అన్వేషించండి

Akhil- Prasanth: 'ప్రశాంత్ స్థానంలో శివాజీ ఉంటే ఇలాగే వల్గర్ గా మాట్లాడతారా'? అంటూ ప్రశ్నించిన బిగ్ బాస్ ఫేమ్ అఖిల్

బిగ్ బాస్ ఇంట్లో రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ సమయంలో రైతు బిడ్డ ప్రశాంత్ ని టార్గెట్ చేసి మాట్లాడటంపై బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ స్పందించాడు.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కి సంబంధించిన వీడియోలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం ఇటీవల జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో అమర్ దీప్, ప్రశాంత్ మధ్య జరిగిన వాగ్వివాదం. రైతు బిడ్డ అనే సెంటిమెంట్ వాడుకుంటూ సింపథీ క్రియేట్ చేసుకుంటున్నావంటూ రతిక కూడ రివర్స్ అయి మాట్లాడింది. హౌస్ లోకి వచ్చినప్పుడు ప్రశాంత్ తరఫున మాట్లాడిన రతిక నామినేషన్స్ లో తన అసలు రంగు బయట పెట్టిందని అంటున్నారు. ఈ గొడవపై బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ స్పందించాడు. అమర్ దీప్, రతిక చేసిన పని తనకి ఎంత మాత్రం నచ్చలేదని తన పూర్తి సపోర్ట్ ప్రశాంత్ కి అంటూ చెప్పాడు. దీనికి సంబంధించి వీడియో రిలీజ్ చేశాడు.

“పల్లవి ప్రశాంత్ నామినేషన్ చూస్తే చాలా బాధగా అనిపించింది. రా, రేయ్ అంటూ కొంతమంది ప్రశాంత్ గురించి వల్గర్ గా మాట్లాడారు. కానీ తను మాత్రం అక్క, అన్న, చెల్లి అంటూ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ తన వాయిస్ వినిపించేందుకు ట్రై చేస్తుంటే ఆపేశారు. అదే పొజిషన్ లో శివాజీ ఉంటే ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదు. ప్రశాంత్ కాబట్టి ఈజీగా తీసుకున్నారు. వీడియోస్ లో అతను బతిమలాడుకున్నాడని అంటున్నారు. అందరికీ తెలిసిందే అవును కానీ దాన్ని రిమైండ్ చేస్తూ అడుక్కుని వచ్చావని అనడం చాలా బ్యాడ్. అతను గేమ్ ఆడటానికి వచ్చాడు. ఒకర్ని అడిగేటప్పుడు చేతులు జోడించి అడుగుతారు. అదే చేస్తున్నాడు గేమ్ కోసం ఆడుతున్నాడు అన్నీ ఎమోషన్స్ చూపిస్తున్నాడు. అందులో తప్పేముంది. రతిక మొదట వచ్చినప్పుడు ఎలా ఉంది.. నామినేషన్స్ టైమ్ లో తను పూర్తిగా ఛేంజ్ అయిపోయింది. ప్రశాంత్ బిగ్ బాస్ గేట్ దగ్గర కూర్చున్నానని చెప్పినప్పుడు తనకి ఎంతో సపోర్ట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చి ఏం చేశావ్ అన్నట్టు మాట్లాడింది. నువ్వేం దిగులు పడకు ప్రశాంత్” అని ధైర్యం చెప్తూ వీడియోలో మాట్లాడాడు. ‘జై జవాన్.. జై కిసాన్’ తను ఎక్కడి నుంచి వచ్చాడనే విషయం మర్చిపోలేదు. అందరూ అతడిని గౌరవించండి అంటూ అఖిల్ సార్థక్ వీడియో పోస్ట్ చేశాడు.

Also Read: బిగ్ బాస్ హౌస్ లో దొంగతనానికి విశ్వప్రయత్నాలు- మాయాస్త్ర ఎవరికి దక్కుతుంది?

అసలేం జరిగిందంటే.. 

బిగ్ బాస్ ఇంట్లో రెండో వారం నామినేషన్స్ సమయంలో అమర్ దీప్ ప్రశాంత్ ని నామినేట్ చేస్తూ మాట్లాడాడు. దాదాపు 15 నిమిషాల పాటు పల్లవి ప్రశాంత్‌ను ఎందుకు నామినేట్ చేస్తున్నాడో వివరించాడు అమర్‌దీప్. తను చెప్పిన కారణాలకు, మాటలకు చాలామంది కంటెస్టెంట్స్ సపోర్ట్‌గా నిలబడ్డారు. అమర్‌దీప్ చెప్పిన మాటలు నిజం అనిపించిన మరికొందరు కంటెస్టెంట్స్ కూడా ప్రశాంత్‌ను నామినేట్ అవ్వడానికి ముందుకొచ్చారు. ‘నువ్వు రైతుబిడ్డ అనే సెంటిమెంట్ దారి ఎంచుకున్నావు. ‘బిగ్ బాస్’ అంటే అంత ఇష్టమయితే ‘బిగ్ బాస్’ ఎందుకు చూడలేదు? సీజన్స్ అన్నీ చూసి చాలా నేర్చుకొని వచ్చావు. నీలో బయట ఉన్న వినమ్రత అదంతా ఇక్కడ లేదు. ఇక్కడ నీలో ఉన్న ఇంకొక యాంగిల్ బయటికొస్తుంది. అవకాశం వచ్చేవరకు ఒక ప్రశాంత్, అవకాశం వచ్చాక ఒక ప్రశాంత్‌లాగా ఉన్నావు. ఇలా ఉంటే బయట ఆడియన్స్ ప్రోత్సహించరు. రైతు అని నువ్వు ప్లే చేస్తున్న సెంటిమెంట్‌ను నమ్మడానికి ఎవరు పిచ్చివాళ్లు కాదు. నీ ఒరిజినాలిటీ తెలిస్తే వారే బయటికి పంపిస్తారు’ అంటూ ప్రశాంత్‌ను నామినేట్ చేసి వెళ్లిపోయింది రతిక. 

View this post on Instagram
 
A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Embed widget