Illu Illalu Pillalu Serial Today April 14th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌కి నిజం చెప్పేసిన చందు! పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న ధీరజ్!
Illu Illalu Pillalu Serial Today Episode April 14th అమూల్య జీవితం నాశనం అవ్వడానికి తన భార్య శ్రీవల్లీనే కారణం అని చందు ధీరజ్‌కి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ధీరజ్ బయట కూర్చొని ప్రేమకి జ్యూస్ చేసి ఇస్తాడు. జ్యూస్ ఏం బాలేదు చేదుగా ఉంది.. నీ ముఖంలో చిరాకు ఎక్కువ అవ్వడం వల్ల జ్యూస్ ఏం బాలేదు.. ఆముదం తాగినట్లు ముఖం పెట్టావ్ అందుకే ఇలా ఉందని ప్రేమ అంటుంది. ధీరజ్ కోపంగా చూస్తాడు. కిచెన్‌లోకి వెళ్లి కాఫీ తీసుకురా అని ప్రేమ అంటే ధీరజ్ తిట్టుకుంటూ వెళ్లి కాఫీ తీసుకొస్తాడు. ప్రేమకి ఇస్తే వద్దు అనేస్తుంది. ధీరజ్ విసిగిపోయి చిరాకు పడతాడు. నాకు నిద్రోస్తుంది ఎత్తుకొని వెళ్లి పడుకో పెట్టు అంటుంది. నిన్ను అని ధీరజ్ కొట్టడానికి చేయి ఎత్తుతాడు.
చందు వచ్చి బుద్ధుందారా నీకు తన మీద చేయి ఎత్తుతావేంటి అని అడుగుతాడు. అన్నయ్య జాగ్రత్తగా చూసుకుంటా అన్న ఒక్క మాట పట్టుకొని నాతో ఆడుకుంటుంది. జ్యూస్ అడిగింది.. కాఫీ అడిగింది,, ఇప్పుడు ఎత్తుకోమంటుంది.. నిన్ను కాపాడింది అన్న ఒకే ఒక్క కన్సర్న్‌తో ఇన్ని సేవలు చేస్తున్నాను.. అంతే తప్ప అమూల్యకి ఇది చేసిన ద్రోహానికి అస్సలు క్షమించను.. ఇది నాకు ముక్కూ ముఖం తెలియనిదే తప్ప దీనిని ఎప్పటికీ భార్య స్థానం ఇవ్వను.. మామూలుగా అంటే ఇది చేసిన దానికి దీన్ని ఇంట్లో నుంచి పంపేయాలి అని ధీరజ్ అంటాడు. చందు షాక్ అయిపోతాడు. నోరు ముయ్యురా,,ఇంకొక్క మాట నీ భార్య గురించి మాట్లాడితే చంపేస్తా చందు అంటాడు. అన్నయ్యా నేను మాట్లాడింది నిజమే కదా అంటే ఏంట్రా నిజం.. ఏం తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావ్,, అమూల్య జీవితం నాశనం చేయమని ప్రేమ విశ్వక్తో చెప్పిందని నీకు ఎవరు చెప్పారు.. అమూల్య చెప్పిందా.. నర్మద చెప్పిందా., పోనీ అమూల్యని ప్రేమ విశ్వక్‌తో మాట్లాడించడం నువ్వు చూశావా.. ఏం తెలుసు అని ప్రేమ మీద నిందు వేస్తున్నావ్ అని అడుగుతాడు.
నర్మద, అమూల్య కూడా అక్కడికి వస్తారు. ప్రేమ చందుని ఆపి బావ ఇక ఈ విషయం వదిలేయండి అని అంటాడు. ఎలా వదిలేయాలి ఏం పాపం తెలీని నిన్ను అంటే ఎందుకు వదిలేయాలి అని చందు అంటాడు. దానికి ధీరజ్ అన్నయ్యా నువ్వు నిజంగా పిచ్చోడివి.. అందుకే దాన్ని పట్టుకొని ఏం పాపం తెలీదు.. అమాయకురాలు అని అంటున్నావ్ అంటాడు. విశ్వక్ గాడికి అమూల్యని ప్రేమించమని చెప్పింది,, ఇద్దరి మధ్య రాయబారం చేసింది ముమ్మాటికీ.. ముమ్మాటికీ.. తనే తనే.. తనే.. అని ధీరజ్ అంటే రేయ్ కాదురా.. అమూల్యని ప్రేమించమని విశ్వక్ గాడికి చెప్పింది ప్రేమ కాదురా.. వల్లీ.. అని అంటాడు. ధీరజ్ షాక్ అయిపోతాడు. అక్కడే ఉన్న అమూల్యని చందు పిలిచి చూస్తూ ఉంటావేంటి ఏం జరిగిందో వీడికి చెప్పి వాడి కళ్లు తెరిపించు అని అంటాడు.
అమూల్య ధీరజ్‌తో అవును అన్నయ్యా.. పెద్దన్నయ్య చెప్పింది నిజమే.. విశ్వక్‌ని ప్రేమించమని నన్ను పదే పదే పోరు పెట్టి చంపింది వల్లీ వదినే అని జరిగింది అంతా చెప్తుంది. ధీరజ్ బిత్తరపోయి నిల్చొంటాడు. విన్నావు కదా మన ఇంటికి ద్రోహం చేసిన అసలు ద్రోహి ఎవరో అందుకే వాళ్ల అమ్మకి బాలేదు అని నాన్నకి అబద్ధం చెప్పి తనని తన పుట్టింట్లో వదిలి వచ్చాను.. రేయ్ మీ వదిన నన్ను మోసం చేసిందిరా.. గొప్ప కోడలు అని నాన్న తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేసింది.. మన కుటుంబాన్ని నిలువునా మోసం చేసిందిరా అని చందు ఏడుస్తాడు. ఏడుస్తున్న చందుని ధీరజ్ వెళ్లి హగ్ చేసుకుంటాడు.
అమూల్య, ప్రేమ కూడా కన్నీరు పెట్టుకుంటారు. తన తప్పు లేకుండా సరే నువ్వు తిడితే ప్రేమ తట్టుకుందిరా.. అసహ్యించుకుంటే భరించిందిరా.. ఇదంతా కేవలం వల్లీ గురించి నాన్నకి తెలీకూడదు అని మా కాపురం కూలిపోకూడదు అని మన ఇంటి పరువు రోడ్డున పడకూడదు అని.. నీ భార్య నిజంగా దేవతరా.. నా భార్యని నేను గుడ్డిగా నమ్మి మోసపోయానురా.. నీ భార్యని అర్థం చేసుకోకుండా నువ్వు దూరం చేసుకోకురా అని చెప్పి వెళ్లిపోతాడు. ధీరజ్ చాలా బాధ పడతాడు. ధీరజ్‌ని చూసుకోమని నర్మద ప్రేమకి సైగ చేసి అమూల్యతో కలిసి లోపలికి వెళ్లిపోతుంది.
సాగర్‌కి మొదటి జీతం రావడంతో సంతోషంగా ఇంట్లో అందరికీ బట్టలు కొంటాడు. భాగ్యం, వల్లీ పెట్టిన పుల్ల వల్ల సేటు రామరాజుని కలిసి సాగర్ తీసుకున్న 20 లక్షలు గురించి చెప్తాడు. నెలకు 60 వేలు వడ్డీ అయినా ఇవ్వడం లేదు.. ఇప్పుడు డబ్బు ఇవ్వకపోతే ఇంటికి వచ్చి గొడవ చేయాల్సి ఉంటుంది.. మీ గౌరవం నా గౌరవం పోతుందని అని అంటాడు. ఆ కోపంలో రామరాజు చిరాకుగా ఇంటికి బయల్దేరుతాడు. మరోవైపు చందుకి శ్రీవల్లి ఎన్ని సార్లు కాల్ చేసినా చందు కాల్ కట్ చేస్తూనే ఉంటాడు. బా నా ఫోన్ కట్ చేస్తున్నాడు.. ఎలా చెప్పాలి.. ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోమని ఎలా చెప్పాలి అనుకుంటూ వాయిస్ మెసేజ్ చేస్తుంది. బా నన్ను క్షమించు ఇంకెప్పుడూ ఇలా చేయను. దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపో అని అంటుంది. చందు చూసి కూడా ఏం రిప్లే ఇవ్వడు దాంతో వల్లీ చాలా బాధ పడతాడు. ప్రేమ ఏడుస్తూ ఉంటే ధీరజ్ వెళ్లి హగ్ చేసుకొని ఏడుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు





















