News
News
X

Guppedantha Manasu September 10th Update: వసుకి ప్రేమగా వడ్డించిన రిషి, దేవయాని కుట్ర కనిపెట్టే పనిలో జగతి-మహేంద్ర

Guppedantha Manasu September 10th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు( శనివారం) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 

గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్  ( Guppedantha Manasu September 10 Today Episode 552)

జగతి-మహేంద్ర పెళ్లిరోజుని ఇంట్లో సెలబ్రేట్ చేద్దామన్న దేవయాని మాటలు విని షాక్ లో ఉన్న ఇద్దరూ వసుకి థ్యాంక్స్ చెప్పడానికి రెస్టారెంట్ కి వెళతారు. మా పెళ్లి రోజు ఫంక్షన్ కి రిషిని ఒప్పించాలి అని నీకు ఎందుకు అనిపించింది అని అడుగుతాడు. అప్పుడు వసు ఇందులో నా గొప్ప ఏమి లేదు సార్. ఒక అద్భుతం జరిగింది. రిషి సార్ ని ఒప్పించాలి అన్న ఆలోచన దేవయాని మేడం ది అనడంతో జగతి మహేంద్ర ఇద్దరు షాక్ అవుతారు. దీని వెనుక ఏమైనా కుట్ర ఉందేమో అని జగతి..మహేంద్రతో అంటుంది. ఈ లోగా వసుధార కళ్లుమూసుకుంటుంది..ఎందుకు అని జగతి-మహేంద్ర అడిగితే..రిషి సార్ వస్తున్నారు అంటుంది.. అక్కడికి రిషి రానే వస్తాడు..చూసి మహేంద్ర వాళ్లు ఆశ్చర్యపోతారు. ఆర్డర్ ప్లీజ్ అని వసుధార అనడంతో.. నేను కాఫీ తాగేలోగా నువ్వు పర్మిషన్ తీసుకుని రా ఇద్దరం వెళుతున్నాం అంటాడు. ఆయన చెప్పేది తప్ప ఎదుటివారు చెప్పింది అస్సలు వినిపించుకోరు అనుకుంటూ లోపలకు వెళ్లిపోతుంది. 

Also Read: 'లైగర్'ని అన్న మోనిత,'లోఫర్'వి అన్న దీప - వినాయక చవితి పూజలో మోనితకు షాక్ ఇచ్చిన కార్తీక్

ఫంక్షన్ కి ఏమేం కావాలి చెప్పండి పెద్దమ్మా అని దేవయానికి అడుగుతాడు... క్రాకర్స్, బెలూన్స్, రంగులు అనగానే.. ఇదేం దీపావళి, హోళీ, బర్త్ డే కాదు అని చెబుతుంది దేవయాని. ఇంతలో వసుధారని తీసుకుని వస్తాడు రిషి. లోపల కోపం ఉన్నా బయటకు నవ్వడం తప్పదు అనుకున్న దేవయాని..లేనినవ్వు తెచ్చిపెట్టుకుని లోపలకు ఆహ్వానిస్తుంది. ఎగ్జామ్స్ బాగా రాశావంటగా అందరూ చెబుతున్నారు..నీకేంటి ర్యాంక్ స్టూడెంట్ వి నువ్వు సాధిస్తావులే..ఇప్పటికే జీవితంలో చాలా సాధించావ్ కదా అని ఇన్ డైరెక్ట్ గా సెటైర్స్ వేస్తుంటుంది. ఇంతలో రిషి వచ్చి.. పెద్దమ్మా వసుధారని నేనే తీసుకొచ్చాను.. ఫంక్షన్ పనుల్లో వదిన ఒక్కరే ఇబ్బంది పడుతున్నారు తోడుగా ఉంటుందని తీసుకొచ్చాను..
దేవయాని: నేను కూడా ఇదే అనుకున్నా కానీ.. మొన్నే పరీక్షలు అయ్యాయి కదా తనకేమైనా పనులుంటాయని పిలవలేదు.. ఇక్కడ నీకు తోచిన సాయం చేయగలిగితే చేయి 
రిషి: అర్థం చేసుకోవాలి కానీ పెద్దమ్మది చాలా పెద్ద మనసు వసు..
ఇంతలో జగతి రావడంతో..మేడం..ఏవైనా పనులుంటే వసుధారకి చెప్పండి అంటాడు. 
దేవయాని: మొదట జగతి వచ్చింది..ఇప్పుడు వసు అడుగుపెట్టింది..తెలివితక్కువ సాక్షి బయటకు వెళ్లిపోయింది అని మనసులో అనుకుని.. భోజనానికి ఏర్పాట్లు చేశావా అంటుంది
ఇదంతా  దూరం నుంచి చూసిన మహేంద్ర...వదిన విషయంలో నాకు ఏదో తేడా కొడుతోంది.. రిషి ఎప్పటికి అర్థం చేసుకుంటాడో ఏమో..అనుకుంటాడు..

Also Read: వసు విషయంలో నిర్ణయం తీసేసుకున్న రిషి, దేవయాని ఏం చేయబోతోంది!

అటు గౌతమ్..ఏదో మర్చిపోతున్నాను..అయినా డీజే తెప్పించి పెద్ద హడావుడి చేద్దాం అనుకుంటే..ఇది రిషి సర్కిల్ ఇక్కడేమీ కుదరవు అనుకుంటాడు. ఇంతలో మహేంద్ర రావడంతో ఆ లిస్టు మొత్తం చూపిస్తాడు. నా ఆనందం కోసం  ఇదంతా చేసి నా మనసు దోచుకున్నాడు రిషి..హీరో..ఓ తండ్రిగా నేనే అర్థం చేసుకోలేదు. అక్కడకు వచ్చిన వసుధార .. జగతి-మహేంద్రకి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతుంది..
మహేంద్ర: వసుని రమ్మని అడిగితే డ్యూటీ ఉందని చెప్పిన విషయం గుర్తుచేసుకున్న మహేంద్ర...మనం కొందర్ని అర్థం చేసుకోలేకపోతున్నాం అని సెటైర్ వేస్తాడు. వర్షం ఉంది మనం కోరుకుంటే రాదు కదా కురవాలి అన్నప్పుడు అదే కురిసి వెళ్లిపోతుంది..కొందరు కూడా అంతే రావాలి అనుకున్నప్పుడు వస్తారు.. వసుధార ఇంతకీ నువ్వెలా వచ్చావ్..
వసు: రిషి సార్ తీసుకొచ్చారు సార్.. ( జగతి ముసిముసినవ్వులు నవ్వుకుంటుంది).. ఏంటి సార్ మీరు
మహేంద్ర: నేనేం అన్నానమ్మా మీ రిషి సార్...మీ ఇష్టం
గౌతమ్: మ్యారేజీ యానివర్శిరీ గిఫ్ట్ ఏంటి
జగతి: ఇది జరుపుకోవడమే తనిచ్చిన గిఫ్ట్
వసు: మేడం వాళ్లు రమ్మన్నప్పుడు రాలేదని ఇప్పుడు అలా అంటున్నారన్నమాట అనుకుని..ఏం జరిగిందంటే...
జగతి: వసు..నిన్నిప్పుడు వివరాలు ఎవరు అడిగారు పద...

అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. వసుకి రిషి వడ్డించడం చూసి జగతి-మహేంద్ర మురిసిపోతుంటారు. దేవయాని లోలోపల కుళ్లుకుంటూ ఉంటుంది. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ధరణికి పనిభారం ఎక్కువైందని మహేంద్ర అంటే.. అందుకే తనకి హెల్ప్ గా ఉంటుందని వసుధారని తీసుకొచ్చానంటాడు. మనింట్లో పనికి మీరొక్కరే ఇబ్బంది పడకండి.. అందరం కలసి చేద్దాం అంటాడు రిషి. ఆ పనులేవో నాక్కూడా చెప్పు అంటుంది దేవయాని. మీకెలా పనులు చెబుతాను అత్తయ్యగారు అంటుంది ధరణి. 

ఆ తర్వాత అందరూ కలసి ఫంక్షన్ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఎప్పటిలానే వసుధార ఆల్ రౌండర్ అని అందరూ పొగుడుతూ ఉంటారు. ఇంతలో రిషి అక్కడికి వచ్చి వసుధారని చూసి మురిసిపోతూ ఉంటాడు. వసు కూడా రిషి వైపు అలాగే చూస్తూంటుంది.  అప్పుడు మహేంద్ర వచ్చి జగతి మేడం మీకు మేం ఏ విధంగా సహాయ పడగలం అంటే..ఈ పని మేం చేసుకోగలం అంటుంది జగతి. ఇప్పుడు ఈ పూలు మనం కూడా కడదాం అంటాడు మహేంద్ర.

Published at : 10 Sep 2022 09:20 AM (IST) Tags: Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Rasagnya Reddy jyothi roy Guppedantha Manasu September 10 Guppedantha Manasu Episode 552

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu September 29th: భర్తతో జానకి ముద్దులాట, దొంగగా మారిన రామా- మల్లికని అనుమానించిన విష్ణు

Janaki Kalaganaledu September 29th: భర్తతో జానకి ముద్దులాట, దొంగగా మారిన రామా- మల్లికని అనుమానించిన విష్ణు

Guppedantha Manasu September 29th Update: రిషికి ప్రేమగా అన్నం తినిపించిన వసు - ఆపరేషన్ రిషిధార కు ప్లాన్ చేసిన జగతి అండ్ కో!

Guppedantha Manasu September 29th Update: రిషికి ప్రేమగా అన్నం తినిపించిన వసు - ఆపరేషన్ రిషిధార కు ప్లాన్ చేసిన జగతి అండ్ కో!

Gruhalakshmi September 29th Update: తులసి తప్పు చేసిందన్న సామ్రాట్- అమ్మలక్కల మాటలు విని రగిలిపోయిన అనసూయ

Gruhalakshmi  September 29th Update: తులసి తప్పు చేసిందన్న సామ్రాట్- అమ్మలక్కల మాటలు విని రగిలిపోయిన అనసూయ

Karthika Deepam September 29 Update: దుర్గ రీఎంట్రీ ఇక మోనితకు దబిడి దిబిడే, సంతోషంలో దీప-షాక్ లో కార్తీక్

Karthika Deepam September 29 Update: దుర్గ రీఎంట్రీ ఇక మోనితకు దబిడి దిబిడే, సంతోషంలో దీప-షాక్ లో కార్తీక్

Devatha September 29th Update: ఆదిత్య ప్రవర్తనకి ఆందోళనలో దేవుడమ్మ- దేవిని ఇంటికి పంపిన రుక్మిణి, షాకైన సత్య

Devatha September 29th Update: ఆదిత్య ప్రవర్తనకి ఆందోళనలో దేవుడమ్మ- దేవిని ఇంటికి పంపిన రుక్మిణి, షాకైన సత్య

టాప్ స్టోరీస్

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

RRR JAPAN : తారక్, చరణ్ తో కలిసి జపాన్ కు వెళ్తున్న రాజమౌళి | ABP Desam

RRR JAPAN : తారక్, చరణ్ తో కలిసి జపాన్ కు వెళ్తున్న రాజమౌళి | ABP Desam

Prabhas in Mogalturu : పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ | DNN | ABP Desam

Prabhas in Mogalturu : పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ | DNN | ABP Desam

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు