Guppedantha Manasu ఏప్రిల్ 30 ఎపిసోడ్: వసుధార చేసిన మెసేజ్‌తో రిషిలో డైలమా- ఇంటి నుంచి వెళ్లిపోమని సాక్షికి సీరియస్ సింహం వార్నింగ్
వసుధార సీరియల్ ఇప్పుడు మెయిన్ ట్రాక్ ఎక్కింది. దేవయాని వేసిన ప్లాన్ ఫ్యామిలీలో అందరికీ షాక్ ఇచ్చింది.
నేను ఉండమన్నా ఉండవా గట్టిగా అడుగుతాడు రిషి. ఎందుకు ఉండాలో చెప్పండి. దానికి కారణం, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పమని అడుగుతుంది వసుధార. కాలేజీ ఎండీగా ఉండమని అడిగితే అని రిషి అంటే.. ఇది కాలేజీ విషయం కాదంటుంది వసుధార. ఉండిపోవచ్చు కదా అని బేలగా అడుగుతాడు రిషి. ఉండమనే గొప్ప మనసు మీకు ఉన్నా ఉండిపోయే అర్హత నాకు లేదంటుంది వసుధార. నాకు కొన్ని హద్దులు ఉన్నాయి దాన్ని దాటనివ్వొద్దని చెప్తుంది. వసుధార నీ మనసుకు నచ్చిన నిర్ణయమే తీసుకోమని చెప్పేస్తాడు రిషి. ఉండమని ఫోర్స్ చేయలేను.. వద్దని ఆపలేను అంటూ మనసు చెప్పిన మాట విమని చెప్పేస్తాడు. మీరు జంటిల్ మెన్ అని మరోసారి నిరూపించుకున్నారని వసుధార వెళ్లిపోతుంది. అందరూ షాక్ అవుతుంటారు... ఒక్క దేవయాని మాత్రం లోలోప నవ్వుతూ ఉంటుంది.
కింది నుంచి వెళ్లిపోతున్న వసుధారను పైన కారిడార్ నుంచి చూస్తూ బాధపడతాడు రిషి. వసుధార కూడా రిషిని చూసి అంతే బాధపడుతుంది. ఇంతలో ట్యాక్సీ వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఓ అమ్మాయి దిగుతుంది. ఆమెను చూసిన రిషి షాక్ అవుతాడు. ఆమె ఎవరో కాదు సాక్షి. గతంలో పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన సంఘటన గుర్తుకు వస్తుంది.
జగతి, వసుధార మీద గెలిచే ఆయుధం వచ్చిందని మనసులో అనుకుంటుంది దేవయాని. ఇకపై యుద్ధాలే గెలుస్తుందని అనుకుంటుంది.
సీన్ కట్ చేస్తే ఒంటరిగా నడుచుకొని వెళ్లిపోయి ఏదో ఆలోచిస్తుంటంది.
ఇంతలో ఇంటికి వచ్చిన సాక్షిని హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించాలని ధరణికి చెబుతుంది. అలాంటి వద్దని సాక్షి చెప్పేసి ఇంట్లోకి వచ్చేస్తుంది. జగతి, మహేంద్రను పిలుస్తుంది.
బెడ్‌రూమ్‌లో రిషి.. వసుధార కోసమే ఆలోచిస్తుంటాడు. సాక్షి వచ్చాక మరింత టెన్షన్ పడుతుంటాడు. వసుధారను ఎందుకు పంపించానే అనే బాధ, సాక్షి ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు వెంటాడుతుంటాయి. ఇంతలో థ్యాంక్యూ మెసేజ్ పంపిస్తుంది వసుధార. దాన్ని చదివి కాసేపు ఆలోచిస్తాడు.
హాల్‌లో సాక్షికి దేవయాని విపరీతంగా ఎక్కిస్తుంది. రిషిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్తుంది. ఇంతలో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. సాక్షి లండన్ నుంచి వచ్చేసిందని చెబుతుంది దేవయానికి. గతంలో జరిగింది జగతికి వివరిస్తాడు మహేంద్ర. ఇకపై అన్ని సమస్యలు తీరిపోతాయని చెబుతుంది దేవయానికి. జగతిని సాక్షికి పరిచయం చేస్తుంది దేవయాని. అక్కడి నుంచి సాక్షి వెళ్లిపోయిన తర్వత మహేంద్ర, దేవయాని మధ్య వాగ్వాదం జరుగుతుంది. జగతిని ఎత్తిపొడుస్తూ వెటకారం దట్టించి మరీ ఆనందం తాండవం చేస్తుంది. ముందు ముందు చాలా తెలుస్తాయిలే అని వెళ్లిపోతుంది దేవయాని.
బెడ్‌రూమ్‌లో వసుధార గురించే ఆలోచిస్తూ ఉంటాడు రిషి. వసుధార వెళ్తుంటే ఎందుకు ఆపలేకపోయాను అని ప్రశ్నించకుంటాడు. ఇంతలో సాక్షి వస్తుంది. రిషిని పలకరిస్తుంది. ఆమె చూసి ఎందుకు వచ్చావని అడుగుతాడు. నన్ను మర్చిపోయావు అనుకున్నా గుర్తు ఉన్నాను కదా అని సంబరిపడిపోతుంది సాక్షి. అడిగిందానికి సమాధానం చెప్పమని కోపంగా అడుగుతాడు రిషి. నేను మారిపోయాను అని చెబుతుంది. వచ్చిన దారిలోనే వెళ్లిపోమంటాడు రిషి.