అన్వేషించండి

Guppedantha Manasu February 23rd Episode: మను రిషి కన్నా డేంజర్ గా ఉన్నాడు బాబోయ్ - వసు, మహేంద్రకి షాకిచ్చిన అనుపమ - గుప్పెడంత మనసు ఫిబ్రవరి 23 ఎపిసోడ్!

Guppedantha Manasu Today Episode: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu February 23rd Episode:  (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 23 ఎపిసోడ్)

శైలేంద్ర రెచ్చ‌గొట్ట‌డంతో వసుధారని ఎత్తుకెళ్లిపోయేందుకు వచ్చిన రాజీవ్ అక్కడ మనుని చూసి షాక్ అవుతాడు. మ‌ను గన్ చూపించి వార్నింగ్ ఇవ్వడంతో భయపడిన రాజీవ్..నువ్వు DBST కాలేజీలో డైరెక్టర్ గా జాయిన్ అయ్యారని తెలిసింది అందుకే కంగ్రాట్స్ చెబుదామని అనుకుంటున్నా అంటాడు. వెళుతూ వెళుతూ...డార్లింగ్ వసూ..మళ్లీ కలుస్తా..ఇప్పుడు వీళ్లందర్నీ చూసుకుని ఎగిరిపడుతున్నావేమో వీళ్లంతా నీకు నిన్నగాక మొన్న వచ్చినవాళ్లు కానీ నేను నీ బావను, అక్క మొగుడిని..ఇప్పుడు నిన్ను తీసుకెళ్ల‌డం కుద‌ర‌డం లేదు కానీ మళ్లీ వస్తాను అప్పుడు మాత్రం వదిలిపెట్టను. ఎవ‌రు అడ్డొచ్చిన నిన్ను తీసుకెళ‌తాన‌ని వ‌సుధార‌కు వార్నింగ్ ఇస్తాడు రాజీవ్‌. త‌న జేబులో నుంచి తాళి  తీసి ఇది నీ మెడ‌లో ప‌డాల్సిందే అది నేను క‌ట్టాల్సిందే అంటాడు. పెళ్లైన అమ్మాయితో పోరంబోకులా బిహేవ్ చేస్తున్నావ్ అని మహేంద్ర మండిపడితే...బయటకు పో అని మను గట్టిగా అరుస్తాడు. నిన్నగాక మొన్న వచ్చిన నువ్వు కూడా నాకు వార్నింగ్ ఇస్తున్నావ్...మొన్నంటే తగ్గాను కానీ ప్రతిసారీ తగ్గను ...  నా టైమ్ వ‌స్తుంది అప్పుడు ఈ రాజీవ్ అంటే ఏమిటో చూపిస్తా. నువ్వు కొంచెం జాగ్ర‌త్త‌గా ఉంటే బెట‌ర్ అంటూ మ‌నుకి రివర్స్ లో వార్నింగ్ ఇస్తాడు. నేనూ చూస్తా అని రివర్స్ లో వార్నింగ్ ఇస్తాడు మను...

Also Read: జగతి-రిషి ప్లేస్ లో అనుపమ-మను, అందర్నీ డామినేట్ చేసేసిన మను - గుప్పెడంత మనసు ఫిబ్రవరి 22 ఎపిసోడ్!

శైలేంద్ర-రాజీవ్
వ‌సుధారను తీసుకొచ్చేస్తానని వెల్లిన రాజీవ్...పని సక్సెస్ అయ్యిందో లేదో అని శైలేంద్ర తెగ టెన్షన్ పడుతుంటాడు. అసలేం జరిగిందో అనుకుంటూ కాల్ చేసినా కానీ రాజీవ్ చికాకుగా ఉండడంతో కాల్ కట్ చేస్తాడు. మ‌ళ్లీమ‌ళ్లీ ఫోన్ చేస్తూనే ఉంటాడు శైలేంద్ర‌. కాల్ లిఫ్ట్ చేసిన రాజీవ్ పై ఫైర్ అవుతుంటే..రాజీవ్ రివర్స్ అవుతాడు. అవసరం నాది కాబట్టి తగ్గాల్సిందే అనుకున్న శైలేంద్ర...కూల్ గా మాట్లాడుతూ అక్కడేం జరిగిందంటూ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.
రాజీవ్: నీకు నాకు కామ‌న్ శ‌త్రువు ఒక‌డు ఉన్నాడు క‌దా. వాడే వ‌సుధార‌ను నేను తీసుకురాకుండా అడ్డుకున్నాడ‌ు. రిషి కంటే మ‌ను డేంజ‌ర్‌లా ఉన్నాడు. రిషి అయితే వార్నింగ్ ఇచ్చి వ‌దిలేసేవాడు. కానీ మ‌నును చూస్తేనే భ‌య‌మేస్తుంది. ఏం చేయాలో కూడా తెలియ‌క వెన‌క‌డుగు వేసి వ‌చ్చాన‌ు
శైలేంద్ర : వాడు అక్కడేం చేస్తున్నాడు..మ‌నును ఏదో ఒక‌టి చేసి వ‌సుధార‌ను తీసుకురావాలి గ‌దా. అస‌లు నీకు బుద్ది ఉందా 
రాజీవ్‌ : అస‌లు నీ బుద్ధి ఏమైంది. నువ్వు ఎందుకు మ‌నును ఏం చేయ‌డం లేదు. వాడిని త‌ప్పిస్తే నీకు నాకు టెన్ష‌న్ ఉండ‌దు. నువ్వు ఎందుకు మ‌నుకు భ‌య‌ప‌డుతున్నావు
శైలేంద్ర: తడబడిన శైలేంద్ర...నువ్వు ఎందుకు అలా చేయ‌కుండా ఆగిపోయావో నేను అందుకే ఆ ప‌ని చేయ‌లేక‌పోయాన‌ు
రాజీవ్: వ‌సును పెళ్లిచేసుకోవాల‌న్న‌దే నా ఆశయం..ఎలాగైనా ఇక్క‌డి నుంచి దూరంగా తీసుకుపోతాన‌ు. త్వ‌ర‌లోనే నీకు గుడ్ న్యూస్ చెబుతాను అంటూ కాల్ కట్ చేస్తాడు
 అసలు మ‌ను ఎవ‌రు? వ‌సుధార ఫ్యామిలీతో తనకి ఉన్న సంబంధం ఏంటి?  అత‌డికి ఉన్న సంబంధం ఏమిటి అని ఆలోచించడం కూడా టైమ్ వేస్ట్... కేవలం ఎండీ సీట్ పై మాత్రమే ఫోకస్ చేయాలి అనుకుంటూ మరో ప్లాన్ వేస్తాడు...

Also Read: నిన్న కాలేజ్‌కి ఇప్పుడు ఇంటికి - దూసుకుపోతున్న మను - రాజీవ్ కి చెక్!

మ‌హేంద్ర‌, మ‌ను, వ‌సుధార‌, అనుప‌మ డిన్న‌ర్ చేయ‌డానికి రెడీ అవుతారు. మ‌ను త‌న‌కు తానే వ‌డ్డించుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు. అనుప‌మ‌ను వ‌డ్డించ‌మ‌ని చెబుతాడు. ఇవ‌న్నీ నీ ఫేవ‌రేట్ క‌ర్రీస్ క‌దా మొహ‌మాట‌ప‌డ‌కుండా తిన‌మ‌ని అంటాడు. 
మహేంద్ర: నిన్ను చూడ‌గానే రాజీవ్ ఎందుకు అలా వ‌ణికిపోయాడ‌ు
వసు: ఇంత‌కుముందు న‌న్ను రాజీవ్ ఏడిపించ‌బోతే మ‌ను వార్నింగ్ ఇచ్చారు
మహేంద్ర: రాజీవ్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండ‌మ్మా
మను: ఎవ‌రికో భ‌య‌ప‌డి వ‌సుధార మారాల్సిన అవ‌స‌రం లేద‌ని, త‌ను ఎప్ప‌టిలానే ఉండొచ్చ‌ు
మ‌ను మాట్లాడుతుండ‌గా పొల‌మారుతుంది. దాంతో అనుప‌మ కంగారు ప‌డుతుంది. ఛైర్‌లో నుంచి లేచి మ‌ను త‌ల‌పై తట్టి వాటర్ తాగిస్తుంది. అన్నంతినేముందు మాట్లాడ‌కూడ‌ద‌ని తెలియ‌దా. చూడు ఎంత‌లా పొల‌మారిందో అంటుంది. వారిద్ద‌రిని చూసి మ‌హేంద్ర‌, వ‌సుధార షాక‌వుతారు. త‌న‌కు పొల‌మారితే నువ్వెందుకు కంగారు ప‌డుతున్నావు. ఏదో సొంత మ‌నిషికి ఇబ్బంది ఎదురైన‌ట్లు అని అనుప‌మ‌ను అడుగుతాడు మ‌హేంద్ర‌. అనుప‌మ స‌మాధానం చెప్ప‌కుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. అంత‌లా పొల‌మారిందంటే నిన్ను ఎవ‌రు త‌ల‌చుకుని ఉంటార‌ని మహేంద్ర అంటాడు
మను:  న‌న్ను త‌ల‌చుకునేవాళ్లు ఎవ‌రు లేర‌ు
ఆ మాట‌లు విని అనుప‌మ ఎమోష‌న‌ల్ అవుతుంది. అన్నం కూడా తిన‌కుండా ఆగిపోతుంది. ఇంకెప్పుడూ అలా అన‌కు మ‌ను. నీకు మేము ఉన్నామ‌ని మ‌నుకు మాటిస్తాడు మ‌హేంద్ర‌. ఇలా అంద‌రితో క‌లిసి ఎప్పుడూ తిన‌లేద‌ని, రోజు ఒంట‌రిగానే భోజ‌నం చేస్తుంటాన‌ని మ‌హేంద్ర‌తో చెబుతాడు మ‌ను.

Also Read: ఈ శనివారం మాఘ పౌర్ణమి - మీ రాశిప్రకారం ఇవి దానం చేస్తే మంచిది!

పెద్దమ్మ-అనుపమ

ఆ తర్వాత పెద్దమ్మ... అనుపమకి కాల్ చేస్తుంది. కొంప ముంచావ్ అంటూ అరుస్తుంది అనుపమ. మను డిన్నర్ కోసం ఇక్కడకు వస్తున్న విషయం ఎందుకు చెప్పలేదని ఫైర్ అవుతుంది.  వాడు భోజనానికి ఒకరి ఇంటికి వెళుతున్నాడంటే నువ్వో మాటన్నావ్ గుర్తుందా అని అడుగుతుంది పెద్దమ్మ. భోజనానికి వెళితే వెళ్లమను అక్కడే ఉండిపోమను అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది అనుపమ ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget