Guppedantha Manasu November 19th Update: తండ్రి కోసం తపించిపోయిన రిషి, బందీ అయిపోయిన వసు -ప్రెస్ మీట్ లో ఏం జరగబోతోంది!
Guppedantha Manasu November 19th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్ ( Guppedantha Manasu November 19th Today Episode 612)
జగతి మేడం కోసం ఆలోచిస్తున్న వసుధారకి ధైర్యం చెబుతాడు రిషి. మీడియా ఇంటర్యూకి ముందు వసుని ప్రిపేర్ చేయడానికి రిషి సరదాగా ఇంటర్యూ చేస్తుంటాడు. జగతి గురించి వసుధార గొప్పగా చెబుతుంటుంది ఇంతలో కాలేజీలోకి ఎంట్రీ ఇస్తుంది జగతి. అప్పుడు జగతి దూరం నుంచి రిషి, వసుధార చూసి సంతోష పడుతుంది.
దేవయాని-ధరణి మరొకవైపు దేవయాని మరొక ప్లాన్ వేస్తూ చెప్పింది గుర్తుంది కదా ఈసారి నేను చెప్పినట్టు జరగాలి మరిచిపోవద్దండి అని అంటుంది. మీరు చేయాల్సింది మీరు చేయండి ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను అని మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు విని ధరణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ధరణి అటుగా వెళ్లిందని అనుమానం వచ్చిన దేవయాని...ధరణి అని పిలుస్తుంది... అప్పుడే వచ్చిన ధరణి..నాకు వినిపించలేదు అత్తయ్యగారు కిచెన్లో బిజీగా ఉన్నానంటుంది. హమ్మయ్య అనుకుంటుంది దేవయాని. అటు ధరణి మాత్రం..ఈ విషయం వెంటనే రిషి-వసుధారఎవరో ఒకరికి చెప్పాలి..ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నారు ఈ విషయం రిషికి చెప్పాలి అనుకుంటూ వెళుతుంటుంది...ఇంతలో వెనుకే దేవయాని వచ్చి ఆపుతుంది.. ఎక్కడికి వెళుతున్నావ్ అని నిలదీస్తుంది.. ఊరికే వెళుతున్నా అని కవర్ చేస్తుంది. ఏదో టెన్షన్ గా కనిపిస్తున్నావని అనడంతో..మిమ్మల్ని చూసిన ప్రతీసారీ ఏదో టెన్షన్ గా ఉంటుంది అని కవర్ చేస్తుంది. దేవయాని మాత్రం..నాకుతలనొప్పిగా ఉంది తలపట్టు అంటుంది. అయ్యో ఫోన్ చేద్దాం అనుకుంటే ఇలా అయ్యిందేంటి అనుకుంటుంది మనసులో. వసుధార ఇంటర్యూకి మహేంద్ర-జగతి వస్తారంటావా అని దేవయాని అడిగితే.. వస్తే మంచిదే కదా అయినా నాకెలా తెలుస్తుంది అంటుంది.
Also Read: దీప-కార్తీక్ బతికే ఉన్నారని ఫిక్సైన సౌందర్య-ఆనందరావుకి, కుట్రల్లో మరింత ముదిరిపోయిన మోనిత
గౌతమ్-మహేంద్ర: మహేంద్ర ఆలోచిస్తూ కూర్చుంటాడు..ఇంతలో వచ్చిన గౌతమ్..వసుధార బాధని మేడం అర్థం చేసుకున్నారు అందుకే వెళ్లారు మీరు కూడా రండి అని పిలుస్తాడు. గౌతమ్ ఎంత చెప్పినా మహేంద్ర రాను అని అంటాడు. ఇంతలోనే ధరణి గౌతమ్ కి ఫోన్ చేస్తుంది. మరొకవైపు వసుధార జగతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వేరే వ్యక్తి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తూ కావాలనే వసుధార డ్రెస్ పై పోస్తాడు ..రిషి సీరియస్ అవుతాడు. పుష్ప అక్కడికి వచ్చి మీడియా వాళ్ళు వచ్చారు సార్ అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది.
Also Read: వసుకి బొట్టుపెట్టిన రిషి, మహేంద్రకి లెటర్ రాసి పెట్టేసి వెళ్లిపోయిన జగతి
వసు-జగతి-రిషి: వసుధార డ్రెస్ క్లీన్ చేసుకుంటూ ఉండగా జగతి అక్కడికి రావడంతో షాక్ అవుతుంది. ఆ తర్వాత ఆనందంగా జగతిని హగ్ చేసుకుంటుంది. కంగ్రాట్స్ వసు నువ్వు సాధించావు అంటుంది. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అనుకోకుండా అక్కడికి రిషి వస్తాడు. అప్పుడు మేడం డాడ్ ఎక్కడ అని అడుగుతాడు రిషి. డాడ్ అని రిషి వెతుకుతూ ఉండగా జగతి బాధపడుతుంది..మేడం మీరు మీ శిష్యురాల మీద ప్రేమతో వచ్చారు కానీ డాడ్ నాకోసం రాలేదు అని ఎమోషనల్ అవుతాడు. డాడ్ నన్ను ఇంత బాధ పెడుతున్నారు అంత పెద్ద తప్పు నేనేం చేశాను మేడం . ఇప్పుడు చెప్పండి మేడం ఒకవేళ మీకు ఇప్పుడు చెప్పడం ఇష్టం లేకపోతే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అయినా వెళ్లేటప్పుడు అయినా చెప్పి వెళ్ళండి మేడం అని జగతిని బ్రతిమలాడుతాడు . వసు కన్నా మీరుముందే వచ్చి ఇంట్రడక్షన్ ఇవ్వండి అని చెప్పేసి రిషి వెళ్లిపోతాడు..అప్పుడు ఓ వ్యక్తి వచ్చి వసుధార లోపల ఉండగా గదికి తాళం వేస్తాడు. మరోవైపు జగతి ఫణీంద్ర తో మాట్లాడుతూ ఉంటుంది...వసు ఇంకా రాలేదేంటని రిషి కంగారుపడుతూ ఉంటాడు...