Guppedantha Manasu మే 6 ఎపిసోడ్: వసుధారకు మనసులో మాట చెప్పేసిన గౌతమ్- చాటుగా గమనిస్తూ ఉండిపోయిన రిషి
వసుధార ఇచ్చిన షాక్‌కు రిషికి మైండ్ బ్లాంక్ అవుతుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని టైంలో గౌతమ్ తన ప్రేమ సంగతి వసుధారకు చెప్తాడు.
రిషి, వసుధార ఇద్దరూ కారు దిగి రూమ్‌కి వెళ్తుంటే..అక్కడ మహేంద్ర, జగతి వచ్చిన సంగతి గుర్తిస్తాడు రిషి. ఇక నేను రాననని మొండికేస్తుంటే... బలవంతంగా వసుధార తీసుకెళ్తుంది. చేయి పట్టుకొని తీసుకెళ్లడాన్ని బస్తీలోని దేవయాని మనిషి చూస్తుంది. రిషి, వసుధార, మహేంద్ర, జగతి కాసేపు మాట్లాడుకుంటారు. అందరూ వచ్చారు అన్ని పండుగలు ఒకేసారి వచ్చినట్టు ఉందని అంటుంది వసుధార.
సీన్ కట్ చేస్తే దేవయాని, సాక్షి రిషి కోసం ఆలోచిస్తుంటారు. మనం చేస్తున్న పనులు కరెక్టేనా అని అడుగుతుంది సాక్షి. అలాంటి టెన్షన్ ఏమీ లేదని తాను చెప్పినట్టు చేయమని మాత్రమే చెబుతుంది. జరిగేవి జరుగుతుంటాయని... మనం చేయాల్సినవి చేస్తే రిషితో పెళ్లి ఖాయమని... నేను చెప్పినట్టు మాత్రమే చేయమని చెబుతుంది.
వసుధార రూమ్ నుంచి జగతి, మహేంద్ర, రిషి వెళ్లిపోయిన తర్వాత బస్తీ వాసులు వచ్చి అడుగుతారు. మగాళ్లు వచ్చి పోతుంటే బస్తీలో బాగోదని దేవయాని మనిషి గట్టిగా మాట్లాడుతుంది. వసుధార ఏదో చెప్పబోతుంది. ఇలా మనుషులు రావడం మంచిది కాదని.. వేరే రూమ్ చూసుకోమని చెప్పి వెళ్లిపోతారు.
సాక్షి, ఫణీంద్ర, దేవయాని మధ్య డిస్కషన్ నడుస్తుంది. బయటపడడు కానీ.. నీవంటే చాలా ఇష్టమని సాక్షికి చెబుతుంది దేవయాని. ఏదైనా పని ఉంటే వెళ్లిరమ్మని చెప్తాడు ఫణీంద్ర. దేవయానికి ప్లాన్ అందరికీ అర్ధమైనట్టు చూస్తారు. దేవయాని గుర్తు చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఫణీంద్ర గుర్తు చేస్తాడు. ఈ విషయంలో వేరే వాళ్ల జోక్యం అవసరం లేదని వాళ్లే నిర్ణయించుకుంటారని ఫణీంద్ర చెప్తాడు. ఇంతలో కారు వస్తుంది. రిషి, జగతి, మహేంద్ర వస్తారు.
ఏంటీ ముగ్గురు కలిసి వస్తున్నారని అడుగుతుంది దేవయాని. కలిసి వెళ్లలేదని కానీ కలిసి వచ్చామంటుంది. సాక్షిని కూడా మీలో కలుపుకోవాలని సజెషన్ ఇస్తుంది. రిషి సాక్షిలకు పెళ్లి నిశ్చయమైందని గుర్తు చేస్తింది దేవయాని. ఇప్పుడు అవసరమా అని రిషి అసహనం వ్యక్తం చేస్తాడు. అయినా దేవయాని వినిపించుకోదు. బస్తీవాళ్ల కోసం ఆలోచిస్తున్నారని మాట్లాడుతుంది దేవయాని. సాక్షి అన్నీ వదిలేసి నీకోసమే వచ్చేసిందని రిషికి చెబుతుంది. మనస్థాయికి కుటుంబం, నీ రేంజ్‌కు తగ్గ వ్యక్తి అంటూ కోతలు కోస్తుంది. ఇంతకన్నా ఏం కావాలని అడుగుతుంది దేవయాని. తనతో సరిగ్గా మాట్లాడటం లేదని రిషిని అడుగుతుంది. ఇంతలో రిషి మాట్లాడుతూ.. ఈ విషయంలో ఒత్తిడి తీసుకురావద్దని చెప్పేస్తాడు. ఎవరూ ఈ విషయంలో కల్పించుకోవద్దని చెప్పేసి వెళ్లిపోతాడు.
వసుధార ఇంట్లో ఒంటరిగా కూర్చొని బస్తీ వాళ్ల మాటలు గుర్తు చేసుకొని ఏడుస్తుంది. ఇంత ఘోరంగా నీచంగా ఎలా ఆలోచిస్తున్నారని ప్రశ్నించుకుంటుంది. ఇంతలో రిషి ఫోన్ చేస్తాడు. ఫోన్ మాట్లాడలేనని, వస్తానంటే వద్దూ అనలేనని అనుకుంటుంది. రెండోసారి లిఫ్ట్ చేస్తే నేను వస్తున్నాను అని చెప్పి పెట్టేస్తాడు. ఇంట్లో లేను అని చెప్పేలోపు డోర్ తీస్తాడు రిషి.
వసుధార చాలా అన్‌కంఫర్ట్‌బుల్‌గా ఉంటుంది. ఎందుకొచ్చారు అని అడుగుతుంది వసుధార. షాక్ తిన్న రిషి ఏమైందని అడుగుతాడు. కనీసం మొహం చూడకుండా- వెళ్లిపోమంటుంది. లోపలికి వవెళ్తుంటే... మొహంపైనే డోర్ వేసేస్తుంది. రిషికి ఏమీ అర్థం కాదు. వసుధార అలా అనేసరికి రిషి వెనక్కి నడుస్తూ పడిపోతే మహేంద్ర వచ్చి పట్టుకుంటాడు. ఇవాల్టితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది.
రేపటి ఎపిసోడ్
నా ప్రేమను వసుధారకు చెప్తేద్దామనుకుంటున్నానని గౌతమ్ రిషితో అంటాడు. ఆల్‌దిబెస్ట్ చెప్పి రిషి పంపిస్తాడు. ఇలాగైనా నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో అని అనుకుంటాడు. గౌతమ్ తన ప్రేమ సంగతి చెబుతుంటే చాటుగా చూస్తుంటాడు.