అన్వేషించండి

Horoscope 14th March 2024: ఈ రాశుల వారు అందర్నీ గుడ్డిగా నమ్మేయవద్దు - మార్చి 14 రాశిఫలాలు

Horoscope Tomorrow's Prediction 14 March 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope 14th March 2024  Prediction

మేష రాశి

జీవనశైలి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ-జాబ్ ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. కార్యాలయంలో మీ ఆధిపత్యం  ఉంటుంది. ఇతరులను తేలికగా నమ్మవద్దు. వినోదం కోసం ఖర్చు చేస్తారు. చాలా రోజులుగా ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి జీవితంలో అదనపు బాధ్యతల కోసం సిద్ధంగా ఉండండి.  

ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మేష రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

వృషభ రాశి

లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనిపై అశ్రద్ధ వద్దు. మీ లక్ష్యాల పట్ల ఉదాసీనంగా ఉండకండి. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి.  ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలున్నాయి.  కుటుంబ జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.   డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త.  స్టాక్ మార్కెట్‌లో ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెట్టవచ్చు.

మిథున రాశి

మీరు ఆస్తుల విక్రయం వల్ల లాభపడతారు. దాతృత్వ భావన మీ మనస్సులో బలంగా ఉంటుంది. ఇంటి అలంకరణ   పునర్నిర్మాణం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారానికి సంబంధించి పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. రోజు ఆరంభం ఓ మోస్తరుగా ఉన్నా  కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు గందరగోళానికి గురవుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంకొన్నాళ్లు నిరాశ తప్పదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి. 

Also Read: ఉగాది వరకూ ఈ రాశులవారికి ఆదాయం - ఆ 5 రాశులవారికి అసహనం!

కర్కాటక రాశి

వ్యాపారంలో లాభాలుంటాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అద్భుతమైన కెరీర్ అవకాశాలను పొందుతారు. ప్రేమ సంబంధాలు వివాహం దిశగా అడుగుపడతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోండి.  కుటుంబంలో ఉండే సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి.   పిల్లల ఆరోగ్యం గురించి  ఆందోళన చెందుతారు. కార్యాలయంలో చిన్న సవాళ్లు ఎదుర్కోవలసి రావచ్చు. కొత్త ప్రాజెక్ట్ కోసం బాధ్యత వహించడానికి వెనుకాడరు. 

సింహ రాశి

ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది.  నిర్దిష్ట ప్రణాళిక లేకుండా పెట్టుబడి పెట్టకూడదు. కిడ్నీ సమస్యలతో బాధపడే రోగులు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని సక్రమంగా ఉపయోగించుకోవాలి.  వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.  ఖర్చులు తగ్గించాలి.  ఉద్యోగస్తులకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కెరీర్లో సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. 

కన్యా రాశి 

పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తవచ్చు. మీ అభిప్రాయాల విషయంలో ఎవరిపైనా ఒత్తిడి చేయవద్దు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించడం సరికాదు. ఉద్యోగులు ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. కార్యాలయంలో ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది.  ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. 

తులా రాశి

వైవాహిక సంబంధాలలో సానుకూల భావన ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వ్యక్తుల జీతాల్లో పెరుగుదల ఉండవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. ప్రభుత్వ పనులు సులువుగా జరుగుతాయి.  మీ మాటలపై నియంత్రణ ఉంచండి.  వ్యాపారులు పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. పనిలో ఆటంకాలు తొలగిపోవడానికి కుటుంబ సభ్యుల సహకారం తోడ్పడుతుంది. కొంతమంది ఉద్యోగులు శుభవార్తలు వింటారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి.

Also Read: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే మొత్తం శూన్యమే!

వృశ్చిక రాశి

ఉన్నత విద్యలో ఆటంకాలు తొలగిపోతాయి. రిటైల్ వ్యాపారులకు ఈ రోజు చాలా మంచిది. సహోద్యోగులతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయం పొందవచ్చు . ఉత్సాహానికి లోటుండదు. కొత్త ప్రాజెక్టు బాధ్యతలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మీ కెరీర్‌లో మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కుటుంబ సభ్యులతో పంచుకోండి. 

ధనుస్సు  రాశి

కార్యాలయంలో మీ కీర్తి  విశ్వసనీయత పెరుగుతుంది .షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను పొందుతారు.  సృజనాత్మక ఆలోచనలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.  కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. పనిలో అదనపు బాధ్యతలు పొందేందుకు సిద్ధంగా ఉండండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వృత్తి జీవితంలో చాలా పెద్ద సానుకూల మార్పులు ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి మద్ధతు పొందుతారు కానీ రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. 

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!

మకర రాశి

మార్కెటింగ్ , మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఏదో ఒక విషయంలో మీపై కోపంగా ఉండవచ్చు. ఎవరికీ తప్పుడు ప్రశంసలు ఇవ్వొద్దు. మీ పనులు చాలా వరకు నిదానంగా సాగుతాయి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారమవుతాయి. అధిక ఖర్చుల వల్ల మనస్సు ఆందోళన చెందుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ ఖర్చులను తగ్గించుకోవాలి.  

కుంభ రాశి

ఈ రోజు మీరు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సమస్య మూలాన్ని సులభంగా గుర్తిస్తారు..సులభంగా పర్కరించగలరు. ఇతరులు చెప్పేదానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టవద్దు. మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన పనులు ఊపందుకుంటాయి. ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలనే ఆలోచన వాయిదా వేయడం మంచిది. ఆస్తిలో పెట్టుబడి పెట్టే ముందు సరైన పరిశోధన చేయడం మంచిది. అనవసర చర్చల్లో పాల్గొనవద్దు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది 

Also Read: మీ నక్షత్రం , రాశి ఏంటో తెలియదా - మీ పేరు ఆధారంగా ఇలా తెలుసుకోండి!

మీన రాశి

ఈ రోజు ఏదో సంఘటన గురించి మనసులో భయం ఉంటుంది. ఉద్యోగులు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు.  విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి ఉంటుంది.  సన్నిహితుల సహకారంతో జీవితంలో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి.  సంబంధాలలో అపార్థాలు పెరుగుతాయి..కాస్త సహనంగా వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. 

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Foundation Day: అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Best Horror Movies on OTT: బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs PBKS Match Highlights | IPL 2024 లో ఇన్ని సార్లు 250+ స్కోర్లు రావటానికి కారణాలేంటీ.? | ABPKKR vs PBKS Match Highlights | సరికొత్త చరిత్ర రాసిన కోల్ కతా, పంజాబ్ మ్యాచ్ | IPL 2024 | ABP DesamKKR vs PBKS Match Highlights | Shashank Singh ఊచకోత ఇన్నింగ్స్ తో పంజాబ్ కు ఊపిరి | IPL 2024 | ABPKKR vs PBKS Match Highlights | చరిత్ర చూడని ఛేజింగ్ తో కోల్ కతా ఫ్యూజులు ఎగిరిపోయాయి | IPL 2024 |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Foundation Day: అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Best Horror Movies on OTT: బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
Special Trains: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్స్‌ ఇవే..!
రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్స్‌ ఇవే..!
Sukumar About Suhas: కేశ‌వ‌ క్యారెక్ట‌ర్ సుహాస్ చేయాల్సింది.. బ‌న్నీ ఎప్పుడూ ఇతడి గురించే చెప్తాడు: డైరెక్ట‌ర్ సుకుమార్
కేశ‌వ‌ క్యారెక్ట‌ర్ సుహాస్ చేయాల్సింది.. బ‌న్నీ ఎప్పుడూ ఇతడి గురించే చెప్తాడు: డైరెక్ట‌ర్ సుకుమార్
Varalaxmi Sarathkumar: చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను, థెరపీకి వెళ్లాను - వరలక్ష్మి శరత్‌కుమార్
చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను, థెరపీకి వెళ్లాను - వరలక్ష్మి శరత్‌కుమార్
YSRCP News Strategy: ప్రత్యర్థి పేర్లతో బరిలో ఇండిపెండెంట్లు- ప్రధాన పార్టీ అభ్యర్థులకు కొత్త చికాకులు
ప్రత్యర్థి పేర్లతో బరిలో ఇండిపెండెంట్లు- ప్రధాన పార్టీ అభ్యర్థులకు కొత్త చికాకులు
Embed widget