ఈ రోజు రాశిఫలాలు (13/05/2024)
Daily Horoscope: మే 13 సోమవారం ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...
Daily Horoscope - రాశిఫలాలు (13-05-2024)
మేష రాశి
ఈ రోజు ఒడిదొడుకులతో నిండి ఉంటుంది. మీరు కుటుంబ జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. తెలియని భయం వల్ల మనస్సు కలత చెందుతుంది. ఆరోగ్యం విషయంలో ఆందోళనలు పెరుగుతాయి. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారంలో కొత్త ప్రాజెక్ట్‌లో పని చేసే అవకాశం ఉంటుంది. ఖర్చులు తగ్గించే ప్రణాళికలు వేసుకోండి.
వృషభ రాశి
ఈ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది. వ్యాపారం విస్తరిస్తారు. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధి నుంచి ఉపశమనం పొందుతారు. కార్యాలయంలో సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. వృత్తి జీవితంలో మీ ప్రతిభను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండండి. ఇది పురోగతికి అనేక బంగారు అవకాశాలను అందిస్తుంది. ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.
మిథున రాశి
ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు అందుతాయి. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటారు. తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. మీ ఖర్చులను నియంత్రించేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది.
Also Read: వార ఫలం - మే 12 నుంచి మే 18 వరకు!
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు తమ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ దినచర్య నుంచి చిన్న బ్రేక్ తీసుకోండి. స్వీయ సంరక్షణ కార్యకలాపాలలో పాల్గొనండి. కుటుంబానికి కొంత సమయం కేటాయిస్తే ప్రశాంతత దొరుకుతుంది.
సింహ రాశి
మీ జీవనశైలిలో కొన్ని మార్పులు వస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి. ఆర్థిక విషయాల్లో కొత్త ప్రణాళిక వేసుకోండి. సామాజిక హోదా పెరుగుతుంది. మీ పని సంతోషకరమైన ఫలితాలను ఇస్తుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. ప్రతి రంగంలో విజయాల మెట్లు ఎక్కుతాం. వృత్తి జీవితంలో చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. కొత్త ప్రాజెక్టు బాధ్యతలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. మీ భావాలను భాగస్వామితో పంచుకోవడానికి ఇదే సరైన సమయం.
కన్యా రాశి
ఈ రోజు మీరు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి రావొచ్చు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆధ్యాత్మిక పనులపట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. మీరు మీ భాగస్వామితో ఆహ్లాదకరమైన క్షణాలను ఆనందిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాహనం జాగ్రత్తగా నడపండి.
Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!
తులా రాశి
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కోర్టు కేసుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావొచ్చు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తెలియని భయం వల్ల మనసు కలత చెందుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో బాధ్యత పెరుగుతుంది. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. నూతన దంపతులు ఒకర్నొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది.
వృశ్చిక రాశి
ఆర్థిక విషయాలలో తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజు ఓ శుభవార్త అందుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కార్యాలయంలో అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. ఆహారంపై శ్రద్ధ వహించండి.
ధనస్సు రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఆరోగ్యం గురించి మీలో ఆందోళన పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యక్తిగత జీవితంలో కలవరం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. కార్యాలయంలో నెట్‌వర్క్ పెరుగుతుంది. కెరీర్ వృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు
మకర రాశి
ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు అవుతారు. ధన ప్రవాహం పెరుగుతుంది. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు అందుతాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది.
Alos Read: పురాణాల్లో సింగిల్ మదర్స్ వీళ్లే - ఎన్నో కష్టాలు పడ్డారు కానీ తనయుల్ని వీరులుగా తీర్చిదిద్దారు!
కుంభ రాశి
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో ఒడిదొడుకులు ఎదురవుతాయి. కార్యాలయంలో పోటీ వాతావరణం ఉంటుంది. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు..మీ పనికి చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతాయి.దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. ప్రేమ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
మీన రాశి
ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్త అవసరం. జీవితంలో కొత్త ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. పెద్ద మొత్తంలో ఖర్చుచేసేముందు మరోసారి ఆలోచించండి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.