Makar Sankranthi Gobbilla Songs: మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను - సంక్రాంతి సంబరాన్ని రెట్టింపు చేసే గొబ్బిళ్ల పాటలివే!
Makar Sankranthi Gobbilla Songs: సంక్రాంతి సందడంతా భోగి రోజు సాయంత్రం జరుపుకునే సందె గొబ్బిళ్లలోనే. ఆరుబయట గొబ్బిళ్లు పెట్టి శ్రీకృష్ణుడిని పూజించి గొబ్బిళ్ల చుట్టూ ఆడిపాడతారు..
Makar Sankranthi Gobbilla Songs In Telugu: సంక్రాంతి పండుగంటే కొత్తబట్టలు, పిండివంటలే కాదు..మన సంస్కృతీ సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించడం కూడా. అలాంటి సంప్రదాయాల్లో ఒకటి సందె గొబ్బిళ్లు. భోగి రోజు గోధూళి సమయంలో చిన్నారి నుంచి ముసలమ్మ వరకూ అందరూ గొబ్బిళ్లు ఆడతారు. చక్కని ముగ్గు వేసి అందులో గొబ్బిళ్లు పెట్టి.. గుమ్మడి, బంతి, చామంతి, పసుపు, కుంకుమతో వాటిని అలంకరించి... మధ్యలో శ్రీ కృష్ణుడి విగ్రహం అమర్చి ఆ గొబ్బిళ్ల చుట్టూ ఆడిపాడుతూ గోపికల్లా మారిపోతారు. ఈ సందర్భంగా పాడుకునే కొన్ని ముఖ్యమైన పాటలు మీకోసం...
పాట-1
కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో ||
చ|| కొండ గొడుగుగా గోవుల గాచిన | కొండొక శిశువునకు గొబ్బిళ్ళో |
దండగంపు దైత్యుల కెల్లను తల | గుండు గండనికి గొబ్బిళ్ళో ||
చ|| పాప విధుల శిశుపాలుని తిట్టుల | కోపగానికిని గొబ్బిళ్ళో |
యేపున కంసుని యిడుమల బెట్టిన | గోప బాలునికి గొబ్బిళ్ళో ||
వెండిపైడి యగు వేంకట గిరిపై | కొండలయ్యకును గొబ్బిళ్ళో ||
Also Read: ఇంటి ముందు ముగ్గు లేకపోతే అంత అపచారమా - సంక్రాంతికి మరింత ప్రత్యేకం ఎందుకు!
పాట-2
దుక్కు దుక్కు దున్నారంట
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
దుక్కు దుక్కు దున్నారంట - ఏమి దుక్కు దున్నారంట
రాజా వారి తోటలో జామ దుక్కు దున్నారంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
విత్తు విత్తు వేశారంట - ఏమి విత్తు వేశారంట
రాజా వారి తోటలోన జామ విత్తు వేశారంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
మొక్క మొక్క మొలిచిందంట - ఏమి మొక్క మొలిచిందంట
రాజా వారి తోటలోన జామ మొక్క మొలిచిందంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
పువ్వు పువ్వు పూసిందంట - ఏమి పువ్వు పూసిందంట
రాజా వారి తోటలోన జామ పువ్వు పూసిందంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
పిందె పిందె వేసిందంట - ఏమి పిందె వేసిందంట
రాజా వారి తోటలోన జామ పిందె వేసిందంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
కాయ కాయ కాసిందంట - ఏమి కాయ కాసిందంట
రాజా వారి తోటలోన జామ కాయ కాసిందంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
పండు పండు పండిందంట - ఏమి పండు పండిందంట
రాజా వారి తోటలోన జామ పండు పండిందంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
Also Read: సంక్రాంతి ముగ్గుల్లో గొబ్బిళ్ల సందడెందుకు!
పాట-3
అటవీ స్థలములు కడుగుదమా
చెలి వట పత్రమ్ములు కోయుదమా!!2 సార్లు!!
చింత పిక్కాలాడుదమా చిరు చిరు నవ్వులు నవ్వుదమా!!అటవీ!!
చెమ్మా చెక్కాలాడుదమా చక్కిలిగింతలు పెట్టుదమా!!అటవీ!!
కోతీ కొమ్మచ్చులాడుదమా కొమ్మల చాటున దాగుదమా!!అటవీ!!
చల్లని గంధం తీయుదమా సఖియా మెడలో పూయుదమా!!అటవీ!!
పూలదండలు గుచ్చుదమా దేవుని మెడలో వేయుదమా!!అటవీ!!
పాట-4
సుబ్బీ గొబ్బెమ్మా
సుబ్బీ గొబ్బెమ్మా.. సుబ్బణ్ణీయవే..
చామంతి పువ్వంటీ చెల్లెల్నీయవే
తామర పూవంటీ తమ్ముణ్ణీయవే
బంతి పువ్వంటి బావ నివ్వవే
తాటి పండంటి తాత నివ్వవే
మల్లె పూవంటి మామా నివ్వవే
అరటి పండంటి అత్త నివ్వవే
మొగలి పూవంటీ.. మొగుణ్ణీయవే
Also Read: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 విషయాలు!
పాట-5
ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను
ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను
ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను
ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించెనే?
ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించెనే?
కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు!!ఏల!!
కాళింది మడుగులోన దూకినాడమ్మా
బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మా!!ఏల!!
చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు
చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు
ఆ పొన్న మాను పైన పెట్టి పంతమాడెనే!!ఏల!!
Also Read: బొమ్మల కొలువు ఎందుకు - ఏ బొమ్మలు ఏ మెట్టుపై పేర్చాలి!
పాట -6
చుంచు దువ్వి పింఛం పెట్టెద గోపాలకృష్ణ
పొంచి ఉండి పరుగులేలరా !2!
చుంచు దువ్వి పింఛం చుట్టి పంచదార పాలుపోసి !2!
ఎంచరాని బొజ్జలవేడి బువ్వపెట్టి బజ్జోపెడుదు
చుంచు దువ్వి పింఛం!2!
కాళ్లకు గజ్జెలు కట్టెదా గోపాల కృష్ణ మెళ్లోనా హారం వేసేదా!2!
కాళ్లకు గజ్జెలు కట్టి మెళ్లోనా హారం వేసి...
ఒళ్లోను పప్పుల పోసి పిల్లల గ్రోవి చేతికిచ్చెదా
చుంచు దువ్వి పింఛం
చుంచు దువ్వి పింఛం పెట్టెద గోపాలకృష్ణ
బొజ్జకు పసిడి గజ్జెలు కట్టేదా గోపాలకృష్ణ
బుజ్జి భుజములు తిప్పి ఆడేదా
బంగరు తొట్టె నా మదిలోనా బాలకృష్ణ నిద్దరపోరా
చుంచు దువ్వి పింఛం చుట్టెద గోపాలకృష్ణ
పొంచి ఉండి పరుగులేలరా !4!
దశావతారాల గొబ్బిళ్ళ పాట
పసుపున పుట్టావు గొబ్బెమ్మనీవు-పసుపున పెరిగావు గొబ్బెమ్మనీవు
చల్లాలమ్మే గొల్లభామ గొబ్బిళ్ల పాట