Guppedantha Manasu April 24th Episode: మహేంద్రని షూట్ చేసేశాడు - రిషి సపోర్ట్ అడిగిన వసుధార , గుప్పెడంత మనసు ఏప్రిల్ 24 ఎపిసోడ్!
Guppedantha Manasu Serial Today: మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది గుప్పెడంత మనసు. మను కూడా మహేంద్ర కొడుకే అనే నిజం బయటపడింది... రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం...
Guppedantha Manasu Serial Today Episode: (గుప్పెడంతమనసు ఏప్రిల్ 24 ఎపిసోడ్)
వసుధారకు కాల్ చేసిన ఏంజెల్ తాను, విశ్వనాథం దత్తత కార్యక్రమానికి రావడం లేదని అక్కడ జరుగుతున్నది ఇష్టం లేదని చెప్పేస్తుంది. వసుధార చెప్పేందుకు ప్రయత్నించినా ఏంజెల్ అస్సలు వినకుండా కాల్ కట్ చేస్తుంది.
వసుధార
ఫోన్ లో రిషి ఫొటో చూస్తూ మాట్లాడుతుంది వసుధార...మను మీ బ్రదర్ అంట , మనును ఒప్పించి దత్తత కార్యక్రమానికి తీసుకురమ్మని మహేంద్ర సర్ చెబుతున్నారు...ఈ నిజం మనుకి చెప్పే ధైర్యం నాకివ్వండి సర్ అనుకుంటుంది...
శైలేంద్ర-మహేంద్ర
మహేంద్రను ఓ ప్లేస్ కి రమ్మని కబురుపెట్టిన శైలేంద్ర..మహేంద్రను కన్వీన్స్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. తన తండ్రి, తల్లి ఇద్దరూ బాధపడుతున్నారని చెబుతాడు. అయినా కానీ మహేంద్ర తన నిర్ణయం వెనక్కు తీసుకునేదేలేదు అనేస్తాడు.
మహేంద్ర: మను బాధపడటం నేను చూడలేను ..నీలాంటివాళ్లు వేలెత్తి చూపడం నాకు నచ్చలేదు. అందుకే దత్తత తీసుకోవాలని ఫిక్సయ్యాను
శైలేంద్ర: మనును ఇక నుంచి నేను తండ్రి గురించి అసలు అడగను, మీరు మాత్రం ఈ దత్తత కార్యక్రమం ఆపాలి. దారినపోయే ఎవడినో తీసుకొచ్చి మన సామ్రాజ్యానికి రాజును చేస్తానంటే ఊరుకునేది లేదు
మహేంద్ర: దత్తత ఆపకపోతే ఏం చేస్తావు ...అందితే జుట్టు అందకపోతే కాళ్లు నీ సంగతి నాకు తెలుసు..
శైలేంద్ర: మనును కొడుకుగా నెత్తిమీద పెట్టుకొని ఊరేగుతానని అంటే చూస్తూ ఊరుకోనని ఎంత దూరమైనా వెళతాను.. ఈ దత్తత కార్యక్రమం ఎలా జరుగుతుందో చూస్తాను
మహేంద్ర: నువ్వు చూడాలనే కార్యక్రమానికి నిన్ను ఇన్వైట్ చేశాను...
అది జరగదు బాబాయ్ అని శైలేంద్ర అంటే..జరిగి తీరుతుందంటాడు మహేంద్ర...
Also Read: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా!
రాజీవ్ -శైలేంద్ర
రాజీవ్ కాల్ చేసిన శైలేంద్ర విషయం చెప్పడానికి ప్రయత్నిస్తే...నాకు మొత్తం తెలుసు అంటాడు. నీ ప్లేస్‌లో నేను ఉంటే ఈ దత్తత కార్యక్రమాన్ని చేస్తానన్న మీ బాబాయ్‌ని, ఆ తర్వాత మనును లేపేసేవాడిని శైలేంద్రతో అంటాడు. ఆ పని చేయమని రాజీవ్‌ను రిక్వెస్ట్ చేస్తాడు శైలేంద్ర. ఎవరికి స్పాట్ పెడతావో, ఎవరిని లేపేస్తావో నీ ఇష్టం అని అంటాడు. ఈ పని చేస్తే వసుధారను పువ్వుల్లో పెట్టి నీకు అప్పగిస్తానని రాజీవ్‌కు మాటిస్తాడు శైలేంద్ర.
మను - వసు
ఎందుకు కబురుపెట్టారు...ఏం చెప్పాలి అని అడుగుతాడు మను...
వసు: ముఖ్యమైన విషయం చెప్పాలి..ఇన్నాళ్లుగా మీరు ఏ ప్రశ్నకు సమాధానం కావాలని వెతుకుతున్నారో...దానికి ఆన్సర్ నాకు దొరికింది. మీ నాన్న ఎవరో నాకు తెలిసింది
మను షాక్ అవుతాడు...
వసు: ఇన్నాళ్లు మీ కళ్ల ముందుకు తిరుగుతున్న మహేంద్రనే నీకు కన్న తండ్రి. మహేంద్రభూషణ్ మీ నాన్న
అప్పుడే అక్కడికి వచ్చిన మహేంద్ర కూడా వసుధార మాటలు విని షాక్ అవుతాడు..
మహేంద్ర:నేను మను తండ్రినా...మను నా కన్న కొడుకా ..ఈ విషయం నీకు ఎలా తెలుసు...నువ్వు నిజమే చెబుతున్నావా
వసు: పెద్దమ్మ తనకు ఈ నిజం చెప్పారు..
మహేంద్ర: ఇన్నాళ్లు నీతో నేను ఎందుకు ఎమోషనల్ కనెక్ట్ అయ్యానో, ఎందుకు అటాచ్‌మెంట్ కలిగిందో ఇప్పుడు అర్థమయ్యింది..నిజం తెలియకుండానే నువ్వు నా కొడుకువని ఫీలింగ్ దేవుడు తనకు కలిగించాడు. మన మధ్య ఉన్న రక్త సంబంధమే మన మనసుల్ని కలిపించింది.
మహేంద్ర ఆప్యాయంగా హత్తుకునేందుకు వెళతాడు కానీ మను వెనక్కు నెట్టేస్తాడు..
మను: ఇంకోసారి నన్ను కొడుకు అని పిలవొద్దు. నువ్వు ఇన్నాళ్లు చూపించని ప్రేమ నాకు అక్కరలేదు...ఇన్నాళ్లు తండ్రి ఎవరో తెలియక నేను పడ్డ అవమానాలు చాలు .. నీ వల్ల నా తల్లి ఎంతో దుఃఖం, క్షోభ అనుభవించింది.. ఎన్నో అవమానాలు, కన్నీళ్లను భరించింది. నిన్ను ఎప్పటికీ క్షమించేది లేను...నీ క్షమాపణలు మా బాధలకు బదులు కాదు...
వసు: మను మాట్లాడిన మాటల్లో న్యాయం ఉంది ఆవేశంలో అర్థం ఉంది...ఇన్నాళ్లు తండ్రి ఎవరో తెలియక బాధలు పడ్డారు..ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా బాధలు పడటం ఎందుకని మనుకు సర్ధిచెప్పేందుకు వసుధార కూడా ప్రయత్నిస్తుంది. అందరి జీవితాల్లో తప్పులు జరుగుతాయి..అవే పట్టుకుని కూర్చుంటే ముందుకు వెళ్లలేం
మను: అది జరిగే పనికాదు..తండ్రి ఎవరో తెలుసుకోవాలని అనుకున్నది తన ప్రేమ పొందడానికి కాదు...మా బ్రతుకులు ఎందుకిలా చేశావని నిలదీయడానికే...లోకంలో గొప్ప తండ్రులేకాదు నీలాంటి నీచమైన తండ్రులు కూడా ఉంటారని చెప్పడానికే..
మహేంద్ర మను దగ్గరకు వెళుతుండగా...నువ్వు నన్ను ముట్టుకుంటే నిన్ను ఇక్కడే నిన్ను షూట్ చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. నువ్వు నన్ను చంపేసిన పర్వాలేదంటాడు మహేంద్ర...అయినా దగ్గరకు రావడంతో కోపం పట్టలేక మహేంద్రను షూట్ చేస్తాడు. ఒక్కసారిగా అనుపమ గట్టిగా అరుస్తుంది. అప్పటివరకు జరిగింది కల అని తెలుసుకుంటుంది అనుపమ....
ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది...
Also Read: ఈ రాశివారు చిన్న విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు - ఏప్రిల్ 24 రాశిఫలాలు
ఏప్రిల్ 25 గుప్పెడంతమనసు ఎపిసోడ్ లో దత్తత కార్యక్రమం జరుగుతుంది..