Guppedantha Manasu February 22nd Episode: జగతి-రిషి ప్లేస్ లో అనుపమ-మను, అందర్నీ డామినేట్ చేసేసిన మను - గుప్పెడంత మనసు ఫిబ్రవరి 22 ఎపిసోడ్!
Guppedantha Manasu Today Episode: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu February 22nd Episode: (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 22 ఎపిసోడ్)
వసుధార సంగతి నువ్వు చూసుకోలేవా అని శైలేంద్ర రాజీవ్ ని రెచ్చగొడతాడు. రెచ్చిపోయిన రాజీవ్ ఇప్పుడే వసు ఇంటికెళ్లి ఎత్తుకెళ్లిపోతా అని ఛాలెంజ్ చేస్తాడు. వసుధార చుట్టూ ఎంతమంది ఉన్నా తాను ఏ పరిస్థుతుల్లో ఉన్నా తీసుకొచ్చేనంటాడు.
మరోవైపు ఇంటికి చేరుకున్న మహేంద్ర వంట చేశారా అని అడిగితే లేదంటారు అనుపమ-వసుధార. మను వస్తోన్న విషయాన్ని వారి దగ్గర దాచిపెట్టిన మహేంద్ర చెప్పేస్తే సర్ ప్రైజ్ ఏముంటుంది అంటాడు. మినిస్టర్, ఫణీంద్రతో పాటు చాలా మంది పేర్లు చెబుతారు అనుపమ, వసుధార. కానీ మన ఇంటికి వచ్చేది వాళ్లు ఎవరు కాదని మహేంద్ర సమాధానమిస్తాడు. అప్పుడే మను ఇంట్లోకి అడుగుపెడతాడు. వసుధార, అనుపమ షాకవుతారు. మనును చూసి సర్‌ప్రైజ్ అవుతావనుకుంటే షాక్ అయ్యావు ఏంటి అని అనుపమను అడుగుతాడు మహేంద్ర. వసుధార, అనుపమ తప్పదన్నట్టు పలకరించడం చూసి నేను మీ ఇంటి గెస్ట్‌గా రావడం ఇష్టం లేదా అని మను అడుగుతాడు.
వసుధార: ఇంటికి ఎవరు గెస్ట్‌గా వచ్చినా గౌరవించడం, మర్యాదలు చేయడం మాకు అలవాటు. అది శత్రువులైనా . అయినా డిన్నర్ చేయడానికి వచ్చే గెస్ట్ మీరు అని ఊహించలేదు. మా మావయ్య ఎవరో గెస్ట్ డిన్నర్ కి వస్తున్నారంటే ఎవరో అనుకున్నాం కానీ మీరు వచ్చారు...
మను: లైఫ్‌లోనూ అన్ని అనుకోకుండానే జరుగుతాయి. ఊహించని మనుషులు ఎదురవుతుంటారు. ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి.
మహేంద్ర: కరెక్ట్ చెప్పావ్ మను..ఎందుకో నీ మాటలు నాకు బాగా కనెక్ట్ అవుతున్నాయి..అను మీరు వెళ్లి వంట స్టార్ట్ చేయండి
నువ్వు వీళ్లతో మాట్లాడుతూ ఉండు నేను వెళతాను అంటూ అనుపమ అసలు వీడెందుకు వచ్చాడు అనుకుంటుంది....
మహేంద్ర: నీకు - మనుకు మధ్య ఏదో గతం ఉందని నాకు తెలుసు అనుపమ...అది బయటపెట్టేందుకే తనని డిన్నర్ కి పిలిచాను అనుకుంటాడు
మను: వసుధార గారు కొంచెం మంచినీళ్లు ఇస్తారా
Also Read: నిన్న కాలేజ్‌కి ఇప్పుడు ఇంటికి - దూసుకుపోతున్న మను - రాజీవ్ కి చెక్!
వసుధారను ఎత్తుకురావడానికి బయలుదేరుతాడు రాజీవ్. ఈ రోజు నా నుంచి నిన్ను ఎవరు కాపాడలేరని మనసులో అనుకుంటాడు. ఈ రోజే వసుధార మెడలో మూడు ముళ్లు వేసి ఆ ఇంటి నుంచి తన ఇంటికి ఆమెను ఎలాగైనా తీసుకురావాలని ఫిక్సవుతాడు.
రిషి దూరమైన బాధను మనుతో చెప్పి ఎమోషనల్ అవుతాడు మహేంద్ర. రిషి తొందరలోనే తిరిగివస్తాడని, మళ్లీ అందరం సంతోషంగా ఉండొచ్చునని మహేంద్రను వసుధార ఓదార్చుతుంది. మను, మహేంద్ర మాట్లాడుకోవడం చూసి అనుపమ కంగారు పడుతుంది. తమ మధ్య ఉన్న బంధం గురించి ఎలాంటి నిజాలు బయటపెడతాడోనని టెన్షన్ పడుతుంటుంది.
మహేంద్ర: నువ్వు మాకు గొప్ప సాయం చేశావ్...అలాంటి నీ గురించి తెలుసుకోకపోతే ఎలా. మీ అమ్మ నాన్న ఎవరు, మీ నేటివ్ ప్లేస్ ఏది
మను సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు.
మహేంద్ర: మహేంద్ర అదే ప్రశ్నను మళ్లీ అడుగుతాడు
మను ఎక్కడ ఏం నిజం బయటపెడతాడోనని కంగారుగా అక్కడికి వస్తుంది అనుపమ. బలవంతపెట్టి విషయం రాబట్టడం కరెక్ట్ కాదని అంటుంది. మను మౌనంగా ఉన్నాడు అంటే చెప్పడం ఇష్టం లేదని అర్థమని టాపిక్ డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది.
మహేంద్ర: వంట చేసే నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు
అనుపమ: కాఫీ, టీ ఏమైనా తాగుతారా అడుగుదామని వచ్చానని అంటుంది.
డిన్నర్ టైమ్‌లో కాఫీ, టీ ఎవరైనా తాగుతారా అని మహేంద్ర బదులిస్తాడు. తాను ఇంతకుముందు తాగేవాడినని ఇప్పుడు ఆ అలవాటును వదిలేశానని మహేంద్రతో అంటాడు మను. మను ఇష్టాలను బాగానే గుర్తించావు. అలాగే మనుకు ఇష్టమైన వంటలు ఏవో తెలుసుకొని చేస్తే బాగుండేదని మహేంద్ర అంటాడు. మనుకు ఇష్టమైన కర్రీస్ గురించి అడుగుతాడు మహేంద్ర. ఆలు కర్రీ అని మను కంటే ముందు అనుపమ ఆన్సర్ ఇస్తుంది. మనుకు ఆ కర్రీ ఇష్టమని నువ్వు ఎలా కనిపెట్టావ్ మహేంద్ర అడగ్గా అనుపమ మాట మార్చేస్తుంది. చాలా మంది ఆ కర్రీని ఇష్టపడుతారు కదా..అలా గెస్ చేశానని అంటుంది. మనుకు ఇష్టమైన వంటలన్నీ చేస్తుంది.
మహేంద్ర-మను ఇల్లు చూసేందుకు వెళతారు....
Also Read: నేను బరిలోకి దిగితే నా ఎదురు నిలబడాలంటే వణుకు పుడుతుంది - మరో రిషిలా ఉన్న మను!
రాజీవ్ -వసుధార-అనుపమ
వసుధార ఇంటికి వచ్చిన రాజీవ్...డార్లింగ్ వసు...మై డియర్ మరదలు పిల్లా ఎక్కడున్నావ్ అని గట్టిగా కేకలు వేస్తాడు. వసుధార కాకుండా అనుపమ కనిపిస్తుంది. మీకు ఈ ఇంటికి సంబంధం ఏంటి? మీరు ఈ ఇంట్లో ఎందుకు ఉంటున్నారని అనుపమను అడుగుతాడు రాజీవ్. నేను జగతి ఫ్రెండ్‌నని అనుపమ బదులిస్తుంది. జగతిని నేనే చంపాలని అనుకున్నానని అనుపమతో అంటాడు రాజీవ్. ఆ మాటతో అనుపమ కోపం పట్టలేక రాజీవ్‌ను కొట్టడానికి చేయి ఎత్తుతుంది. అనుపమని ఆపేసిన వసుధార...నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావ్, మర్యాదగా బయటకు వెళ్లమని రాజీవ్‌ను వార్నింగ్ ఇస్తుంది వసుధార. అంత ఆవేశం నీకు పనికిరాదని, కనీసం నాకు కొంచెమైన మర్యాద ఇవ్వమని కూల్‌గా బదులిస్తాడు రాజీవ్. నన్ను కూర్చొబెట్టి మంచినీళ్లు, కాఫీ, టీలు ఇస్తే బావగా నేను సంతోషంగా ఫీలవుతానని వసుధారతో అంటాడు రాజీవ్. నీ లాంటివాడికి మర్యాద ఇచ్చేది ఏంటి వసుధార బదులిస్తుంది. వసుధారను ఎందుకు విసిగిస్తున్నావ్ రాజీవ్‌ను హెచ్చరిస్తుంది అనుపమ. బావ మరదళ్ల మధ్య వంద ఉంటాయి. ఇవన్నీ మీకు ఎందుకు అంటూ బయటకు వెళ్లడానికి రాలేదని, నిన్ను తీసుకెళ్లడానికి వచ్చానంటాడు. వసుధారని బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు...అప్పడు ఎంట్రీ ఇస్తాడు మను.
Also Read: ఈ రాశివారి జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది - ఫిబ్రవరి 22 రాశిఫలాలు
మను-రాజీవ్
మనును చూసి రాజీవ్ షాకవుతాడు. ఏంటి భయ్యా నువ్వు ఇక్కడ...సరాసరి ఇంటికి వచ్చేస్తావా...ఈ ఇంట్లో నీకు ఏం పని అని మనును అడుగుతాడు. నువ్వెందుకు వచ్చావ్ అని మను అడిగితే... ఇది నా మరదలు ఇల్లు వచ్చే హక్కు నాకు ఉందంటాడు రాజీవ్. మనును చూసి భయపడిపోతాడు రాజీవ్. నువ్వు ఇంట్లో ఉన్నావని తెలిస్తే నేను వచ్చేవాడిని కాదు...వేరే ప్లాన్ చేసుకునేవాడినని చెబుతాడు. ఇంకోసారి వసుధార జోలికి వస్తే బాగుండదని రాజీవ్‌ను హెచ్చరిస్తాడు మను. పోయినసారి గన్ మాత్రమే చూపించారు. ఈ సారి బుల్లెట్స్ చూపిస్తానని వార్నింగ్ ఇస్తాడు...
ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది...