By: ABP Desam | Updated at : 21 Apr 2022 08:12 AM (IST)
Guppedantha Manasu 21th April 430 (Image Credit: Star Maa/Hot Star)
స్కాలర్‌షిప్ టెస్టు రాసేందుకు చేయి ఎత్తలేదని వసుధారకు గట్టిగానే క్లాస్ పీకుతాడు రిషి. ఏదో వివరణ ఇచ్చేందుకు వసుధార ప్రయత్నిస్తున్నా పట్టించుకోడు. ఈ మధ్య చదువుపై భవిష్యత్‌పై ఇంట్రెస్ట్ పోతుందని గదమాయిస్తాడు. దీంతో కాస్త ఇబ్బంది పడ్డ వసుధార... క్లాస్‌లో చాలా మంది చేయి ఎత్తలేదని వాళ్లందరినీ వదిలేసి నన్నే తిటడం ఏంటని నిలదీస్తుంది. క్లాస్‌లో చాలా మంది ఉన్నప్పటికీ వసుధార ఒక్కర్తే ఉందని... నువ్వు సమ్‌థింగ్ స్పెషల్ కదా అంటాడు. కచ్చితంగా స్కాలర్‌షిప్ టెస్టు రాస్తున్నావని... చాలా టఫ్‌గా ఉంటుందని జాగ్రత్తగా చదువుకోమని గైడ్ చేస్తాడు రిషి. అంతా అయిపోయాక వెళ్లొచ్చా అని అడుగుతుంది. దీనికి ఏమీ తక్కువ లేదు సీరియస్‌గా ఫేస్ పెడతాడు. నాకు ఈ పరీక్షలేంటో అంటూ నసుగుతూ వెళ్లిపోతుంది.
తెల్లారేసరికి వసుధార ఇంటి వద్ద టచ్చాడుతూ ఉంటాడు రిషి. ఇంకా రాలేదంటా అని ఆలోచిస్తుంటాడు. పాపం చిన్న రూంలో ఇబ్బంది పడుతుందేమో అనుకుంటాడు. ఇంతలో గౌతమ్ రిషికి ఫోన్ చేస్తాడు. ఎక్కడ ఉన్నావు అంటూ ఆరా తీస్తాడు. అప్పుడే వసుధార ఎంట్రీ ఇస్తుంది. అంతే గౌతమ్‌కు ఏదో చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. రిషిని అక్కడ చూసి వసుధార ఆశ్చర్యపోతుంది. ఇక్కడేంటి మీరు అంటూ ప్రశ్నిస్తుంది. ఓ స్టూడెంట్‌తో పని ఉండి వచ్చానని చెప్తాడు. గౌతమ్ ఫోన్ చేశాడా అని అడుగుతాడు.. అవునని చెప్తుంది వసుధార. ఎందుకని క్వశ్చన్ చేస్తాడు. మాట్లాడితే ఏదో చెప్తూ ఉంటాడని ఎలాగోలా తప్పించుకొని వచ్చానని అంటుంది. అప్పుడు రిషి రిలాక్ష్ అవుతాడు. అంటే ఈ వెదవ వసుధారకు ఏం చెప్పలేదన్నమాట.. నేను భయపడుతున్నట్టు ఏమీ లేదు కదా అని మనసులో అనుకుంటాడు. రూమ్‌లోకి రమ్మని చెప్తుంది. చూసిందే కదా అంటూ రిషి అన్నా వదలదు. అక్కడ పరిస్థితులు చూసిన రిషి నీకు రూమ్ సౌకర్యవంతంగా లేదు కదా అంటే... తప్పదు కదా సార్.. నాకు ఇది చాలు అంటుంది. రిషి ఆమెను చూస్తూ.. నీకు చదువు, నీ లక్ష్యం ముఖ్యమని మరోసారి హితబోధ చేస్తాడు. పరిస్థితులు ఎలా మారుతున్నా నీ దృష్టిని మాత్రమ మరల్చొద్దని చెప్తాడు. చెప్పి వెళ్లిపోతాడు... పిలుస్తున్నా పట్టించుకోడు. ఇది చెప్పడానికి ఇక్కడి వరకు రావాలా... అదేదో ఫోన్‌లో చెప్పేయొచ్చు కదా అనుకుంటుంది వసుధార.
రిషీ రెస్టారెంట్‌లో కూర్చొని ఉంటాడు. కాఫీ తీసుకొస్తుంది. ఇంతలో నీకో మెసేజ్ పంపించాను చూడు అంటాడు. ఏంటని అడుగుతుంది. ఇక్కడే ఉన్నాను కదా... చెప్పేయండని సలహా ఇస్తుంది. అయ్యో నాకు ఎందుకు ఇలాంటి ఐడియాలు రావని కాస్త వెటకారంగా మాట్లాడుతాడు. ఆ మెసేజ్ రూమ్‌కు వెళ్లి తీరిగ్గా చదువుకో మంటాడు. అప్పటి వరకు టెన్షన్ పడటం ఎందుకు క్లూ ఇమ్మని రిక్వస్ట్ చేస్తుంది. వెయిట్ చెయ్ అంటాడు.. ఇదే క్లూ అని చెప్పి వెళ్లిపోతాడు. వెళ్తూ వెళ్తూ రెస్టారెంట్ మేనేజర్‌తో ఆమెను జాగ్రత్తగా చూసుకోమని సలహా ఇస్తాడు. ఇంతలో నా ఫోన్ నా ఇష్టమంటూ ఫోన్ చూడడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే వచ్చిన రిషీ హలో ఇంటికెళ్లి చూడమంటే ఇక్కడే ఎందుకు చూస్తున్నావని నిలదీస్తాడు. ఫోన్ నీదే కావచ్చని మెసేజ్ మాత్రం నాదంటాడు.
రూమ్‌కు వెళ్లాక రిషి పంపించిన మెసేజ్‌లో ఏముందో చూస్తుంది వసుధార. లెక్కల పరీక్ష పెట్టారా అంటూ భయపడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక జగతి మేడమ్‌కు ఫోన్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకుంటుంది. మెసేజ్ చేసిన వెంటనే ఫోన్ చేస్తుందని అనుకుంటాడు రిషి కానీ ఎంతటైంకీ ఫోన్ రాదు. తనే చేస్తే ఎంగేజ్ వస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కాక కాసేపు టెన్షన్ పడతాడు. ఇంతలో గౌతమ్ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ కనిపిస్తాడు. అది కూడా రొమాంటిక్‌గా... అంతే రిషికి అనుమానం వస్తుంది. వెంటనే వెళ్లి గౌతమ్ ఫోన్ చూస్తాడు.
కాలేజీకి వసుధార లేట్‌గా వస్తుంది. దీనికి పనిష్‌మెంట్ ఇస్తాడు రిషి. అప్పటి వరకు చెప్పని ఓ లెక్కను బోర్డుపై రాసిన వసుధారకు చేయమంటాడు. వసుధార భయపడుతూ వెళ్లి చేస్తుంది. దీంతో ఆశ్చర్యపోతాడు రిషి. అందర్నీ పంపించేసి వసుధారను ఉండమంటాడు. ఏమంటారో అని భయపడుతుంది. కానీ రాత్రంతా ఫోన్ ఫుల్ బిజీ వచ్చింది ఎవరితో మాట్లాడుతున్నావో అని ఆరా తీస్తాడు.
రేపటి ఎపిసోడ్
కారులో ఎక్కడికో వెళ్లడానికి రిషి, వసుధార, మహేంద్ర, జగతి బయల్దేరుతారు. ముగ్గురు వెనక సీట్లో కూర్చొంటారు. ముగ్గురూ వెనకేే కూర్చున్నారని మండిపోతుంటాడు రిషి ఇంతలో సడెన్ బ్రేక్ వేస్తాడు.
Janaki Kalaganaledu మే 27 (ఈరోజు) ఎపిసోడ్: వంటల పోటీలకు వెళ్తున్న జానకీరామచంద్రకు సునంద షాక్- స్వీట్ షాప్ ఓపెన్ చేస్తున్నామని ఆహ్వానం
Karthika Deepam మే 27(ఈ రోజు) ఎపిసోడ్: రెస్టారెంట్‌లో జ్వాలతో క్లోజ్‌గా ఉంటున్న నిరుపమ్- రగిలిపోతున్న హిమ
Guppedantha Manasu మే 27(ఈరోజు) ఎపిసోడ్: ఐలవ్యూ చెప్పిన రిషి- నీది ప్రేమే కాదంటూ సింపుల్‌గా రిజెక్ట్ చేసిన వసుధార
Janaki Kalaganaledu మే 26 (ఈరోజు) ఎపిసోడ్: జానకీ,రామా వైజాగ్ వెళ్లొద్దన జ్ఞానాంభ- విష్ణు ప్లాన్‌తో బుక్కైన మల్లిక
Karthika Deepam మే 26(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్ చేసిన పనికి జ్వాల, హిమ హ్యాపీ- రగిలిపోతున్న శోభ, స్వప్న
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!