అన్వేషించండి

Guppedantha Manasu November 08th Episode: నిలదీసిన ఏంజెల్ - నిజం చెప్పిన రిషి, దేవయానికి ఇచ్చిపడేసిన ఫణీంద్ర!

Guppedantha Manasu Today Episode: రిషి-వసుధార పెళ్లి గురించి తెలుసుకుని ఏంజెల్-విశ్వనాథం షాక్ అవుతారు..ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu November 08th Episode (గుప్పెడంతమనసు నవంబరు 08 ఎపిసోడ్)

ఇంటికి వచ్చిన తర్వాత ఏంజెల్ డల్ గా కూర్చుని ఉంటే..ఎందుకమ్మా అలా ఉన్నావని అడుగుతాడు విశ్వనాథం..
ఏంజెల్: వాళ్లు పెళ్లిచేసుకున్నందుకు నాకు బాధలేదు విశ్వం..కానీ..రిషి ఒక్కమాట కూడా చెప్పనందుకు బాధపడుతున్నాను.
విశ్వనాథం: పెళ్లైపోయింది కదా వదిలెయ్
ఏంజెల్: రిషిని బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కానీ నేను తనకి ఏమీ కానని ఇలా చెప్పాడేమో... వసుధారతో మంచి స్నేహం ఏర్పడింది కానీ తను కూడా అలా చేస్తుందని అనుకోలేదు..
విశ్వం: నువ్వు బాధపడితే తట్టుకోలేను..సంతోషంగా ఉండాలి..నువ్విలా బాధపడితే ఎలా..చెప్పు..నాకు నువ్వు తప్ప ఎవరున్నారు.. ఉన్నవాళ్లు అందర్నీ పోగొట్టుకున్నాను..మిగిలినవాళ్లని నా దగ్గరకు రమ్మన్నా రారు ( అనుపమ ఇంట్లోకి వచ్చిన సంగతి ఇంకా విశ్వనాథంకి తెలియదు)..వాళ్లు నా గురించి పట్టించుకోరు... అమ్మా ఏంజెల్..దయచేసి నువ్వు ఎక్కువగా ఆలోచించి ఏవేవో ఊహించుకోవద్దు..నిన్ను చూస్తే గుండె బరువెక్కుతోంది..
ఏంజెల్: నేను నాలానే ఉంటాను..రిషి ఎందుకిలా చేశాడన్నది మాత్రం అడగాలి.. ( ఒక్కమాట చెబితే అయిపోయేది కదా అని మనసులో అనుకుంటుంది)

Also Read: రిషిధారని చూసి షాక్ లో విశ్వనాథం-ఏంజెల్, అనుపమ వచ్చేసింది!

రిషి-వసుధార ఓ దగ్గర ఆగి..ఏంజెల్ మాటలు గుర్తుచేసుకుంటారు.
రిషి: వాళ్ల దగ్గర మనవిషయం దాచినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు నేను తనని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు
వసు: అప్పుడు నిజం చెప్పేందుకు అవకాశం లేకపోయింది..
రిషి: అప్పుడు మనం బంధంమీద మనకే క్లారిటీ లేనప్పుడు వాళ్లకి ఏం చెబుతాను..అప్పుడు నేనున్న పరిస్థితుల్లో నా ఆలోచనలు వేరు..నీకు నాపై పూర్తి నమ్మకం ఉన్నప్పుడు నువ్వు చెప్పి ఉండాల్సింది..నువ్వు అన్న ఏమాటా నేను కాదనలేదు కదా..ఏంజెల్ తో చెప్పి ఉండొచ్చు కదా
వసు: ఈ వసుధార ఎప్పటికీ మీ మాటకే నేను కట్టుబడి ఉంటుంది..ఇప్పుడు ఇలా అంటున్నారు కానీ అప్పుడు నేను చెప్పి ఉంటే ఇలా ఆలోచించేవారు కాదు..అయినా మీరు ఏ తప్పూ చేయలేదు..అలా జరిగిపోయింది అంతే..వీటి గురించి వదిలేయండి..మీ ఫ్రెండ్ షిప్ నిలబెట్టుకునేందుకు ఏం చేయాలో చూడండి
రిషి: నాకు నమ్మకం ఉంది..ఏంజెల్ నన్ను అర్థం చేసుకుంటుందని..
వసు: స్నేహం-ప్రేమలో అపార్థాలు దూరాలు ఏర్పడితే కలిగే బాధ మనం భరించలేం..అది అనుభవించిన తర్వాత ఆ బాధ ఎవ్వరికీ రాకూడదు అనిపించింది... పదండి వాళ్లు మనకోసం వెయిట్ చేస్తుంటారని బయలుదేరుతారు...

Also Read: కల్లోలం వెంటేసుకొచ్చే పిల్లగాలి - ఓవైపు రొమాన్స్ మరోవైపు రివెంజ్ - రిషిధారలు అస్సలు తగ్గట్లేదు

మహేంద్ర ఒక్కడే ఇంట్లో ఉంటాడు..అప్పుడే వస్తారు ఫణీంద్ర, దేవాయని, శైలేంద్ర.. ప్రేమగా వెళ్లి అన్నయ్యని హగ్ చేసుకుంటాడు మహేంద్ర.  రిషి గురించి ఆరా తీస్తుంటాడు శైలేంద్ర..ఎక్కడి వెళ్లాడు, ఎప్పుడొస్తాడంటూ వరుస ప్రశ్నలు వేస్తుంటాడు.. ఇద్దరూ మిషన్ ఎడ్యుకేషన్ పనిమీద బయటకు వెళ్లారంటాడు. వాళ్లు ఎక్కడికి వెళ్లారో చెప్పండి నేను వెళతానని శైలేంద్ర అంటే నాకు తెలియదంటాడు మహేంద్ర. 
ఫణీంద్ర: నువ్వు చేసే ఘనకార్యాలు చాలు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు కాసేపు సైలెంట్ గా ఉండు శైలేంద్ర అనేసి.. మహేంద్ర వాళ్లు లేనప్పుడు నువ్వొక్కడివే ఎందుకు మనింటికి రా...కనీసం భోజనం చేసి వద్దువు గానివి అని పిలుస్తాడు
దేవయాని: మేం నీకు అంత చేదైపోయామా..
మహేంద్ర: నా మనసులో అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ లేదు
దేవయాని: ఆ పరిస్థితుల్లో నిన్ను అలా అనాల్సి వచ్చింది..తప్పైపోయిందని చెప్పాను కదా..అయినా నన్ను క్షమించలేవా
మహేంద్ర: మీరన్న మాటలు నా మనసుని కలిచివేశాయి వాటిని నేను మర్చిపోలేను..అయినా ఆ ఇంట్లో నా జగతి లేదు..ఆ ఇంట్లో అడుగుపెట్టలేను.. ప్లీజ్..రిషి ఏం ఆలోచించి బయటకు తీసుకొచ్చాడో తెలియదు కానీ నాకు మనశ్సాంతిని ఇచ్చే పని చేశాడు.. 
ఫణీంద్ర: నువ్వు పక్కన లేకుండా తింటే అన్నం కూడా సహించడం లేదు..నాకోసం రా 
మహేంద్ర: నా పరిస్థితిని అర్థం చేసుకోండి అన్నయ్యా..మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి..నాక్కూడా మీతో కలసి భోజనం చేయాలనుంది..కావాలంటే ఇక్కడే భోజనం చేద్దాం..
దేవయాని: ఇక్కడ అవసరం లేదు..
ఫణీంద్ర: భోజనం చేయమని మిమ్మల్ని అడగలేదు..నన్ను అడిగాడు..సమాధానం చెప్పాల్సింది నేను..మహేంద్ర కోరుకున్నది జరగాలి నేను ఇక్కడే భోజనం చేస్తాను..మీకు ఇష్టం లేకపోతే మీరు వెళ్లొచ్చు
శైలేంద్ర: బాబాయ్ ఇష్టప్రకారమే చేద్దాం...అందరం కలసి ఇక్కడే భోజనం చేద్దాం అంటాడు శైలేంద్ర

Also Read: ఈ రాశులవారు ఈ రోజు ఆర్థికంగా నష్టపోతారు, నవంబరు 08 రాశిఫలాలు

విశ్వనాథం ఇంటికి వస్తారు రిషి-వసుధార...
విశ్వం: ఏంజెల్ ను పెళ్లిచేసుకోమంటే నీకు పెళ్లైందన్నావ్..నీకు పెళ్లైతే వసుధారని ఎలా పెళ్లిచేసుకున్నావ్..ఎందుకిలా చేశావ్ చెప్పు రిషి..
రిషి: అందుకు ఓ కారణం ఉంది
ఏంజెల్: కారణం ఉంది రిషి..ఆ కారణం ఏంటో నేను చెప్పనా..రిషి తన భార్య ఎవరో చెప్పాల్సి వస్తుందని అందుకే వసుధారని పెళ్లిచేసుకున్నాడు..నన్ను పెళ్లిచేసుకోవడం ఇష్టం లేక వసుధారని భార్య అనిచూపించాడు అంతేనా రిషి..
విశ్వం: నీకు భార్య అయ్యే అర్హత నా మనవరాలికి లేదనుకున్నావా..ఏంజెల్ ని కాదని వసుధారని ఎలా పెళ్లిచేసుకున్నావ్..నేను తనని కించపరచడం లేదు..కానీ..నువ్వు నా మనవరాలిని కించపరుస్తున్నావని బాధపడుతున్నాను..నువ్వు ఏంజెల్ ని పెళ్లిచేసుకుంటే తనని, విష్ కాలేజీని బాగా చూసుకుంటావని ఆశపడ్డాను..తను పెళ్లిచేసుకోవాలనుకున్నది నిన్ను అని తెలియగానే సంబరపడ్డాను.. అందుకే నిన్ను అడిగాను.. అప్పుడు కూడా నీకు నా ఆశ అర్థం కాలేదా..ఏంజెల్ ని పెళ్లిచేసుకోమంటే కారణాలు చెప్పావ్..నువ్వు వసుధారని పెళ్లి చేసుకుంటున్నానని ఒక్కమాట చెప్పి ఉంటే మేం ఎక్కడున్నా కళ్లారా మీ పెళ్లి చూసేవాళ్లం కదా..
ఏంజెల్: ఇప్పుడు కూడా మౌనంగా ఉంటావేంటి రిషి..విశ్వం అడుగుతున్నాడు కదా సమాధానం  చెప్పు
రిషి: సర్..నాకు మీ మంచితనం తెలుసు..కానీ ఇదంతా కావాలని చేయలేదు..కాకపోతే అలా జరిగిపోయింది అంతే..
ఏంజెల్: జరిగిపోయింది అంతే అంటే..మేం ఏమని అర్థం చేసుకోవాలి..
రిషి: ఎవ్విరీథింగ్ హ్యాపెండ్..నాట్ ప్లాన్డ్... మా పెళ్లి జరగడానికి కారణం మా అమ్మ...
ఏంజెల్: మీ అమ్మ ఎవరు..ఎన్నిసార్లు అడిగినా మీ అమ్మా నాన్న గురించి చెప్పలేదు..ఆ రోజు నన్ను పెళ్లిచేసుకోవడం ఇష్టంలేక నీకు భార్య ఉందని చెప్పావు..ఈ రోజు ఈ విషయం కప్పి పుచ్చుకునేందుకు అబద్ధం చెబుతున్నావా
రిషి: మా అమ్మ కూడా మీకు తెలుసు..జగతి మేడం..
విశ్వనాథం-ఏంజెల్ ఆశ్చర్యపోతారు... అసలు నువ్వు ఏం చెబుతున్నావ్..వాళ్లు నీ ఆత్మీయులు అన్నావు కదా..కొత్తగా ఇప్పుడేంటి మీ అమ్మ అంటున్నావ్..
రిషి: మహేంద్ర-జగతి నా ఆత్మీయులు కాదు..నా తల్లిదండ్రులు.. కాలేజీలో తనను అవమానించి పంపించిన సంఘటన సహా అన్నీ వాళ్లకు చెబుతాడు.. అందుకే మీకు నేను నా గతం చెప్పడానికి ఇష్టపడలేదు..నేను మీకు నా భార్యని చూపిస్తానని చెప్పాను కదా.. అప్పుడు చూపిస్తానన్నది కూడా వసుధారనే..నాకు-వసుధారకి నిశ్చితార్థం అయిపోయిన తర్వాతే మేం విడిపోయాం..
ఏంజెల్: మళ్లీ ఇదో కొత్త కథనా.. 
రిషి: నేను చెబుతున్నది నిజం..వసుధార నేను ప్రేమించుకున్నాం అని వాళ్ల కథ చెబుతాడు...నేను తనని ప్రేమిస్తున్న విషయం నాకన్నా ముందు మా అమ్మ కనిపెట్టింది ( అప్పట్లో జగతి చెప్పిన విషయం గుర్తుచేసుకుంటాడు). మేం సంతోషంగా ఉన్న సమయంలో మా మధ్య చికాకులు వచ్చాయి, మా మధ్య దూరం పెరిగిపోయింది..ఒకరిపై మరొకరికి ప్రేమ ఉన్నా ...ఒకరికొకరు తెలియనట్టే ఉన్నాం..మా ప్రేమను బయటకు చెప్పుకోలేక,మనసులో దాచుకోలేక మనోవేదన అనుభవించాం.. మా అమ్మ కోరిక తీర్చడంకోసం మా మధ్య దూరం పక్కనపెట్టి ఇద్దరం ఒక్కటయ్యాం.. మా ప్రేమకున్న బలం అలాంటిది..మా ప్రేమ కోసం ఒక్కటయ్యాం..
వావ్..సూపర్ రిషి నువ్వు..కథ చాలా బాగా చెప్పావ్..ఈ కథంతా ఇప్పటికిప్పుడు భలే అల్లావ్ తెలుసా అంటుంది..
రిషి-వసుధార అవుతారు....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Embed widget