Guppedantha Manasu February 10th Episode: శైలేంద్ర కుట్రకు కాలేజ్ చేజారనుందా - రిషి రీ ఎంట్రీకి ముహూర్తం పెట్టినట్టేనా!
Guppedantha Manasu Today Episode: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu February 10th Episode: (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 10 ఎపిసోడ్)
రిషి ఆలోచనలోనే ఉండిపోతుంది వసుధార. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మహేంద్ర, అనుపమ...వసుని చూసి మరింత బాధపడతారు. రిషి లేడనే విషయం ఎలా చెబితే నువ్వు నమ్ముతావో నాకు తెలియడం లేదమ్మా, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను అనుకుంటాడు మహేంద్ర. ఇంతలో ఆ పక్కనే పడి ఉన్న దండ చూసి...ఎవరైనా ఇంటికి వచ్చారా? ఏమైనా అన్నారా? శైలేంద్ర వచ్చాడా అని అడుగుతాడు...
చక్రపాణి: శైలేంద్ర కాదు బావగారు..రాక్షసుడు వచ్చాడు...
అనుపమ: రాక్షసుడా వాడెవడు
చక్రపాణి: రాజీవ్ గురించి మొత్తం చెబుతాడు చక్రపాణి...
అనుపమ: అలాంటి మనుషులు కూడా ఈ భూమ్మీదఉన్నారా
చక్రపాణి: నాక్కూడా వాడిని చూసాకే తెలిసింది...
మహేంద్ర: ఇంతకీ వాడెందుకు వచ్చాడు
చక్రపాణి: వసమ్మ కోసం వచ్చాడు... రిషి లేడని బాధపడకు నీకు నేనున్నాను అని రాజీవ్ మాటలు చెబుతాడు
అనుపమ బాధపడుతుంది...వసుధారా నువ్వు ఇలా డల్ గా ఉంటే నిన్ను ఇంకా వేధించాలని, అణగదొక్కాలని చూస్తుంటారు నువ్వు ధైర్యంగా ఉండాలి...సరే పద భోజనం చేద్దాం అంటుంది..
మీరు చేయండి నాకు ఆకలిగా లేదు..నా సిట్యుయేషన్ అర్థం చేసుకోండి..మీరంతా వెళ్లి తినండి అనేస్తుంది...
అనుపమ: నువ్వు రిషి బతికి ఉన్నాడని నమ్ముతున్నావ్...మహేంద్ర DNA టెస్ట్ నిజమని నమ్ముతున్నావ్...నిజంగా రిషి బతికి ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంది..
వసు: సర్ ఉన్నది నిజం...
అనుపమ: నువ్వు అన్నం తినకుండా కడుపుమాడ్చుకుని ఉండడం రిషికి నచ్చుతుందా..అన్నం ఎదురుచూడకూడదు రామ్మా అని బతిమలాడుతుంది..
Also Read: రిషి వస్తాడని పిక్సైన వసు - కొత్తగా ఎంట్రీ ఇచ్చిన క్యారెక్టర్ గురించి రాజీవ్ ఆరా!
శైలేంద్ర-రాజీవ్
శైలేంద్ర: నువ్వు వసుధార దగ్గరకు ఎందుకెళ్లావ్..కొన్నాళ్లు జాగ్రత్తగా ఉండమని చెప్పా కదా
రాజీవ్: నా మనసులో ఉన్న నా మరదలు పిల్లని ఓదార్చుదామని వెళ్లాను
శైలేంద్ర: ఓదార్చుదామని వెళ్లావా...ఓ దారికి తెచ్చుకుందామని వెళ్లావా
రాజీవ్: వసుధార కోసం వంద వేషాలు కానీ వర్కౌట్ కాలేదు
శైలేంద్ర: నువ్వు కంగారుపడకు..
రాజీవ్: ఈ రోజు సింపతీకోసం దండ తీసుకెళ్లాను..నా మరదలు, మావ రెచ్చిపోయి మాట్లాడారు
శైలేంద్ర: అయినా వాడి ఫొటోకి దండ మేం వేస్తేనే ఊరుకోలేదు..అయినా రిషి చనిపోయిన విషయం నీకెలా తెలుసు
రాజీవ్: నువ్వు మాత్రమే విలన్ వా ఏంటి..నేనుకూడా విలనే..నాక్కూడా సమాచారం వస్తుంది..అయినా నువ్వు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కానీ నేను వెళ్తాను..వసుధార విషయంలో ఏదో ఒకటి చేయాలని అనిపిస్తోంది కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు..ఆ ఎండీ సీట్ త్వరగా తీసుకుని నా మరదల్ని బయటకు గెంటేయ్..తీసుకెళ్లిపోతాను...
శైలేంద్ర: నేను కూడా ఎండీ సీట్ దక్కించుకునే ప్లాన్ లో ఉన్నాను...నీ మరదల్ని కాలేజ్ నుంచి పంపించి నీకు దక్కేలా చేస్తాను
రాజీవ్: థ్యాంక్స్ భయ్యా నేను బయలుదేరుతా అంటాడు.. మళ్లీ ఆగి....భయ్యా అసలు విషయం చెప్పడం మర్చిపోయాను నువ్వు ఎండీ సీట్ కోసం ఎంతమందినైనా చంపేసుకో...వసుధారపై పొరపాటున అయినా అటాక్స్, మర్డర్స్ ప్లాన్ చేస్తావేమో అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసుకో అని వార్నింగ్ ఇస్తాడు...వసుధారకి రిషి అంటే ఎంత ఇష్టమో..నాకు వసు అంటే అంతకు మించి ఇష్టం...కాబట్టి వసుధారని ఏదైనా చేస్తే నేను నిన్ను చంపడానికి కూడా వెనకాడను అని చెప్పేసి వెళ్లిపోతాడు...
Also Read: ఎండీ సీట్ కాదు కదా కాలేజీ గేట్ కూడా దాటనివ్వను, బాలయ్యలా వసు స్ట్రాంగ్ వార్నింగ్!
కాలేజీకి వచ్చిన ఎవరో ఇద్దరు వ్యక్తులు...రిషి సర్ లేనందుకు సారీ మేడం... ఓసారి ఆయన మా దగ్గరకు వచ్చి కాలేజీ నడపడం కష్టంగా ఉందంటూ 40 కోట్లు తీసుకున్నారు..మా డబ్బులు మాకివ్వండి అంటారు. మీరిప్పుడ ఏం చేస్తారో ఏమో మా సమస్య వెంటనే సాల్వ్ కావాలి అంటారు. బోర్డ్ మీటింగ్ పెట్టుకుని మా సమస్యను పరిష్కరించేవరకూ మేం ఇక్కడి నుంచి కదలం అంటారు. వెంటనే మహేంద్రకి కాల్ చేసిన వసుధార ఓ సమస్య వచ్చి పడిందంటూ జరిగింది చెబుతుంది...నేను బోర్డ్ మీటింగ్ అరెంజ్ చేస్తాను మీరు త్వరగా రండి అంటుంది. అనుపమని పిలిచి కాలేజీకి వెళదాం పద అంటాడు మహేంద్ర..
Also Read: మరో 12 ఎపిసోడ్స్ తో గుప్పెడంత మనసు కి శుభం కార్డ్ - కార్తీకదీపం లానే చేస్తారా!
బోర్డ్ మీటింగ్
ఈ క్షణం నుంచే పగబడుతున్నా నన్నే చెంపదెబ్బ కొడతావా ఈ క్షణం నుంచే నీకు చుక్కలు చూపిస్తాను అనుకుంటాడు శైలేంద్ర. రిషి సర్ ఇలా చేశారా అని బోర్డ్ మెంబర్స్ అంతా రియాక్టవుతారు. రిషి తాకట్టు పెట్టడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు, మీరు పొరపాటు పడి ఉంటారంటాడు మహేంద్ర. వచ్చిన వాళ్లు మాత్రం వెనక్కు తగ్గరు..రిషి డబ్బు తీసుకున్నారు...డబ్బు తిరిగి చెల్లించలేని స్థితిలో కాలేజ్ ని స్వాధీనం చేసుకోమన్నారంటారు. ఎక్కడో ఏదో జరిగిందంటాడు మహేంద్ర. రిషి గొప్ప వ్యక్తే కావొచ్చు కానీ అవసరం మనిషిని ఎంతవరకైనా దిగజార్చుతుందంటారు. అసలు మీరెవరని అడుగుతుంది అనుపమ... ఫైనాన్స్ కంపెనీ నుంచి మనీ ఇచ్చాం అంటూ తమదగ్గరున్న డాంక్యుమెంట్స్ ప్రూఫ్స్ చూపిస్తారు. నేను కూడా చూశాను అందులో అయితే రిషి తీసుకున్నట్టే ఉంది కానీ నాక్కూడా నమ్మబుద్ధి కావడం లేదంటాడు శైలేంద్ర. ఈ డాక్యుమెంట్స్ ని ఎవరో క్రియేట్ చేశారంటాడు మహేంద్ర. ( ముందు ఇలాగే అంటారు తర్వాత నమ్మకు తప్పదులెండి అనుకుంటాడు శైలేంద్ర). మేం కోర్టుకి వెళతాం అని బెదిరిస్తారు...సరే అని మహేంద్ర అంటే ...వాళ్లే గెలుస్తారు అంటుంది అనుపమ...
ఎపిసోడ్ ముగిసింది...,
Also Read: భర్త దగ్గర భార్య కామన్ గా దాచే 6 ముఖ్యమైన విషయాలు!