపుతోందని తెలిసింది కదా...ఇప్పుడు ఈ అమ్మిని ఎన్ని రోజులు దూరం పెట్టాలని అడుగుతుంది. అది విన్న సుధాకర్‌ భార్యపై కోప్పడతాడు. కౌషికి తప్పు చేయలేదని నిన్నే చెప్పాను కదా మళ్లీ ఆమాటే అంటావని నిలదీస్తాడు. ఆ మాటలు విన్న కౌషికి నాకు  ఆకలిగా లేదని వెళ్లిపోతుంది.  అనవసరంగా ఆ దివ్యాంకతో గొడవలు వద్దని....ఆమెతో మాట్లాడుకుని కలిసిమెలిసిపోతే సాఫీగా కంపెనీ వ్యవహారాలు సాగించుకోవచ్చని అంటుంది. నాకు జేడీపై  నమ్మకం ఉందని..ఈ కేసు నుంచి నన్ను ఎలాగైనా బయటపడేస్తుందని అంటుంది.అప్పుడే దివ్యాంక తన ఛానెల్‌లో న్యూస్ చూపిస్తుంది. పారిశ్రామికవేత్త అయిన కౌషికిని కాపాడేందుకు జేడీ,కేడీ ఇద్దరూ కలిసి ఓ అమాయికుడిని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని..అది తట్టుకోలేక అతను కారుకిందపడి ఆత్మహత్య చేసుకోబోయాడని అసత్య ప్రచారం చేస్తుంది.ఇది చూసిన నిషిక...ఇప్పుడు వాళ్లే చిక్కుల్లో పడ్డారని ఇక నిన్నేం కాపాడతారని అంటుంది. నిజం, న్యాయం నావైపు ఉన్నప్పుడు నేను ఎవరికీ భయపడాల్సిన పనిలేదని కౌషికి అంటుంది.
                    ఆస్పత్రిలో జేడీ,కేడీ ఇద్దరూ గౌతమ్‌ గురించి చర్చించుకుంటారు.సుజాత కేసులో ఖచ్చితంగా ఇతనికి ఏదో తెలిసి ఉంటుందని అనుకుంటారు.అప్పుడే సాధు ఫోన్ చేసి దివ్యాంక న్యూస్‌లో అసత్య ప్రచారం చేస్తుందని చెబుతాడు. పైనుంచి వచ్చే ఒత్తిళ్లు నేను చూసుకుంటానని....మీ పని మీరు కానివ్వండని అంటాడు.ఇంతలో దివ్యాంక జేడీకి ఫోన్ చేసి బెదిరించాలని చూస్తుంది. ఒకసారి నా జోలికి వచ్చినందుకే నీ గతి ఏమైందో గుర్తు తెచ్చుకోమని ధాత్రి హెచ్చరిస్తుంది.ఈ కేసులో నేను ఎవరినిపడితే వాళ్లను అనుమానిస్తున్నానని...దయచేసి నా రేడియస్‌లోకి నువ్వు రావొద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. 
                       కీర్తి బర్త్‌డే రావడంతో తండ్రిని పిలవాలని అలిగి కూర్చుంటుంది. జగధాత్రి, కేదార్ కూడా కౌషికిని బ్రతిమాలతారు. నువ్వు పిలిస్తే బావ తప్పకుండా వస్తాడని చెబుతార. అతన్ని రానివ్వకుండా చేసేందుకు నిషిక, యువరాజు,వైజయంతి ప్రయత్నించినా....ధాత్రి గట్టిగా పట్టుబట్టడంతో సరే ఫోన్ చేస్తానని కౌషికి అంటుంది.వెంటనే నిషిక దివ్యాంకకు ఫోన్ చేసి విషయం చెబుతుంది. దీంతో ఆమె సురేష్ వాళ్ల ఇంటికి వెళ్తుంది.  కౌషికి ఫోన్ చేయగా....సురేష్ ఫోన్ దివ్యాంక లిప్ట్ చేసి మాట్లాడుతుంది.అక్కడ నువ్వు ఎందుకు ఉన్నావని ధాత్రి నిలదీయగా....మాకుమాకు చాలా వ్యవహారాలు ఉంటాయని చెబుతుంది.ఆ మాటలు విన్న కౌషికి ఫోన్ కట్‌ చేస్తుంది. ఇదంతా దివ్యాం చేస్తున్న కుట్రని నువ్వు ఏమాత్రం నమ్మొద్దని జగధాత్రి కౌషికి చెబుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget