Magha Pournami 2024 Astrology :ఈ శనివారం మాఘ పౌర్ణమి - మీ రాశిప్రకారం ఇవి దానం చేస్తే మంచిది!
Magha Pournami 2024 : 2024 ఫిబ్రవరి 24 మాఘపూర్ణిమ.ఈ రోజు స్నానం, దానం చాలా ముఖ్యం..చేసే దానం కూడా మీ రాశిప్రకారం ఏం చేయాలో తెలుసుకుని దానం చేస్తే ఇంకా మంచి జరుగుతుంది
![Magha Pournami 2024 Astrology :ఈ శనివారం మాఘ పౌర్ణమి - మీ రాశిప్రకారం ఇవి దానం చేస్తే మంచిది! Magha Pournami 2024 What to Donate According to Your Zodiac Signs to get shani dev blessings on 24 february magh purnima Magha Pournami 2024 Astrology :ఈ శనివారం మాఘ పౌర్ణమి - మీ రాశిప్రకారం ఇవి దానం చేస్తే మంచిది!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/22/f5da7cfcde349df479c2801c72a286bf1708597624143217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Magha Pournami 2024 Astrology
పౌర్ణమి తిథి..
ఫిబ్రవరి 23 శుక్రవారం మధ్యాహ్నం 3.24 నుంచి పౌర్ణమి ఘడియలు మొదలు
ఫిబ్రవరి 24 శనివారం సాయంత్రం 5.12 వరకూ పౌర్ణమి ఉంది...
స్నానం-దానం
పౌర్ణమి ఘడియలు రాత్రికి ఉండడమే చూసుకోవాలి కానీ పున్నమి స్నానాలు చేసేవారు, దానం, జపం నియమాలు పాటించేవారు మాత్రం ఫిబ్రవరి 24 శనివారం పరిగణలోకి తీసుకుంటారు. ఈ రోజు గంగానదిలో కానీ మీకు సమీపంలో ఉన్న నదిలో స్నానమాచరించి దాన ధర్మాలు చేయాలి. ఈరోజు నువ్వులు, దుప్పటి, పాదరక్షలు, గొడుగు, నెయ్యి, బెల్లం, వస్త్రాలు, శనగలు, ఆహారం ఇలా ఎవరి స్తోమతను బట్టి వారు దానం చేయవచ్చు. ఈ రోజు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల జాతకంలో ఉండే శనిదోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు. పూర్ణిమ తిథి రోజు చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తే మనశ్సాంతి లభిస్తుంది.
ఈ రోజు స్నానానంతరం "ఓం నమో భగవతే వాసుదేవాయ నమః" అనే మంత్రాన్ని జపించాలి.
Also Read: అధ:పాతాళానికి దిగజారిపోతున్నావ్ అంటే ఏంటి- ఆలోచనకు పాతాళానికి ఏంటి సంబంధం!
మాఘ పౌర్ణమి రోజు మీ రాశి ప్రకారం దానం చేయాల్సిన వస్తువులు ఇవే...
మేష రాశి
ఆకుకూరలు,వస్త్రాలు,ఆహారధాన్యాలు దానం చేయాలి
వృషభ రాశి
పసుపు వస్త్రాలు,ఆవాలు,శనగపప్పు దానం చేయడం ఉత్తమం
మిథున రాశి
ఎర్రటి పప్పు, పసుపు రంగులో ఉండే పండ్లు, పసుపు వస్త్రాలు, నీలి రంగు పూలు దానం చేయాలి
కర్కాటక రాశి
పాదరక్షలు,దుప్పటి,గొడుగు,నీలం లేదా నలుపు వస్త్రాలు దానం చేయాలి
Also Read: ఏడాదిలో 4 పూర్ణిమలు ప్రత్యేకం - అందులో మాఘ పౌర్ణమి మరింత విశిష్టమైనది!
సింహ రాశి
నీలం వస్త్రాలు ,నీలిపూలు, నీలమణి, ఆకుపచ్చ కూరగాయలు దానం చేయాలి
కన్యా రాశి
గోధుమలు, ఎర్ర పప్పు, రాగి, బెల్లం దానం చేయాలి.
తులా రాశి
పసుపు పండ్లు, పసుపు గంధం, ఇత్తడి, పసుపు ఆవాలు, పసుపు రంగు వస్త్రాలు దానం చేయాలి
వృశ్చిక రాశి
క్రీమ్ రంగు వస్త్రాలు, పరిమళ ద్రవ్యాలు దానం చేయాలి
Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు
ధనుస్సు రాశి
తెల్లని వస్త్రాలు, ముత్యాలు, పాలు, బియ్యం, పంచదార, తెల్లని పువ్వులు దానం చేయాలి
మకర రాశి
ఆవాలు, పసుపు పండ్లు, అరటిపండు, ఇత్తడి, పసుపు మిఠాయిలు, పసుపు వస్త్రాలు దానం చేయాలి
కుంభ రాశి
బియ్యం, పంచదార దానం. , పాలు, తెల్లటి చందనం, తెల్లని వస్త్రాలు, ముత్యాలు, వెండి దానం చేయడం శుభప్రదం
మీన రాశి
గోధుమలు, కంచు, ధాన్యాలు, వస్త్రాలు, బెల్లం, నూనె, నీలిరంగు వస్త్రాలు దానం చేయాలి
మాఘ పౌర్ణమికి స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన శ్లోకం
"దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం
మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''
అంటే "దుఃఖం, దారిద్ర్యం, పాపం నశించడానికి ఈ పవిత్ర మాఘ స్నానం చేస్తున్నానని అర్థం.
అందుకే ఓ గోవిందా! అచ్యుతా! మాధవా! ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు'' అని అర్థం.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)