Guppedantha Manasu January 12th Episode: 'భగవంత్ కేసరి' స్టైల్లో ఫైట్, రిషికి రెడ్ హ్యాండెండ్ గా దొరికిపోయిన శైలేంద్ర!
Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. రిషి - వసుధార మళ్లీ ఒక్కటయ్యారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
2Guppedantha Manasu January 12 th Episode: (గుప్పెడంతమనసు జనవరి 12 ఎపిసోడ్)
రిషి చక్రపాణి ఇంట్లోనే ఉన్నాడనే అనుమానంతో శైలేంద్ర...రౌడీలను చక్రపాణి ఇంటికి పంపిస్తాడు. లోపల రిషి ఉన్నాడో తెలుసుకుని శైలేంద్ర సర్ కి సమాచారం ఇవ్వాలి అనుకుంటారు. అర్థరాత్రి చక్రపాణి ఇంట్లోకి ఎంటరవుతారు..కానీ మొదటి మెట్టుపై అడుగేసేసరికి జారి పడతారు...అక్కడ చక్కపాణి కూర్చుని ఉంటాడు..( భగవంత్ కేసరిలో బాలకృష్ణలా). వాళ్లని ఉతికి ఆరేస్తాడు చక్రపాణి...ఇంతలో వసుధార బయటకు వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. పారిపోయారమ్మా వాళ్లు దొరికి ఉంటేనా అంటాడు..అప్పుడు రౌడీలు వచ్చిన సంగతి చెబుతాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటుంది వసుధార.
చక్రపాణి: నేనుండగా మీకేం కాదు..ధైర్యంగా ఉండండి అని చెబుతాడు తండ్రి. ఆ శైలేంద్ర ఎన్ని ఎత్తులు వేసినా నా దగ్గర కుప్పిగంతులు పనిచేయవు...వాడే డైరెక్టుగా వస్తే పెరట్లోనే గొయ్యి తీసి పాతిపెట్టేస్తాను..నువ్వు ధైర్యంగా ఉండు అని చెబుతాడు..అల్లుడు గారు పూర్తిగా కోలుకునేవరకూ నేను నిద్రపోను..అర్థరాత్రి నిద్రవచ్చినా ముఖంపై నీళ్లు చల్లుకుని కాపలా కాస్తానమ్మా.. అమ్మా వసమ్మా నీ కాపురం పచ్చగా ఉండడం కోసం నేను ఎంతవరకైనా వెళతాను. ఆ శైలేంద్రకి, చిల్లర రౌడీలకు అదరకు బెదరకు..నీకు నాన్న ఉన్నాడమ్మా. బంగారం లాంటి ఆ అల్లుడిని అలాంటి దుస్థితి తీసుకొచ్చిన వాళ్లని అస్సలు వదిలిపెట్టను..
Also Read: జగతి రాసిన లెటర్ దాచేయమన్న రిషి, శైలేంద్ర నిజస్వరూపం ఫోన్లో రికార్డ్ చేసిన ధరణి!
చక్రపాణి నుంచి బయటపడిన రౌడీలు..అమ్మో ఎలాగోలా తప్పించుకున్నాం అనుకుంటారు. ఇప్పుడు సార్ కి ఏం చెప్పాలి అని ఆలోచించి.. రిషి అస్సలు అక్కడ లేడని చెబుతారు. శైలేంద్ర ఆశ్చర్యపోతారు..నిజం చెప్పరా అని ఫైర్ అవుతాడు. లేకపోవడం ఏంటి మీరు సరిగ్గా చూశారా లేదా, అబద్ధం చెబుతున్నారు కదా అని నిలదీస్తాడు. అటు ఆ రౌడీలు మీపై ఒట్టు సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తారు. శైలేంద్రకి మాత్రం అనుమానం పోదు. రిషి అక్కడ లేకపోతే ఎక్కడికి వెళ్లి ఉంటాడు అనుకుంటాడు.
వసుధార-ముకుల్
శైలేంద్ర ఎక్కడా తగ్గడం లేదు..మనం అప్రమత్తంగా ఉండాలి అనుకుంటారు. పెద్దమ్మ, పెద్దయ్యకి ముందే అన్ని విషయాలు చెప్పాం కాబట్టి సరిపోయింది లేదంటే మళ్లీ ప్రమాదంలో పడిపోయేవారం అనుకుంటారు.
వసు: రిషి సార్ పూర్తి ఆరోగ్యంగా ఉంటే తనకి కాపలా కాయాల్సిన అవసరం లేదు. గాయపడిన సింహాన్ని చూసి గుంటనక్కలు తోడేళ్లు చుట్టుముట్టునట్టి ఆ శైలేంద్ర బిహేవ్ చేస్తున్నాడు.
ముకుల్: రాజుకి ఏమైనా అయితే రాజ్యం నాశనం అయిపోతుంది..
వసు: నా శక్తి మేరకు కాపాడుకుంటా కానీ నా శక్తి సరిపోతుందో లేదో అర్థంకావడం లేదు.. ఏ క్షణం ఎటునుంచి ప్రమాదం వస్తుందో ఊహించలేకపోతున్నాను. సర్ ని ఇలా చూసి భరించలేకపోతున్నాను..సర్ కి ఏమైనా అయితే ఆ క్షణమే వసుధార గుండె ఆగిపోతుంది
ముకుల్: మీరు అలా అనకండి రిషికి ఏం కాదు..కానీ సమాజం ఎలా అయిపోయిందంటే నేరాలు జరగకుండా ఆపాలని ప్రయత్నిస్తుంటే.. నేరస్తులు మాత్రం కొత్త నేరాలు ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారు..శైలంంద్ర ఆటలు ఎన్నాల్లో సాగవులెండి
రిషి సర్ ని ఎక్కడ దాచాలో నేను ఆలోచిస్తాను అంటుంది వసుధార..
Also Read: మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను - సంక్రాంతి సంబరాన్ని రెట్టింపు చేసే గొబ్బిళ్ల పాటలివే!
దేవయాని వచ్చి ప్రేమగా మాట్లాడుతండడంతో ధరణికి డౌట్ వస్తుంది. ఏదో అవసరం వచ్చి ఉంటుందని అనుకుంటుంది. నీకోసం ప్రేమగా జ్యూస్ చేశానని దేవయాని అంటే..ఎందుకత్త్యయా మీకీ శ్రమ..నేను జ్యూస్ తాగను..ఇప్పుడు కాఫీ తాగుదాం అనుకుంటున్నా అంటుంది. కాఫీ తీసుకొస్తాను ఆగు అని దేవయాని అంటే..ప్లీజ్ అత్తయ్యగారు వద్దు అనేస్తుంది.
ధరణి: ఈ సంవత్సరం నా జీవితంలో మరపురాని సంవత్సరంగా మిగిలిపోతుంది. నన్ను ఇంట్లో మనిషిలానే చూడని మీరు ఈ రోజు మీరు నన్ను గుర్తించి ప్రేమగా జ్యూస్ చేసి తీసుకొచ్చారంటే అంత ఆషామాషీనా...మీ నుంచి నాకు ఈ ప్రేమ చాలు
దేవయాని: అత్తా కోడళ్లు అన్నాక మాట పట్టింపులుంటాయి అవి సహజం..అంత మాత్రాన వాళ్లమధ్య ప్రేమ లేదనుకుంటే ఎలా
ధరణి: నాతో ఏదో పని ఉండే ఉంటుందని అనుకుంటుంది..దేవయాని తియ్యటి కబుర్లు చెబుతూనే ఉంటుంది..
దేవయాని: వసుధార-మహేంద్ర వాళ్లు ముందులా ఎందుకు ఉండడం లేదు..రిషి కనిపించకుండా పోయినప్పుడు వాళ్లిద్దరూ భయపడుతూ, బాధపడుతూ కనిపించారు..ఇప్పుడు అలా లేరంటూ కూపీ లాగే ప్రయత్నం చేస్తుంది
ధరణి: ఇప్పుడు అర్థమైంది అత్తయ్యగారు మీ నటన వెనుకున్న కుట్ర అని మనసులో అనుకున్న ధరణి...నాకేం తెలుసు అత్తయ్యగారు..
దేవయాని: అవునులే అదీ నిజమే..నాకే తెలియనప్పుడు ఇంక నీకేం తెలుస్తుంది..సర్లే ఓ సారి వసుధారకి కాల్ చేసి కనుక్కో అంటుంది
ధరణి: నన్నెందుకు కాల్ చేయమంటున్నారు..మీరే చేయొచ్చు కదా...
దేవయాని: వాళ్లు కలవాలని సంతోషంగా ఉండాలని నీకు లేదా
ధరణి: అందుకే కాల్ చేయను..వాళ్ల గురించి నాకు తెలియదు, తెలుసుకోను..నేనెప్పుడూ ఆ దేవుడిని కోరుకునేది ఒకటే.. మంచి వాళ్లకి మంచే జరగాలి, చెడ్డవాళ్లకి వాళ్లు చేసిన పాపాలకి శిక్ష పడాలని...
అక్కడి నుంచి వెళ్లిపోతుంది ధరణి... అప్పుడే వస్తాడు శైలేంద్ర...
నీ పెళ్లాం ఎన్నేసి మాటలు అంటుందో తెలుసా అంటూ అక్కసు వెళ్లగక్కుతుంది దేవయాని. రిషి గురించి ఏమీ చెప్పలేదంటుంది...
అనుపమతో రిషి గురించి మాట్లాడుతాడు మహేంద్ర..తను నా దగ్గర ఉంటే కాపాడుకుంటాను కానీ వసుధార మాత్రం ఇక్కడకు పంపించను అంటోంది అంటూ చెబుతాడు. ఇంతలో అక్కడకు వచ్చిన భద్ర..నేను మీ దగ్గర ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నా అని డ్రామా స్టార్ట్ చేస్తాడు. నువ్వు పని చెప్పడం లేదని ఫీలవుతున్నావా అని అనుపమ అంటే..ఖాళీగా కూర్చుని డబ్బులు తీసుకోవడం ఇష్టం లేదనేస్తాడు భద్ర. వసుధార మేడంకి సెక్యూరిటీగా ఉండాలన్నారు కానీ ఇప్పుడు మేడం ఇక్కడ లేరంటూ అక్కడకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తాడు..మేడం, వాళ్ల నాన్నని ఇక్కడకు తీసుకొస్తే పనవుతుంది కదా అంటాడు..మహేంద్ర-అనుపమ ఆలోచనలో పడతారు....
ఎపిసోడ్ ముగిసింది...