అన్వేషించండి

Guppedantha Manasu March 14th Episode: రిషి వచ్చే రోజు దగ్గరపడిందన్న వసు - తనకి రక్షకుడిని అంటూ రాజీవ్ కి క్లారిటీ ఇచ్చిన మను , గుప్పెడంతమనసు మార్చి 14 ఎపిసోడ్!

Guppedantha Manasu Serial Today: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Guppedantha Manasu Serial Today Episode:  (గుప్పెడంతమనసు మార్చి 14th ఎపిసోడ్)

వ‌సుధార బ‌ర్త్‌డేను గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేస్తాడు మ‌ను. అవ‌న్నీ చూసి వ‌సుధార ఎమోష‌న‌ల్‌ అవుతుంది. కేక్ కట్ చేసిన తర్వాత వసుధార మాట్లాడుతుంది
వసుధార
నాకు నిజంగా ఈ బర్త్ డే చేసుకోవడం ఇష్టంలేదు..కానీ మీరంతా రిషి సర్ మాస్కులు పెట్టుకుని విశెష్ చెబుతుంటే తనే వచ్చి నాకు స్వయంగా చెప్పినట్టు అనిపించింది. ఎండీ ప‌ద‌వి చేప‌ట్టిన త‌ర్వాత చాలా క‌ష్టాలు ఎదుర‌య్యాయి...మాన‌సికంగా చాలా కృంగిపోయాన‌ు ఆ క‌ష్టాలు త‌ట్టుకోలేక ఎండీ ప‌ద‌వితో పాటు కాలేజీ వ‌దిలిపెట్టాల‌ని చాలా సార్లు అనుకుంటున్న‌ాను కానీ మీ అందరి అభిమానం చూసిన తర్వాత  నా కంఠంలో ప్రాణం ఉండ‌గా కాలేజీ వ‌దిలిపెట్ట‌న‌ు. ఎన్ని క‌ష్టాలు ఎదురైనా, ఎంత మంది ఎన్ని కుట్ర‌లు చేసినా (శైలేంద్రను చూస్తూ అంటుంది) ఎండీ ప‌ద‌విని వదిలేది లేదు. నాకు శుభాకాంక్షలు చెప్పిన అందరకీ మరోసారి థ్యాంక్స్ చెబుతున్నాను... థ్యాంక్స్ మను...
మహేంద్ర: ఆ దేవుడు మాకు రిషిని దూరం చేసి నిన్ను మా దగ్గరకు పంపించాడు అనుకుంటా...నీవల్లే వసుధరా ఇంత సంతోషంగా ఉంది
రిషి ఫొటో చూస్తూ వసుధార సంతోషపడుతుంది...

Also Read: రిషి సమక్షంలో వసుధార బర్త్ డే సెలబ్రేషన్స్ - రాజీవ్ కి ఝలక్ ఇచ్చిన మను!

దేవయాని-శైలేంద్ర
అసలేంటి ఇది.. క‌ళ్ల ముందే వ‌సుధార బ‌ర్త్‌డే గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసినా ఏం చేయ‌లేక‌పోయాం, ప్రతి ఒక్కరూ ఆ వసుధారకి భజన చేయడమే అందరూ దానికి  సన్మానాలు సత్కారాలు చేస్తుంటే మనం చప్పట్లు కొట్టడం తప్ప ఏమీ చేయలేకపోయాం అని ఫైర్ అవుతుంది దేవయాని. ఏం చేస్తాం మమ్మీ...మనం వేసిన ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. అయినా రిషి లేకపోవడం ఏంటి మనుగాడు వచ్చాడు కదా...నా ప్లాన్ ను తిప్పికొట్టి నన్ను ఫూల్ చేశాడు. మొత్తం వాడే చేశాడు తట్టులేకపోతున్నాను. అసలు మనం వెళ్లకుండా వెళ్లాల్సింది అనుకుంటారు. ఏదో ఒకటి చేయాలి నాన్నా అంటుంది దేవయాని..... 
ఇంకేం చేయాలి అత్తయ్య మిగిలిన కేక్ తినేయడమే అని ధరణి ఎంట్రీ ఇస్తుంది...మిగిలిన కేక్ తింటే మంచి ఐడియాలు వస్తాయి అంటుంది. వసుధార బర్త్ డే కేక్ తీసుకొచ్చి ఇస్తుంది.. వద్దు అంటుంది దేవయాని... మీకెందుకు మొహమాటం అంటూ నోట్లో కుక్కుతుంది... అత్తయ్య అంటే మొహమాటపడ్డారు మీకెందుకు మొహమాటం అంటూ శైలేంద్ర నోట్లో కుక్కుతుంది...బెల్ట్ రెడీ చేయమంటారా? నేను రెడీ చేసి తీసుకొస్తాను ఈ లోగా మీరు ఈ కేక్ తినేయండి అనేసి ఓ చురకేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ధరణి...

ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మేష రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

వసు-మను అండ్ కో
మళ్లీ థ్యాంక్స్ చెబుతాడు మహేంద్ర...నీవల్లే ఇదంతా సాధ్యమైంది మను అని పొగిడేస్తాడు. ఏంజెల్ కూడా హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతకీ మీ బర్త్ డే ఎప్పుడు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం అని అడుగుతుంది ఏంజెల్. కానీ మను సైలెంట్ గా ఉండిపోతాడు. జోక్యం చేసుకున్న అనుపమ తనకు చెప్పడం ఇష్టంలేనట్టుంది అంటుంది. మ‌నుకు చెప్ప‌డం ఇష్టం లేక‌పోతే మీరు చెప్పండ‌ని అనుప‌మ‌ను అడుగుతుంది ఏంజెల్‌. నాకేం తెలుసు అని అనుప‌మ త‌డ‌బ‌డుతుంది. ఎదుటివాళ్ల‌ను ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌ని తెలియ‌దా అంటూ ఏంజెల్‌పై ఫైర్ అవుతుంది. మ‌నుతో మాట్లాడిన ప్ర‌తిసారి అనుప‌మ సీరియ‌స్ ఎందుకు అవుతుందో  అర్థం కాక...అదే విషయం అడిగేస్తుంది. 
మహేంద్ర: నీకు ఏంజెల్ త‌ప్ప ఎవ‌రూ లేరు క‌దా...నీ ప్రేమ‌, కోపం అన్ని ఏంజెల్‌కు మాత్ర‌మే సొంతం. నీకు త‌ను త‌ప్ప ఎవ‌రూ లేర‌ని చెబితేనే ఏంజెల్ కోపం పోతుంది
ఆ మాటలకు షాక్ అయిన మను అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తాడు కానీ ఏంజెల్ ఆపుతుంది. మీ బర్త్ డే ఎప్పుడో చెప్పలేదు అంటుంది
మను: అది గుర్తుంచుకోవాల్సిన రోజు కాదు. అందుకే మ‌ర్చిపోయాన‌ని కోపంగా రిప్లై ఇస్తాడు...
నేను కనుక్కుంటానని బ‌దులిస్తాడు మ‌హేంద్ర  

శ్రీ క్రోధి నామ సంవత్సరం వృషభ రాశి ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి....

రిషి ఫొటో చూస్తూ ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాన‌ని  మీరు ప‌క్క‌న లేర‌నే లోటు మాత్రం క‌నిపించింది. వ‌సుధార ఈ స్థాయికి చేరుకోవ‌డానికి మీరే కార‌ణం , మీ కోసం ఈ ప్రాణం ఎదురుచూస్తోంద‌ని అంటుంది. మ‌ను వ‌ల్ల మీరు తిరిగివ‌స్తార‌నే న‌మ్మ‌కం బ‌ల‌ప‌డుతుంద‌ని, మ‌నం ఒక్క‌ట‌య్యే రోజు తొంద‌ర‌లోనే ఉంద‌ని అంటుంది. తండ్రికి ఫోన్ చేసి త‌న బ‌ర్త్‌డేను మ‌ను గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేశాడ‌ని సంతోషంగా చెబుతుంది వసుధార. 

మను-రాజీవ్
మ‌ను కారులో వెళుతుండగా అడ్డుకుంటాడు రాజీవ్. కారుకు బైక్ అడ్డుపెడ‌తాడు. ఈ రోజు వ‌సుధార‌కు కేక్ తినిపించాల‌ని అనుకున్నా. కానీ క‌రెక్ట్‌గా కేక్ తినిపించే టైమ్‌లో నేల‌పాలు చేశావ‌ని   కోపంతో ర‌గిలిపోతాడు రాజీవ్‌. చాలాసార్లు వసుధారని కలిసేందుకు ప్రయత్నించాను ప్రతిసారీ అడ్డొస్తున్నావు.. వ‌సుధార నా మ‌ర‌ద‌లు...వ‌సు నాది అని కోపంతో అంటాడు. రాజీవ్ కూడా రిషి మాస్క్ వేసుకుని బ‌ర్త్‌డే వేడుక‌కు వ‌చ్చాడ‌ని మ‌ను అర్థం చేసుకుంటాడు. ఓ అమ్మాయి మ‌న‌సు గెలుచుకొని ద‌క్కించుకోవాలి. అంతే కానీ వెంట‌ప‌డి ఇబ్బంది పెట్టేవాళ్ల‌ను ఏమంటారో తెలుసా...కుక్క అని అంటారు.  వ‌సుధార‌ను తెగ పొగిడేస్తున్నావు...ఈరోజు వ‌సు బ‌ర్త్‌డేను ఎవ‌రు చేయ‌మ‌న్నారని నిలదీస్తాడు రాజీవ్.  నీలాంటి మృగాలు వ‌సు వెంట‌ప‌డ‌కూడ‌ద‌నే ఆమెకు ర‌క్ష‌ణ‌గా ఉంటున్నాన‌ని  బ‌దులిస్తాడు. ఇద్దరూ ఒకరి కాలర్ మరొకరు పట్టుకుంటారు.
గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది

Also Read: ఈ రాశుల వారు అందర్నీ గుడ్డిగా నమ్మేయవద్దు - మార్చి 14 రాశిఫలాలు

గుప్పెడంత మనసు మార్చి 15 ఎపిసోడ్ లో (Guppedantha Manasu March 15th Episode) మను vs రాజీవ్ పెద్ద గొడవే జరిగేట్టుంది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget