అన్వేషించండి

Guppedantha Manasu May 13th Episode: రిషినే రావాలా ఏంటి - శైలేంద్రని క్లీన్ బౌల్డ్ చేసేసిన వసు అండ్ కో - గుప్పెడంత మనసు మే 13 ఎపిసోడ్!

Guppedantha Manasu Serial Today: మను అరెస్టుతో మరో మలుపు తిరిగింది గుప్పెడంత మనసు. రాజీవ్ - శైలేంద్ర స్కెచ్ లకు చెక్ పెట్టేందుకు వసుధార- మహేంద్ర కొత్త ప్లాన్ వేశారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Guppedantha Manasu Serial Today Episode:  (గుప్పెడంతమనసు మే 13 ఎపిసోడ్)

మను డబ్బులు కట్టమనడంతో వసు-మహేంద్ర..ఫణీంద్రతో డిస్కషన్ మొదలుపెడతారు. దేవయాని ఫైర్ అవుతుంటుంది. 
దేవయాని: ఆ మను మొదట్నుంచీ అంతే..నాకు నమ్మకం లేదు..ఎవ్వరికి చెప్పినా వినలేదు...మను ఫ్రాడ్
ఫణీంద్ర: దేవయాని నువ్వు ఆగు...శైలేంద్ర ఇదే పనిపై నువ్వు మనుని కలిశావు కదా..ఏం జరిగిందో చెప్పు..
శైలేంద్ర: తను ఆ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదనేశాడు
ఫణీంద్ర: కాలేజీకి మను నోటీస్ పంపించాడు అనేది ఇదంతా నిజమే అనిపిస్తోందా?
దేవయాని: ఇంకా ఆ మాట అగుతారేంటి..నోటీస్ వచ్చింది కదా
ఫణీంద్ర: నాకు మాత్రం ఇది నమ్మాలని అనిపించడంలేదు..మను చాలా మంచి వ్యక్తి..ఎదుటివాళ్లకు సాయం చేసే మనిషే కానీ ఇలా ప్రాబ్లెమ్ క్రియేట్ చేసే మనిషి కాదు..సరే నోటీస్ అంటున్నారు కదా ఇప్పుడు ఏం చేద్దాం..
మహేంద్ర: కాలేజీని మను జప్తు చేయకుండా ఆపాలి..అలా జరగాలంటే మనం 50కోట్లు కట్టాలి...అంత మొత్తం మన దగ్గర లేదు..నాకు తెలిసి ఒకేఒక మార్గం ఉంది..ముందు మను పోలీస్ కస్టడీ నుంచి బయటకు రావాలి..అప్పుడు ఏదో ఒకటి చేసి కాలేజీని జప్తు చేయకుండా అపొచ్చు.. ఏదైనా చేసి మన కాలేజీని మనం కాపాడుకోవాలి.
ఫణీంద్ర: కాలేజీ కోసం మనం ఎంతదూరం అయినా వెళదాం..ఎవరి హెల్ప్ అయినా తీసుకునేందుకు సిద్ధంగా ఉందాం...ఏమంటావ్ శైలేంద్ర..
శైలేంద్ర: మీరు ఎలా చెబితే అలాగే...

Also Read: మే 14న వృషభ రాశిలోకి సూర్యుడు, ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు!

మనుని వాళ్లంతా మోసగాడు అంటుంటే నాకు కష్టంగా ఉందమ్మా అంటాడు మహేంద్ర
( వసు-అనుపమ ఇద్దరూ మొహాలు చూసుకుంటారు..మను మహేంద్ర కొడుకు అన్నవిషయం వాళ్లిద్దరకే తెలుసు)
వసు: ఇదంతా నిజం అని శైలేంద్ర నమ్ముతున్నాడు మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది..ఇలాంటి టైమ్ లో వాళ్లేదో వాగారని మీరు రియాక్ట్ అయితే వాళ్లకి అనుమానం వచ్చే అవకాశం ఉంది..అప్పుడు మొదటికే మోసం వస్తుంది..మను నిర్దోషి అని నిరూపించేందుకు ఉన్న మార్గం ఇది.. మనం ఓపికగా ఉండాలి..ఈ విషయంలో ఆవేశం అస్సలు పనికిరాదు మావయ్య...
మహేంద్ర: అందుకే కదమ్మా ఇవన్నీ ఓర్చుకుంటున్నాను..మనుపై ఉన్న అభిమానం ప్రేమ నన్ను కుంగదీస్తున్నాయి
వసు: ఇదంతా నిజం కాదు కదా
మహేంద్ర: నా మనసు దాన్ని తీసుకోవడం లేదు..కానీ తప్పదు..మనకు కావాల్సింది మను బయటకు రావడం...
అనుపమ: మనుకోసం మీరు ఇంత కష్టపడుతుంటే నాకు భయంగా ఉంది
వసు: శైలేంద్ర, రాజీవ్ గుట్టు బయటపెట్టాలంటే మనం కూడా వాళ్లలానే ఆలోచించాలి..
అనుపమ: పొరపాటున వాళ్లకి మీ గురించి తెలిసపోతే మీకేమైనా అవుతుందన భయంగా ఉంది
మాకేం కాదు అని ధైర్యం చెబుతారు మహేంద్ర, వసుధార...నీకు భయం అయితే నువ్వు ఈ మ్యాటర్లో కలుగజేసుకోవద్దు అని కరాఖండిగా చెప్పేస్తాడు మహేంద్ర...
మహేంద్ర: నీ భయం వల్ల మనుకి ప్రశాంతత లేకుండా చేశావ్...మనుకి తండ్రి ఎవరో చెప్పలేదు, తన దృష్టిలో తండ్రిని విలన్ చేశావ్...ఈ భయస్తులు మాకు దూరంగా ఉంటే మంచిది
అనుపమ: దానికి దీనికి సంబంధం ఏంటి
మహేంద్ర: మనుని కావాలని ఇరికించారు...సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయి..అందుకే మేం ఈ ప్రయత్నం చేస్తున్నాం...ఇది ఫెయిల్ అయితే మరో ప్లాన్ వేస్తాం..వాళ్లకి భయపడి ఓ మూలన కూర్చునే రకం కాదు..

Also Read: వార ఫలం - మే 12 నుంచి మే 18 వరకు!

శైలేంద్ర ఒంటరిగా కూర్చుని...మను మాటలు, మహేంద్ర మాటలు గుర్తుచేసుకుంటాడు...ఇప్పుడేం చేయాలి, బాబాయ్ వచ్చి డాడీకి చెప్పారు, ఆ నోటీస్ పంపించింది మను అంటే నమ్మడం లేదు..వాడేమో అలాంటి కండిషన్ పెట్టాడు...ఏం తోచడం లేదే..నాకు చెప్పిన డీల్ గురించి డాడీకి తెలియదు లేదంటే నా పరిస్థితి ఏంటో అని ఆలోచనో పడతాడు.. ఇంతలో అక్కడకు దేవయాని వస్తుంది...
దేవయాని: ఏం చేస్తున్నావో అర్థమవుతోందా..ఏం జరుగుతోంది? రాజీవ్ ఎక్కడున్నాడు
శైలేంద్ర: వాడు...అని ఆగిపోతాడు...కాసేపు కవర్ చేసి..వాడు చచ్చిపోయాడు కదా..స్వర్గంలోనో నరకంలోనో ఉండి ఉంటాడు.. అని కవర్ చేస్తుంటాడు
దేవయాని: అంత కంగారుగా చెబుతున్నావేంటి..నేను జస్ట్ వాడెక్కడున్నాడని అడిగాను అంతే... నువ్వేదో దాస్తున్నావ్ అదేంటో చెప్పు...
శైలేంద్ర: ఏమీ లేదు
ఇంతలో ధరణి వచ్చి..ఏంటి అత్తయ్యా..ఆయనేదో దాస్తున్నారని నేను మీకు-మావయ్యకి చెప్పాను కదా అని పుల్ల వేస్తుంది... అప్పుడప్పుడు పాతకాలం లవ్ సాంగ్స్ కూడా పెడుతున్నారని అంటుంది.. నిద్రపట్టకపోతే మ్యూజిక్ పెట్టుకోవచ్చు కదా లవ్ సాంగ్స్ ఎందుకు పెట్టాలి అంటుంది. ధరణిపై శైలేంద్ర ఫైర్ అవుతుంటే...ఇప్పుడు నేను ఏమన్నానని అలా అరుస్తున్నారని దేవయానికి కంప్లైంట్ చేస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు అని శైలేంద్ర అంటే..అత్తయ్యా మీరైనా అర్థం చేసుకోండి అని చెప్పేసి వెళ్లిపోతుంది ధరణి...
శైలేంద్ర: నాకు కుర్చీ మోజు తప్ప ఇంకేంలేదు..అదేదో వాగుతోంది 
దేవయాని: ముందు రాజీవ్ విషయం చెప్పు..
శైలేంద్ర: నేను ఏదో ఆలోచనలో ఉన్నాను డిస్ట్రబ్ చేయకు.. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపో..
దేవయాని: ఏం చెప్పడం లేదు..సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావ్..మను కాలేజీకి నోటీస్ పంపించిన విషయం, నువ్వు వాడి దగ్గరకు వెళ్లిన విషయం ఎందుకు చెప్పలేదు.. మహేంద్ర వచ్చి ఆ టాపిక్ చెప్పాడు కాబట్టి అవును అని తలాడించావ్ లేదంటే చెప్పేవాడివి కాదు..
సర్లే నువ్వు వెళ్లలేవు కదా నేనే వెళతానంటాడు.. విషయం చెప్పు అని మళ్లీ అడిగినా కానీ శైలేంద్ర చెప్పకుండా వెళ్లిపోతాడు..

Also Read: ఈ రోజు రాశిఫలాలు (13/05/2024)

వసుధార, మహేంద్ర ఇద్దరూ కాలేజీకి బయలుదేరుతారు..శైలేంద్ర కదలికలు గమనించాలి, తెలివిగా అడుగేయాలి అని జాగ్రత్తలు చెబుతుంది. టైమ్ చాలా తక్కువ ఉంది..ఇన్ టైమ్ లో ప్లాన్ సక్సెస్ కావాలని అనుకుంటారు.. శైలైంద్ర, రాజీవ్ ఇద్దరూ కలసి మనల్ని దెబ్బకొట్టారు... అందుకే శైలేంద్రని ఎరగా వేసి రాజీవ్ ని బయటకు లాగాలి అనుకుంటారు... కానీ వాళ్లు అంత ఈజీగా ఎవ్వర్నీ నమ్మరు..జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు...
ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది

గుప్పెడంతమనసు మే 14 ఎపిసోడ్ లో శైలేంద్ర - రాజీవ్ ప్లాన్ బయటపడనుంది....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Embed widget