అన్వేషించండి

Guppedantha Manasu March 21st Episode: గుండెల్ని పిండేసే ఎపిసోడ్ - జగతి, రిషిని గుర్తుచేసిన అనుపమ-మను! , గుప్పెడంత మనసు మార్చి 21 ఎపిసోడ్!

Guppedantha Manasu Serial Today: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Guppedantha Manasu Serial Today Episode:  (గుప్పెడంతమనసు మార్చి 21st ఎపిసోడ్)

అనుపమ మీ తల్లి అని ఎందుకు దాచావు..తను కూడా ఏదీ చెప్పదు అన్నీ దాస్తుంది..నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అంటూ మహేంద్ర ప్రశ్నిస్తాడు. 
ఏంజెల్: చెప్పు మను ఎందుకు ఈ విషయం దాస్తున్నారు..అత్తయ్యను చాలాసార్లు అడిగాను, నిన్ను కూడా అడిగాను చెప్పు
వసు: అక్కడ జరిగిన ఇన్స్ డెంట్ గురించి మీ పీఏ మాట్లాడారు..ఆ ఫొటోకి మీకు ఏ సంబంధం లేదని చెప్పారు.. మీరు నోరు తెరిచి నిజంచెప్పకపోవడం వల్లే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను..కానీ మీరు నిజం చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. మౌనం పాటించాల్సిన సమయంలో పాటించకపోవడం ఎంత ముఖ్యమో...మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడడం కూడా అంతే ముఖ్యం
మహేంద్ర: నా కొడుకు కూడా జగతిని చాలా కాలం మేడం అనేవాడు..మీ ఇద్దరి మధ్యా కూడా ఏదైనా గొడవ జరిగిందా
ఏంజెల్: నువ్వు నిజంగా మా అనుపమ అత్తయ్య కొడుకువేనా
మను: నేను నిజంగా తన కొడుకునే..తను నా కన్న తల్లే... కానీ నేను తనకి మాటిచ్చాను..నిజానికి మాటఇచ్చాను అనే కన్నా తనే ఒట్టు వేయించుకుని నా దగ్గర మాటతీసుకుంది... (అమ్మా అని పిలవొద్దని)...కానీ ఈ రోజు ఆ మాట తప్పాను ( అనుపమని పొడిచేసినప్పుడు అమ్మా అని పిలిచాడు) ఆ మాట తప్పడం నన్ను బాధపెడుతోంది...తను లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు..నాకోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టింది..ఆ పరిస్థితుల్లో తనకిచ్చిన మాట తప్పాల్సి వచ్చింది. నేనే కాదు నా ప్లేస్ లో ఎవరున్నా అలానే చేసేవారేమో...
మహేంద్ర: మనుసులో ఇంత బాధ పెట్టుకుని ఇన్నాళ్లూ ఎలా సైలెంట్ గా ఉన్నావ్
మను: నాకు ఊహ తెలిసాక తెలిసిన ఒకే మాట అమ్మ, కనిపించిన రూపం కూడా అమ్మో..తను నాకోసం ఎంతో చేసింది..నన్ను సంతోషంగా చూడడం కోసం ఎంతో చేసింది...తన ఆశలు పక్కనపెట్టింది, ఆశయాలు త్యాగం చేసింది..ఏమిచ్చినా తన రుణం తీర్చుకోలేను.. అంత గొప్పగా పెంచింది...కానీ నన్ను వెంటాడే ఓ ప్రశ్నతో తనని వేధించాను...తప్పు చేశాను..
ఏంజెల్: మను...బాధపడకకు అని ఓదార్చుతుంది...

Also Read: కేజీఎఫ్ BGM తో పిండేశారు - అనుపమ గతం గురించి చెప్పనున్న మను , గుప్పెడంత మనసు మార్చి 20 ఎపిసోడ్!

అనుపమ స్పృహలోకి వచ్చిందని తెలియడంతో అందరూ లోపలకు వెళతారు... మను మాత్రం బయటే ఆగిపోతాడు.. రా అని మహేంద్ర పిలిచినా నేను తర్వాత వస్తాను అనేస్తాడు... వసుధార, ఏంజెల్, మహేంద్ర లోపలకు వెళతారు... ఎలా ఉందని అడుగుతారు, ధైర్యంగా ఉండమని చెబుతారు..
మహేంద్ర: నీ ప్రాణాలకు తెగించి నీ కొడుకు ప్రాణాలు కాపాడుకున్నావ్ గ్రేట్ నువ్వు.. ఓబిడ్డ క్షేమం కోసం తల్లి ఎంతవరకైనా వెళుతుంది అనేందుకు ఇదే నిదర్శనం...కానీ నిజాన్ని ఎందుకు దాచావో అర్థం కాలేదు..
వసు: నిజాన్ని దాచిపెట్టారు కానీ కొడుకుపై ఉన్న ప్రేమని దాచలేకపోయారు...మను వచ్చినప్పటి నుంచీ మీ ఇద్దర్నీ గమనిస్తూనే ఉన్నాం.. మీ ప్రవర్తనలో మాటలో తేడా గమనించాం...తన దగ్గర మౌనంగా ఉంటూనే కనిపించకుండా కన్నప్రేమను చూపించారు.
మహేంద్ర: ఆ రోజు తనకి కొద్దిగా పొలమారితేనే కంగారుపడ్డావ్..కన్నతల్లి మాత్రమే అంతలా కంగారుపడగలవు
ఏంజెల్: మీ ఇద్దరి మధ్యా గతంలో ఏవైనా మనస్పర్థలు ఉన్నాయేమో అనుకున్నాను కానీ నీ కొడుకే అని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు కూడా నీ కళ్లు తనకోసమే వెతుకుతున్నాయని అర్థమైంది ...తనని లోపలకు రమ్మని చెప్పినా రాలేదు...
నువ్వెళ్లి తీసుకురామ్మా అని వసు, ఏంజెల్ ని పంపిస్తాడు...

Also Read: నేటి రాశి ఫలాలు (21/03/2024) - ఈ రాశివారు అహంకారం తగ్గించుకోకుంటే చాలా కోల్పోతారు!

అమ్మకి ఏమీ కాకూడదు అంటూ దేవుడిని కోరుకుంటాడు మను...ఇంతలో వచ్చిన ఏంజెల్ బావా అని పిలవబోయి ఆగి మను అని పిలుస్తుంది.. అత్తయ్య స్పృహలోకి వచ్చింది నిన్ను రమ్మంటున్నారని చెబుతుంది...
మను: నేను వెళ్లలేను
ఏంజెల్: ఎందుకు
మను: వెళితే తను ఇబ్బంది పడతారు..ఇన్నాళ్లూ మా మధ్య జరిగింది అదే..
వసు: ఇన్నాళ్లూ వేరు ఇప్పుడు వేరు...
మను: ఏ పరిస్థితి అయినా కానీ నేను వెళ్లలేను..
వసు: ఆవిడ మిమ్మల్ని పిలిచారని చెప్పినా వెళ్లరా...
నిజంగా పిలిచారా అని మను ఆశ్చర్యంగా అడిగితే..తన కళ్లు మీకోసమే వెతుకున్నాయి...మిమ్మల్ని తీసుకొస్తామని చెప్పే బయటకు వచ్చాం అంటుంది వసుధార... 
ఏంజెల్: అత్తయ్య బాధ కన్నీళ్ల రూపంలో బయటకు పోవాలంటే నువ్వు తన దగ్గరకు వెళ్లాలి..నీకు మాత్రం తనని చూడాలని ఉండదా ఏంటి 

Also Read: శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈ రాశివారికి యోగకాలం - ఆ ఒక్క విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవ్!

అనుపమ-మహేంద్ర
అసలు మనుపై అటాక్ చేసినవాడు ఎవడు..వాడిని చూడగానే ఎందుకంత అలర్ట్ అయ్యావ్? వాడిని గతంలో ఎప్పుడైనా చూశావా అని అడుగుతాడు. అంతలోనే ఆ విషయాలేవీ వద్దులే తర్వాత మాట్లాడుకుందాం అంటాడు మహేంద్ర. అయినా మనుపై అంత ప్రేమ పెట్టుకుని ఇన్నాళ్లూ అలానే ఉండిపోయావ్ ఎందుకు? మనసులో ప్రేమ పెట్టుకుని బయటకు అలా ఉండాలంటే కష్టంగా ఉంటుంది కదా... గొప్ప గొప్ప యుద్ధాలు అయినవాళ్లమధ్యే జరుగుతాయి అంటారు ఇదేనేమో అంటాడు మహేంద్ర. కానీ ఓ కొడుకు అమ్మని అమ్మా అని పిలవలేకపోవడం అంటే మీ ఇద్దరి మధ్యా ఏదో పెద్ద సంఘటనే జరిగి ఉంటుంది అంటాడు... ఇంతలోనే మను లోపలకు వస్తాడు... 
మను: ఇప్పుడెలా ఉంది..బానే ఉన్నారు కదా.. డాక్టర్ గారు తొందర్లోనే కోలుకుంటారు అన్నారు, ధైర్యంగా ఉండండి..
మహేంద్ర: మను ఆర్ యూ ఓకే....ఎక్కువ ఏమోషనల్ అవుతున్నట్టున్నావ్..మాటల్లో తడబాటు కనిపిస్తోంది
మను: ఏం లేదు సర్
మహేంద్ర: నీ ప్రతి మాటలోనూ చివర్లో ఓ పదం మిస్సవుతోంది.. దానివల్ల నీ ఎమోషన్ బ్యాలెన్స్ తప్పుతున్నట్టు కనిపిస్తోంది..
మను: మీ ప్రాణాలకు తెగించి నా ప్రాణాలు కాపాడారు..థ్యాంక్స్.. మీరు అలా రాకుండా ఉండే నాపై అటాక్ చేసి ఉండేవాడు కదా.. పోతే నేనే పోయి ఉండేవాడిని కదా..
ఆ మాట విని అనుపమ కన్నీళ్లు పెట్టుకుంటుంది...
మహేంద్ర: టెన్షన్ పడకు మను..
మను: Sorry...మీకిచ్చిన మాట తప్పినందుకు నన్ను క్షమించండి..ఇంకెప్పుడూ మిమ్మల్ని అలా పిలవను..అని కన్నీళ్లతో నమస్కారం పెడతాడు...
మహేంద్ర ...మనుని ఓదార్చుతాడు...

మహేంద్రకి కాల్ చేసిన ఫణీంద్ర..అనుమప యోగ క్షేమాల గురించి ఆరాతీస్తాడు.. అసలు అటాక్ చేసినవాడు ఎవడు? వాడి గురించి ఏమైనా తెలిసిందా? కచ్చితంగా వాడిని పట్టుకోవాలి మహేంద్ర అస్సలు వదిలిపెట్టకూడదు...ఈ విషయం తేలిగ్గా తీసుకోకూడదు...అసలు మను ఎవరికీ హాని చేయని మనిషి, తనపై అటాక్ చేయడం ఏంటి? మనుకి శత్రువులు ఎవరై ఉంటారని ఫణీంద్ర అంటాడు
మహేంద్ర: కలికాలంలో మంచి వాళ్లకే శత్రువులు ఉంటారు..మంచి చేయడం చూడలేక కొందరు దుర్మార్గులు ఇలా చేస్తున్నారు
ఫణీంద్ర: మను శత్రువులు ఎవరో మనుపై అటాక్ చేశారు అనిపిస్తోంది
మహేంద్ర: నేను తొందర్లోనే అన్ని విషయాలూ బయటపెడతాను మీరు ప్రశాంతంగా ఉండండి
ఫణీంద్ర: మను అనుపమ కొడుకేంటి...
మహేంద్ర: నాక్కూడా ఇప్పుడే తెలిసింది...
అనుపమ యోగక్షేమాల గురించి ఆరాలు మొదలెడుతుంది దేవయాని....

గుప్పెడంత మనసు ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది...

గుప్పెడంత మనసు మార్చి 22 ఎపిసోడ్ (Guppedantha Manasu March 22nd Episode)లో  ‌అనుపమ మాట్లాడితే అసలు విషయం తెలుస్తుంది....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
State Wise EV Subsidy: ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు - ఏపీ, తెలంగాణల్లో ఎంత వస్తుంది?
ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు - ఏపీ, తెలంగాణల్లో ఎంత వస్తుంది?
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Embed widget