Bigg Boss Updates: బిగ్ బాస్ హౌస్ లో దొంగతనానికి విశ్వప్రయత్నాలు- మాయాస్త్ర ఎవరికి దక్కుతుంది?
బిగ్ బాస్ ఇచ్చిన మాయాస్త్రం తాళం చెవి కాపాడుకోవడం కోసం రణధీర టీం ప్రయత్నిస్తుంది.
బిగ్ బాస్ ఇచ్చిన మాయా అస్త్రంకి సంబంధించిన తాళం చెవిని రణధీర టీం జాగ్రత్తగా కాపాడుకోవాలి. తాళం ఇచ్చినట్టే ఇచ్చి మరొక ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. ఆ తాళం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే మాయాస్త్రం దక్కుతుందని టాస్క్ ఇచ్చినట్టు ఉన్నాడు. దీంతో దాన్ని దొంగిలించేందుకు మహాబలి టీం విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఆ తాళం చెవి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి మాయ అస్త్రం దొరుకుతుందని గౌతమ్ కృష్ణ దామినితో చెప్తాడు. దాన్ని కాపాడుకోవడానికి అమర్ దీప్, శివాజీ దాచేయడానికి చూస్తున్నారు. తాళం చెవి ఎలాగైనా సొంతం చేసుకోవడానికి మహాబలి టీం సభ్యులు తంటాలు పడుతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
బిగ్ బాస్ టాస్క్ లన్నీ అయిపోయిన తర్వాత బాక్స్ ఇస్తాడు. దాన్ని ఓపెన్ చేయాలంటే ఆ కీ కావాలని తేజ తన తోటి సభ్యులతో చెప్తాడు. అంటే అది విన్ అయిన వాళ్ళది మాత్రమే కాదు దాన్ని మనం దొంగతనం చేద్దామని గౌతమ్ కృష్ణ దామినితో చెప్పాడు. తాళం మీద మన కన్ను ఉండాలి, కానీ ఆ కన్ను ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదని అంటాడు. తాళం దొంగతనం చేయాలనే ప్లాన్ అపొజిట్ టీంకి ఏ మాత్రం తెలియకుండా జాగ్రత్త పడాలని మహాబలి టీం సభ్యులు అనుకుంటారు. శివాజీ ఆ తాళం చెవిని నడుముకు వేసుకునే బెల్ట్ లో పెట్టి దాచి పెట్టి పడుకుంటాడు. అది కాస్త ప్రశాంత్ గమనిస్తాడు. అన్నీ కళ్ళు తాళం మీదే ఉన్నాయని ప్రియాంక అంటుంది. నిద్రపోవాలని అనుకున్న శివాజీ ఆ బెల్ట్ ని నడుముకి వేసుకుని పడుకుంటాడు. మరి రణధీర టీం ఆ తాళం జాగ్రత్తగా కాపాడుకుని మాయా అస్త్రం అందిపుచ్చుకుందా? లేదంటే మహాబలి టీం తాళం దొంగిలించి అస్త్రాన్ని సొంతం చేసుకుందో తెలియాలంటే బిగ్ బాస్ లైవ్ చూసి తీరాల్సిందే.
ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7లోని మొదటి వారంలో పవర్ అస్త్రా అనే ఒక అస్త్రాన్ని సొంతం చేసుకున్నాడు సందీప్. దీంతో తను బిగ్ బాస్ హౌజ్‌లో పర్మనెంట్ హౌజ్‌మేట్ అయిపోయాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా మాయాస్త్రం కోసం పోటీపడాలి అంటూ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా స్టైల్‌లో ఒక పిట్టకథను అందరికీ వినిపించారు బిగ్ బాస్. హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా రెండు టీమ్స్‌లాగా విడిపోయారు. ఆ టీమ్స్‌కు రణధీర, మహాబలి అని పేర్లు పెట్టారు. రణధీర టీమ్‌లో అమర్‌దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, శివాజీ, షకీలా ఉండగా.. మహాబలి టీమ్‌లో టేస్టీ తేజ, దామిని, శుభశ్రీ, రతిక, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ ఉన్నారు. సందీప్.. సంచాలకులు వ్యవహరించాడు.
రణధీర, మహాబలి టీమ్స్ మధ్య జరిగిన మొదటి ఛాలెంజ్.. ‘పుల్ రాజా పుల్’. మూడు సార్లు జరిగిన ఈ ఛాలెంజ్ లో రణధీర టీం విజేతలుగా నిలిచి మాయా అస్త్రానికి సంబంధించిన తాళం చెవిని సొంతం చేసుకున్నారు.
View this post on Instagram