Illu Illalu Pillalu Serial Today April 17th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యానికి ధీరజ్, నర్మదల కేరళ ట్రీట్మెంట్! వల్లీకి పెద్ద షాక్!
Illu Illalu Pillalu Serial Today Episode April 17th ధీరజ్, నర్మదలు భాగ్యం కాలు సెట్ చేస్తామని కర్రతో చితక్కొట్టేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ఉదయం నర్మద రామరాజుకి, తిరుపతికి కాఫీ ఇస్తుంది. రామరాజు వద్దు అనేస్తాడు. అప్పుడే అమూల్య కాలేజ్‌కి వెళ్తాను నాన్న అని చెప్పి వెళ్తుంటే మీ అమ్మ వచ్చే వరకు నువ్వు కాలేజ్‌కి సెలవు పెట్టమ్మా అని రామరాజు అంటాడు. ఎందుకు నాన్న అని అమూల్య అడిగితే ఇంటి పని వంట పని చూడాలి కదమ్మా అని అంటాడు. నర్మద రామరాజుతో పర్లేదు మామయ్య అమూల్యని వెళ్లనివ్వండి నేనే ఆఫీస్‌కి సెలవు పెడతాను అని అంటుంది. వద్దులేమ్మా అని రామరాజు అనేస్తాడు.
నర్మద ఏం కాదు అని చెప్పినా రామరాజు వద్దులేమ్మా అమూల్య అన్నీ చూసుకుంటుంది.. నువ్వు నీ పని చూసుకో అని అంటాడు. నేను చూసుకుంటాలేమ్మా.. అని తిరుపతి అంటాడు. ఈ టైంలో వల్లీ ఉంటేనా ఇటు ప్రేమని చూసుకొని అటు ఇంటి పనులు అన్నీ చూసుకునేది అని అంటాడు. కరెక్ట్‌గా చెప్పావురా అని రామరాజు అంటాడు. ఇంతలో చందు వచ్చి మిల్లుకి వెళ్తాను అని చెప్తే నేను మిల్లుకి వెళ్తాను.. నువ్వు వెళ్లి వల్లీని తీసుకురా అని అంటాడు. వద్దులే నాన్న ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయావి.. తను అక్కడే ఉంటుందిలే అని చందు అంటే నీ మాటలు ప్రవర్తనలో నాకు ఏదో తేడా కనిపిస్తుందిరా.. ఏమైందిరా నీకు నీ భార్యకి ఏమైనా గొడవ అయిందా ఏంటి అని రామరాజు అంటాడు. దానికి ధీరజ్ అదేం లేదు నాన్న వదిన వాళ్ల అమ్మని చూసుకోవడానికి వదిన తప్ప ఇంకెవరూ లేరు కదా అందుకే పదే పదే మన ఇంటికి తీసుకురావొద్దు అని అంటున్నాడు అని చెప్తాడు. సరే వల్లీ కోసం వెళ్లకపోయినా మీ అత్తయ్యని పలకరించి పరామర్శించిరా అంటే చందు వెళ్లను అనేసి వెళ్లిపోతాడు.
చందు ధీరజ్‌తో చిన్నోడా మనం వెళ్దాం పదరా నేను రెడీ అయి వస్తాను అంటాడు. చందు నర్మదతో వదినా మనం కూడా వెళ్దాం.. మనం అక్కడ తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అని అంటాడు. మరోవైపు భాగ్యం కర్ర, బ్యాండేజ్ అన్నీ తీస్తుంది. ఇదేంటే అమ్మ నిన్ను నమ్ముకుంటే కాదు.. నేను వెళ్లి నర్మద, ప్రేమల్ని బతిమాలుకుంటా అని అంటుంది. ఇది కూడా నీ కోసమేనే అని భాగ్యం అంటుంది. దాని కోసం భాగ్యం అమ్మడు నీ కాలు, చేయి విరిగిపోయింది.. నిన్ను చూసుకోమని చెప్తామని అంటుంది. మీ ప్లాన్స్ ఏం వద్దు అని వల్లీ అంటుంది. ఇంతలో రామరాజు వాళ్లు ఎంట్రీ ఇస్తారు. వీళ్లేంటి ఇలా వచ్చారని అనుకుంటే భాగ్యం నీ కాలు విరిగింది అని అల్లుడికి అబద్ధం చెప్పావు కదా అందుకే వచ్చారని అంటాడు ఇడ్లీబాబాయ్. అవును కదా అని భాగ్యం బెడ్ ఎక్కి తెగ నటించేస్తుంది.
భాగ్యం రామరాజుకి నమస్కారం పెడితే నా కోడలికి ఇలాంటి సంస్కారం మంచితనం ఎలా వచ్చిందా అనుకున్నా మీ నుంచే అని రామరాజు అంటాడు. నాన్న మీకు వల్లీ వదిన గురించి పూర్తిగా తెలీదు.. తెలిస్తే షాక్ అయిపోతారు. తన కంటే చిన్ని వాళ్లని వదిన ఎంత ప్రేమగా చూసుకుంటుందో... నర్మద వదిన, ప్రేమతో ఎంత ప్రేమగా ఉంటుందో అని అంటాడు. రామరాజు కాసేపు భాగ్యంతో మాట్లాడిన తర్వాత వల్లీకి యాపిల్స్ ఇచ్చి భాగ్యానికి ఇవ్వమని అంటే ఏ ప్లస్ బీ సూత్రం ప్రకారం యాపిల్స్ తింటే చనిపోతారు అని ధీరజ్ వెటకారంగా తిననివ్వకుండా చేసేస్తాడు. ఇడ్లీబాబాయ్ కూతురితో అమ్మడు.. మాటలు బట్టీ ఏదో తేడాగా ఉంది.. అని అంటాడు. ఏం కాదులే అని వల్లీ అంటుంది. కాలు ఏమైపోతుందో అని డౌట్‌గా ఉందని భాగ్యం అంటే అత్తోయ్ మేం ఉన్నాం కదా.. మేం సెట్ చేస్తాం అని ధీరజ్ అంటాడు. కాలు నొప్పి తగ్గిందా అని రామరాజు అడిగితే ఇంకా తగ్గలేదు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నా అని భాగ్యం అంటుంది. అవునా ఇంకా మేం మీకు తగ్గిందేమో వల్లీని మాతో పాటు తీసుకెళ్లాలి అనుకున్నాం అని అంటాడు..
రామరాజు మాటతో వల్లీ, భాగ్యం అందరూ బిత్తరపోతారు. నేను వచ్చేస్తా మామయ్యా అని వల్లీ అంటే.. నర్మద, ప్రేమ వద్దని అనేస్తారు. నేను వచ్చేస్తా అని వల్లీ అంటే వద్దని రామరాజు కూడా అంటాడు. ఇక ధీరజ్ నాన్న నేను చిన్న నాటు వైద్యం చేసి వస్తా మీరు వెళ్లండి అని అంటాడు. సరే త్వరగా వచ్చేయండి అని రామరాజు వెళ్తాడు. ఏంటి అల్లుడు ఇది అంటే ధీరజ్ కర్ర తీసుకొని వచ్చి ఇది కేరళ వైద్యం ఇప్పుడు మీ కాలు సెట్ అయిపోతుందని అంటాడు. భాగ్యానికి ధీరజ్, నర్మద కాలి మీద చితక్కొట్టేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు





















