అన్వేషించండి

Horoscope Today: ఈ రాశివారు చిన్న విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు - ఏప్రిల్ 24 రాశిఫలాలు

Daily horoscope: ఏప్రిల్ 24 బుధవారం ఏ ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...

Horoscope Today 24th April 2024 

మేష రాశి

మీరు మీ ఆర్థిక స్థితితో సంతృప్తి చెందుతారు. చిన్న విషయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మానుకోండి. పెద్ద వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి ప్రదర్శిస్తారు. ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 

వృషభ రాశి

ఉద్యోగులు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. సాహిత్యం, కళలపై ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు ప్రారంభించిన ప్రతి పనిని ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తిచేస్తారు. వ్యాపారులు , విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి...

మిథున రాశి 

కుటుంబ సభ్యుల అవసరాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. విద్యార్థులకు చదువు విషయంలో సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. వివాహేతర సంబంధాలకు పూర్తిగా దూరంగా ఉండడం మంచిది. మీ దినచర్యను క్రమశిక్షమలో ఉంచుకోవాలి. 

Also Read: రాజకీయ నాయకుల విమర్శలలో వినిపించే 'పాపాల భైరవుడు' పురాణాల్లో ఉన్నాడా!

కర్కాటక రాశి

ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో విభేదాలున్నాయి జాగ్రత్త. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. 

సింహ రాశి

నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.  చేపట్టిన పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు..

కన్యా రాశి 

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. సమయానికి డబ్బులు చేతికి అందకపోవడంతో చేపట్టిన పనులు ఆగిపోతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది.

తులా రాశి

ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు.  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తగ్గుతాయి. కొత్త ఉపాధి మార్గాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు...

Also Read: ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం మీరు పాటించాల్సిన 6 నియమాలివే!
 
వృశ్చిక రాశి

ప్రయాణం చేసేందుకు  ప్రణాళికలు వేసుకుంటారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది స్నేహితులు మిమ్మల్ని చూసి అసూయపడవచ్చు. అనవసర ఖర్చులు పెరగడం వల్ల ఆ ప్రభావం మీ బడ్జెట్ పై పడుతుంది. ఉన్నత చదువుకోసం ప్రయత్నించే విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు తప్పవు..

ధనుస్సు రాశి 

ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మేధావుల సహవాసం లభిస్తుంది. సాంకేతిక రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు చాలా మంచిది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు సాధారణ ఫలితాలున్నాయి

మకర రాశి

మకర రాశి వారు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. దాన ధర్మాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. వైవాహిక జీవతం బావుంటుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. 

Also Read: రానున్న ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయ నాయకులు ధనం నష్టపోయినా గెలుపు పక్కా!

కుంభ రాశి 

మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార లక్ష్యాలను సకాలంలో సాధిస్తారు. ఇంట్లో మతపరమైన వాతావరణం ఉంటుంది. వ్యక్తిగత విషయాలను బయటి వ్యక్తులతో పంచుకోవద్దు. రియల్ ఎస్టేట్‌లో పెద్ద పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. 

మీన రాశి

ఈ రోజు మీరు అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. మీ భావాలను అందరి ముందు చెప్పొద్దు. అనవసర ఆలోచనల కారణంగా ఇబ్బంది పడతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 

Also Read: ఈ 3 రాశుల రాజకీయ నాయకులు ఎంత ఖర్చుచేసినా ఓటమి తప్పదు!

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి...

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

సూర్యగ్రహణం రాహు యోగం: ఈ 4 రాశులవారికి ఆగష్టులో 15 రోజులు కఠిన పరీక్ష!
సూర్యగ్రహణం రాహు యోగం: ఈ 4 రాశులవారికి ఆగష్టులో 15 రోజులు కఠిన పరీక్ష!
01-08-2026 శనివారం మీ రాశిఫలాలు!
01-08-2026 శనివారం మీ రాశిఫలాలు!
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
మేషం, మిథునం, ధనస్సు సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
మేషం, మిథునం, ధనస్సు సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget