అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today April 16th: మ్యాడీ,లక్ష్మీ జోడీకి పోటీగా త్రిష ఎవరితో డ్యాన్స్‌ చేయబోతుంది..? ఐశ్వర్యకు సూర్యనారాయణ ఎలాంటి సంబంధం తెచ్చాడు..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode April 16th:మ్యాడీ,లక్ష్మీ జోడీకి పోటీగా త్రిష ఎవరితో డ్యాన్స్‌ చేయబోతుంది..? ఐశ్వర్యకు సూర్యనారాయణ ఎలాంటి సంబంధం తెచ్చాడు..?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: మ్యాడీ, శ్రీలక్ష్మీ కలిసి డ్యాన్స్‌ చేయబోతున్నారని తెలుసుకున్న త్రిష కోపంతో రగిలిపోతుంది. అయినా మనం ఇద్దరం డ్యాన్స్ చేసి ఆ వచ్చిన డబ్బులు లక్ష్మీకి ఇద్దామని త్రిష మ్యాడీకి చెబుతుంది.నేను కూడా ఇదే విషయం చెప్పానని...కాకపోతే తాను డ్యాన్స్ చేసి సంపాధించిన డబ్బులతోనే సాయం చేయాలని లక్ష్మీ అనుకుంటుందని చెబుతాడు.అందుకే నేను కూడా కాదనలేకపోయానని వివరిస్తాడు.ఈ మాటలు విన్న త్రిషకు ఇంకా కోపం పెరుగుతుంది. వెంటనే విక్రమ్ వద్దకు వెళ్లి మరో నాటకానికి తెరలేపుతుంది. మీరు నాకు సాయం చేయాలని అడుగుతుంది.కాలేజీలో జరగబోయే డ్యాన్స్‌ కాంపిటేషన్‌లో మీరు నాతో కలిసి  డ్యాన్స్ చేయాలని అడుగుతుంది. ఎందుకంటే ఆ లక్ష్మీ మ్యాడీతో కలిసి డ్యాన్స్ చేయబోతుందని చెబుతుంది.అందుకే మీరు నాతో డ్యాన్స్ చేసి వాళ్లను ఓడించాలని అంటుంది.ఎందుకు అలా అని విక్రమ్‌ అడగ్గా....మీరు నాతో కలిసి డ్యాన్స్ చేస్తే ఆ లక్ష్మీ జల్సీగా ఫీల్‌ అవుతుందని...అప్పుడు మీకు దగ్గరవుతుందని త్రిష చెబుతుంది. దీనికి విక్రమ్ సరేనని ఒప్పుకుంటాడు
                    డ్యాన్స్ కాంపిటేషన్‌లో పేర్లు ఇవ్వడానికి  శ్రీలక్ష్మీ అటెండర్‌ దగ్గరకు వెళ్లగా....త్రిష కూడా వచ్చి  విక్రమ్‌ పేరు రాయిస్తుంది. దీంతో  శ్రీలక్ష్మీ త్రిషకు బ్రతిమలాడుతుంది.నాకు ఈ కాంపిటేషన్‌లో వచ్చే డబ్బులు చాలా అవసరమని మీరు ఎందుకు నాకు పోటీగా వస్తున్నారని అంటుంది.దీంతో శ్రీలక్ష్మీని అవమానిస్తుంది.పోటీకి ముందే ఓడిపోయానని ఒప్పుకుంటున్నావా అని అంటుంది. నేను డ్యాన్స్ చేసి మిమ్మల్ని ఓడించగలనన్న ధైర్యం ఉందని కాకపోతే అనవసరంగా పోటీ ఎందుకని అడుగుతున్నానని అంటుంది. మ్యాడీ నా పక్కన ఉన్నాడన్న ధైర్యమే నన్ను సగం గెలిపించిందని...రేపు కాంపిటేషన్‌లో మిగిలిన విజయం సాధిస్తానని అంటుంది.ఆ మాటలు విన్న త్రిష శ్రీలక్ష్మీ ముఖంపై ఇంకు చల్లుతుంది.రేపు స్టేజీపై ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. దీంతో శ్రీలక్ష్మీ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయి ముఖం కడుక్కుని వస్తుంది. లక్ష్మీ డల్‌గా ఉండటం చూసి మ్యాడీ అడుగుతాడు.ఆ త్రిష,విక్రమ్‌ మనకు పోటీగా వస్తున్నారని చెప్పగా...మ్యాడీ వెళ్లి త్రిషను నిలదీస్తాడు. లక్ష్మీకి డబ్బులు ఎంత అవసరమో నీకు చెప్పాను కదా అని అంటే...నేను పోటీకి రాలేదని, ఆ విక్రమ్‌ నా దగ్గరకు వచ్చి నన్ను అడిగాడని అందుకే ఒప్పుకున్నానని అబద్ధం చెబుతుంది.
                        సూర్యనారాయణ బయట నుంచి ఇంటికి వచ్చి  అందరినీ పిలుస్తాడు.మ్యాడీ,శ్రీలక్ష్మీ ఇంకా కాలేజీ నుంచి రాకపోయేసరికి కొడుకుని ఫోన్ చేయమని చెబుతాడు.అతను ఫోన్‌ చేస్తుండగానే వాళ్లు ఇంట్లోకి వస్తారు.ఎందుకు  ఇంత ఆలస్యమైందని అడగ్గా....రేపు కాలేజీలో డ్యాన్స్‌ కాంపిటేషన్ఉందని అందులో మేం ఇద్దరం పాల్గొంటున్నామని రిహార్సల్‌ చేసి వచ్చే సరికి ఆలస్యమైందని మ్యాడీ చెబుతాడు. ఇలాంటి రికార్డింగ్ డ్యాన్స్‌లు మీకు ఎందుకని ప్రియంవద అరుస్తుంది. ఇందులో పాల్గొంటే ఫ్రైజ్‌మనీ వస్తుందని ఆ డబ్బుతో తాను సీక్రెట్‌గా వైద్యం చేయిస్తున్న అతనికి ఉపయోగిస్తానని చెబుతుంది. అతనికి ఎంత డబ్బులు అవసరమైతే అంత నేను చూసుకుంటానని చెప్పానుగా అని సూర్యనారాయణ అంటాడు. నా డబ్బులతోనే వైద్యం చేయిస్తానని శ్రీలక్ష్మీ చెబుతుంది.దీంతో ప్రియంవద మండిపడుతుంది. రోడ్డున పోయేవారందరికీ మనం ఎందుకు సాయం చేయాలని అరుస్తుంది.అయినా అతను ఎక్కడ ఉన్నాడో చెప్పు నేను అన్ని విషయాలు చూసకుంటానని చెబుతుంది. నేను చేయలేనప్పుడు అతని బాధ్యతలు మీకే అప్పగిస్తానని శ్రీలక్ష్మీ చెబుతుంది.అవన్నీ సరేగానీ ఇంతకు వీళ్లందరినీ మీరు ఎందుకు పిలిచారో చెప్పండని ఇందరి అంటుంది.అప్పుడు ఐశ్వర్యకు మంచి జమిందార్ల సంబంధం కుదిరిందని త్వరలోనే వాళ్లు పిల్లను చూడడానికి వస్తున్నారని సూర్యనారాయణ చెబుతాడు. ఐశ్వర్యకు అప్పుడే పెళ్లేంటని చిన్న కోడలు సుకన్య చెప్పినా...మంచి సంబంధమని సూర్యనారాయణ చెబుతాడు.దీంతో ఐశ్వర్య ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget