Bigg Boss Updates: బిగ్ బాస్ హౌజ్ లో లాక్ డౌన్- దొంగిలించబడిన పవర్ అస్త్ర సందీప్ కి దొరుకుతుందా?
బిగ్ బాస్ సందీప్ కి ఇచ్చిన పవర్ అస్త్ర చోరీకి గురైంది. దాన్ని కనిపెట్టేందుకు సందీప్ తో పాటు మిగతా ఇంటి సభ్యులు వెతుకుతున్నారు.
బిగ్ బాస్ ఇంట్లో లాక్ డౌన్ పెట్టేశారు. తను ఎంతో కష్టపడి గెలుచుకున్న పవర్ అస్త్రం కొట్టేశారంటూ ఆట సందీప్ అసహనం వ్యక్తం చేశాడు. అసలు తన పర్మిషన్ లేకుండా తన గదిలోకి ఎందుకు వచ్చారంటూ ఇంటి సభ్యుల మీద కోపం ప్రదర్శించాడు. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పెట్టిన మొదటి టాస్క్ ‘ఫేస్ ది బీస్ట్’ లో సందీప్, ప్రియాంక పవర్ అస్త్ర కోసం తలపడ్డారు. వీరిద్దరిలో చివరికి సందీప్ విజేతగా నిలవడంతో పవర్ అస్త్ర దక్కించుకున్నాడు. ఇప్పుడు అది దొంగతనానికి గురైంది. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు.
బిగ్ బాస్ ఇంట్లో హై టెన్షన్..
పవర్ అస్త్ర కనిపించడం లేదని సందీప్ డల్ గా కూర్చుంటే అమర్ వచ్చి ఏడు రోజులు కష్టపడి ఆడితే మీ అస్త్రం లేకుండా పోయిందని సానుభూతిగా మాట్లాడాడు. దాన్ని ఎవరో దొంగిలించారని, తన బెడ్ దగ్గర పూలు కూడా పడ్డాయని సందీప్ మిగతా ఇంటి సభ్యులకు చూపిస్తూ చెప్తుంటే నువ్వు తీసినప్పుడు పడ్డాయ్ ఏమోనని టేస్టీ తేజ అంటాడు. ఇంత చీప్ మైండ్ ఉంటే వర్కౌట్ కాదని సందీప్ అసహనం వ్యక్తం చేశాడు. చీప్ అనే మాటలు వాడొద్దని తేజ సందీప్ తో వాదించాడు. అయితే దొంగతనం చేయడం కూడా కరెక్ట్ కాదు కాదని సందీప్ సీరియస్ అయ్యాడు. రణధీర, మహాబలి టీమ్ లో ఎవరో ఒకరు తీశారని కానీ అది ఎవరో తనకి తెలియదని లాజిక్ మాట్లాడేందుకు శోభా శెట్టి ట్రై చేస్తుంది. రతిక వాళ్ళ టీమ్ మీద అనుమానం ఉందని శోభా అనేసరికి ఏం తెలియకుండా బ్లెమ్ చేయవద్దని రతిక సీరియస్ అయిపోయింది.
ఇంట్లో అంగుళం అంగుళం మొత్తం వెతుకుతారు. కానీ దామిని మాత్రం అస్త్ర వెతికేందుకు వెళ్ళకుండా పనులు చేసుకుంటూ కనిపించింది. అటు శుభశ్రీ కూడా టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. అసలు తన పర్మిషన్ లేకుండా తన గదిలోకి వెళ్ళడానికి ఎవరికీ అనుమతి లేదు అలాంటప్పుడు ఎలా వెళతారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని సందీప్ కెమెరా ముందుకు వచ్చి అసహనం వ్యక్తం చేశాడు. నిజానికి ఆ పవర్ అస్త్ర దొంగిలించింది శుభశ్రీ. తనకి సహాయంగా దామిని కూడా నిలిచింది. అందుకే వాళ్ళు మిగతా ఇంటి సభ్యులతో కలిసి ఉండకుండా టెన్షన్ పడ్డారు. మాయాస్త్రం టాస్క్ జరిగే టైమ్ లో శుభశ్రీ దాన్ని దొంగిలించి బాత్ రూమ్ లో దాచి పెట్టేసింది. మరి ఈ విషయం మహాబలి టీమ్ కి తెలుసా లేదా? అసలు దొంగని ఎలా కనిపెట్టారు? పవర్ అస్త్ర మళ్ళీ సందీప్ చేతికి చిక్కుతుందా లేదా అనేది తెలియాలంటే ఈరోజు పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read: 'ప్రశాంత్ స్థానంలో శివాజీ ఉంటే ఇలాగే వల్గర్ గా మాట్లాడతారా'? అంటూ ప్రశ్నించిన బిగ్ బాస్ ఫేమ్ అఖిల్
View this post on Instagram