అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today April 13th: శ్రీలక్ష్మీని ఇంట్లో ఇరికించేందుకు ప్రియంవద చేసిన కుట్ర ఏంటి...? భార్యను అందరి ముందు మ్యాడీ ఎలా కాపాడాడు..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode April 13th: శ్రీలక్ష్మీని ఇంట్లో ఇరికించేందుకు ప్రియంవద చేసిన కుట్ర ఏంటి...? భార్యను అందరి ముందు మ్యాడీ ఎలా కాపాడాడు..?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: శ్రీలక్ష్మీకి విక్రమ్ సారీ చెప్పడానికిరావడంతో ఆమె కంగారుపడి బయటకు వచ్చి అతన్ని ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెబుతుంది. రేపు కాలేజీలో మాట్లాడుకుందామని చెప్పి పంపిస్తుంది. అయితే ఇదంతా మేడపై నుంచి చూసిన ప్రియంవద..లక్ష్మీ ఇంతరాత్రివేళ ఎవరితోనో మాట్లాడుతుందని గమనిస్తుంది.ఇన్నాళ్లు ఇది సరిగ్గా దొరికిందని అనుకుంటుంది.వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగా వీడియో తీస్తుంది. దీంతో శ్రీలక్ష్మీ పని అయిపోయిందని ప్రియంవద సంబరపడిపోతుంది.ఈ వీడియో చూపించి ఇంట్లో వాళ్లందరి ముందు లక్ష్మీ తప్పుడు పనులు చేస్తుందని నమ్మిస్తానని అనుకుంటుంది.దీంతో లక్ష్మీని ఇంట్లో నుంచి బయటకు గెంటివేయడం ఖాయమని....ఆ తర్వాత ఆమె ట్రీట్‌మెంట్ చేయిస్తున్న తన మాజీ మొగుడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి వాడి సంగతి చూస్తానని సంతోషపడుతుంది.
                  విక్రమ్‌తో మాట్లాడి ఇంట్లోకి వస్తున్న శ్రీలక్ష్మీని చూసి ప్రియంవద అక్కడే ఆగమని అరుస్తుంది. ఇంట్లో ఉన్నవాళ్లందరినీ గట్టిగా కేక వేసి పిలుస్తుంది. అమ్మగారు ఇంత కోపంగా అందరినీ పిలస్తుంది అంటే ఖచ్చితంగా  నేను విక్రమ్‌తో మాట్లాడింది చూసే ఉంటుందని శ్రీలక్ష్మీ భయపడుతుంది. ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్లి వస్తున్నావని ప్రియంవద  శ్రీలక్ష్మీని నిలదీస్తుంది. కానీ ఆమె ఏం మాట్లాడకపోయేసరికి ఇందిర అడుగుతుంది.శ్రీలక్ష్మీజోలికి ఎందుకు వెళ్తున్నావని అడుగుతుంది. ఈ లక్ష్మీ మన అందరినీ మోసం చేస్తోందని అంటుంది.మనల్నేకాదని మ్యాడీని కూడా మోసం చేస్తుందని చెబుతుంది. మీ అందరి కళ్లుగప్పి తిరుగుతోందని అంటుంది.రెండురోజులుగా  ఆస్పత్రికిఅని చెప్పి ఎక్కడెక్కడ తిరుగుతున్నావని ప్రియంవద  అడుగుతుంది.ఆ మాటలు విన్న సూర్యనారాయణకు కోపం వస్తుంది. తాను ఆస్పత్రికి వెళ్లి అక్కడ నుంచి కాలేజీకి వెళ్లానని మధుబాబు నన్ను ఆస్పత్రి వద్ద దింపాడని చెబుతుంది. అవన్నీ అబద్ధాలేనని....ఇది మన ఇంటి పరువు తీయడానికి అర్థరాత్రులు ఎవరితోనో మాట్లాడుతుందని ప్రియంవద అంటుంది.ఆ  మాటలు విన్న ఇంట్లో అందరూ షాక్ తింటారు. కాలేజీ,ఇల్లు తప్ప ఏం తెలియని దీనికి వాడిని నేరుగా ఇంటికి రప్పించిందంటే ఇక ఊరిలోఈమెకు ఎన్ని ఘనకార్యాలు ఉన్నాయో చెప్పలేమని అంటుంది. ఆ మాటలు విన్న సూర్యనారాయణ కోపంతో రగిలిపోతాడు. ఇంకొక్క మాట శ్రీలక్ష్మీ గురించి మాట్లాడితే కూతురువని కూడా చూడనని హెచ్చరిస్తాడు.వాళ్ల అన్నయ్య కూడా గట్టిగా ప్రియంవదను మందలిస్తాడు.నీకు లక్ష్మీ అంటే మొదటి నుంచి కోపం ఉందని తెలుసుగానీ...మరీ ఇలాంటి నిందలు వేస్తావని అనుకోలేదని వాళ్ల అమ్మకూడా ప్రియంవదను తిడుతుంది.
                           నా మాటలు అబద్ధమైతే ఈ వీడియో చూడండని శ్రీలక్ష్మీ, విక్రమ్ మాట్లాడుకునే వీడియో అందరికీ చూపిస్తుంది. అది చూసిన మ్యాడీతోపాటు అందరూ షాక్‌తింటారు. ఇప్పటికైనా ఈమె చేసింది తప్పని నమ్ముతారా లేదా అని నిలదీస్తుంది.సుకన్య శ్రీలక్ష్మీపై మండిపడుతుంది.ఇప్పటి వరకు ఈ ఇంటి  ఆడపిల్లలు ఇలాంటి పనులు చేయలేదని అంటుంది. అత్త హైమావతి కూడా శ్రీలక్ష్మీ చేసింది తప్పేకదా అని అంటుంది.ప్రియంవద వీడియో చూపించిన తర్వాత కూడా నమ్మకపోతే ఎలా అని అంటుంది. దీంతో సూర్యనారాయణ శ్రీలక్ష్మీని అడుగుతాడు.నువ్వు ఏ తప్పు చేయవని నేను నమ్ముతున్నానని....అదే విషయం నోరుతెరిచి నిజం చెప్పమని అంటాడు.ఇక దాన్ని అడిగేది ఏముందని...మెడపట్టి బయటకు గెంటివేయమని ప్రియంవద అంటుంది.అంతలో మ్యాడీ కల్పించుకుని ఆ వచ్చిన అబ్బాయి ఎవరో కాదని మా కాలేజీలో సీనియర్‌ని చెబుతాడు. ఉదయం కాలేజీలో జరిగిన విషయం వివరించి సారీ చెప్పడానికే వచ్చి ఉంటాడని చెబుతాడు. అవునని శ్రీలక్ష్మీచెప్పడంతో అంతా సర్దుకుంటుంది.మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడమని ప్రియంవదను సూర్యనారాయణ హెచ్చరిస్తాడు.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget