అన్వేషించండి

Guppedantha Manasu ఏప్రిల్ 18 ఎపిసోడ్: వసుధారపై ఉన్న ఫీలింగ్‌ను చెప్పేసిన రిషి,

ఇవాళ్టి గుప్పెడంత ఎపిసోడ్‌ను చాలా పీక్స్‌కు తీసుకెళ్లాడు డైరెక్టర్. వసుధార, రిషి ఎపిసోడ్‌, గౌతమ్‌, రిషి ఎపిసోడ్‌ చాలా ఇంట్రస్టింగ్‌గా సాగాయి.

రిషితో కలిసి కాలేజీలో లంచ్ చేస్తున్న వసుధార... ఇంతలో రిషి మైండ్‌లో ఉదయం టిఫిన్ చేయలేదు కదా అనే మాట... టైంసరికి లంచ్‌ చేయాలన్న వసుధార మాటలు ఫ్లాష్ అవుతుంటాయి.  

రిషి- వసుధారా నువ్వు పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌ చేయకుండా జ్ఞానబోధన చేశావుకదా..
వసుధార- ఆ..ఆ.. తినడం కుదర్లేదు సార్.  అయినా మీకో విషయం చెప్పాలి. మీరు తీసుకున్న నిర్ణయంతో చాలా మార్పులు వచ్చాయి. 
రిషి- ఏంటో అవి
వసుధార- మీరు తీసుకున్న నిర్ణయంతో అన్ని సమస్యలు సర్దుకున్నాయి. అందరూ ఒక్కటయ్యారు. 
రిషి- కానీ నువ్వు ఒంటరివి అయ్యావు కదా!
వసుధార-ఇది కూడా నిజమే సార్. అయినా ఫర్వాలేదు సార్. ఇలాగైనా మళ్లీ యాక్టివ్ అవుతానేమో
రిషి- ఇన్నాళ్లూ పుస్కలంగా యాక్టివ్‌గానే ఉన్నావ్ కదా...
వసుధార- జగతి మేడంతో ఉండటంతో మొదలయ్యేక ఒకరంగా సోమరితనానికి అలవాటయ్యాను. 
రిషి- అది ఎలాగో
వసుధార- అంటే వసు.. ఈ టైంకి లే.. ఈ టైంకి రెడీ అవ్వు... వసూ నువ్వు తినేసే... వసు బాక్స్‌ తీసుకెళ్లు. అంటూ ఇలా ప్రతి విషయంలనూ మేడమ్ హెచ్చరించేవారు. అయినా కూడా మహేంద్ర సార్‌కి మీరు ఇచ్చిన గిఫ్ట్‌ వల్ల నేను ప్రశాంతంగా ఉన్నాను. అందరూ బావుంటారు. 
రిషి- వసుధారా నీకు బుర్ర నిండా ప్రశ్నలే కదా
వసుధారా- అవును సార్. ప్రశ్నలు ఉంటే కదా సమాధానాలు దొరికేది. నేను మీకో ప్రశ్న అడగనా సార్‌
రిషి- ఇప్పుడే అన్నాను.. ప్రశ్నలు ఎక్కువా అని అప్పుడే ప్రశ్న వేస్తావా
వసుధార- చెప్పండి సార్
రిషి- సర్లే కాని.. వద్దన్నా ఆగవు కదా..

ఇంతలో జగతి, మహేంద్ర రూంలోకి వస్తుంటారు. వసుధార, రిషి డిస్కషన్ విని అక్కడే ఆగిపోతారు. జగతి వెళ్లిపోదామంటే.. మహేంద్ర మాత్రం ఆగమంటాడు. టాపిక్ ఏదో ఇంట్రస్టింగ్‌గా ఉందంటాడు. 

వసుధార- మీకు నా మీద ఎందుకీ శ్రద్ధ?
వసుధార- తిన్నావా.. ఎలా ఉన్నావని అడుగుతారు... 
రిషి- ఏంటీ
వసుధార- అదేసార్ నామీద ఎందుకీ స్పెషల్ ఇంట్రస్ట్

రిషి సమాధానం కోసం వెతుకుతుంటాడు. 

పక్కనే వీరి సంభాషణ వింటున్న మహేంద్ర... అమ్మ దొంగ వసుధార అంటూ ఆశ్చర్యపోతాడు. 

వసుధార- కాలేజీలో ఇంతమంది స్టూడెంట్స్‌ ఉన్నారు. వాళ్లెవరికీ లేని క్వాలిటీస్, వాళ్లెవరికీ లేని లక్షణాలు ఏమున్నాయి సార్ నాలో... 
నాకు లిఫ్ట్ ఇస్తారు. నేనేదో అంటాను.. విసిగిస్తాను... అయినా తిట్టుకుంటూనే భరిస్తారు. 

పక్కనే ఉన్న సీక్రెట్‌గా వింటున్న మహేంద్ర, జగతి వీళ్లను చూసి చిన్నగా నవ్వు కుంటారు. 

వసుధార- ఇప్పుడు కూడా నేను టిఫిన్ తినలేదన్నారు. లంచ్‌కు పిలిచారు. 

రిషి- వసుధారా ఇదే ప్రశ్న నేను నిన్ను అడగొచ్చా.. నాకు కోపం ఎక్కువ, సీరియస్ సింహాన్ని... అప్పుడప్పుడు తిట్లు తింటూ నా కోపాన్ని భరిస్తావు కదా... నువ్వెందుకు భరించాలి. నా మీద నీవెందుకు శ్రద్ధ చూపాలి. 
వసుధార- నాకు ఉండే కారణలేవు నాకు ఉన్నాయి సార్. 
రిషి- అవేంటో తెలుసుకోవచ్చా.. 
వసుధార- మీరు... మీరు... 
రిషి- ఆ.... నేను.. 
వసుధార - ఊ... ఆ... మీరు మా జగతి మేడం గారి అబ్బాయి సార్
వసుధార- మరీ... మీరెందుకు సార్ నా మీద శ్రద్ద చూపిస్తున్నారో చెప్పండి సార్

పక్కనే ఉంటూ సీక్రెట్‌గా వింటున్న మహేంద్ర సంబరపడిపోతూ.. జగితో అంటాడు... 

మహేంద్ర- జగతీ... మన వసు బ్రహ్మాండం బద్దలయ్యే ప్రశ్న వేసిందికదా... ఇప్పుడు ఏం చెప్తాడు అంటావ్‌.  
జగతి- అవును మహేంద్ర, కానీ అలా అడగాల్సింది కాదేమో! ఈ ప్రశ్న నేను ఎప్పుడో వేశాను. డీజీపీ గారి ఇంట్లో. 
మహేంద్ర- కమాన్ రిషి.. మనసులో మాట చెప్పు. 
జగతి- మహేంద్ర తన చెప్తాడంటావా?
మహేంద్ర- చెప్తాడు... వాడు నా కొడుకు... చూడు చూడు... చెప్పరా పుత్ర... నా పరువు నిలబెట్టరా

రిషి- చెప్పండి సార్

జగతి- ఇది అయ్యే పనేనా మహేంద్ర 
మహేంద్ర- ఊ.. ఆ... చెప్తాడు చూడు. చూడు చూడు.. 
జగతి- మనం వెళ్దాం..
మహేంద్ర- కాసేపు ఉందాం.. వాడు చెప్తాడు చూడు... 

రిషి- వసుధారా నువ్వు అందరిలాంటి అమ్మాయివి కావు.... నీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి.. ఇలాంటి అమ్మాయిని ఎవరైనా ఇష్టపడతారు. ఇలాంటి అమ్మాయిని ఎవరు వదులుకుంటారు చెప్పూ... 

పక్కనే మహేంద్ర, జగతితోపాటు వసుధార కళ్లల్లో వెలుగులు మొదలవుతాయి. హార్ట్ బీట్‌ పెరుగుతుంది 

రిషి- అందుకే ... నిన్ను నేను... నేను... నిన్ను... నేను నిన్ను... నిన్ను.. నా... అసిస్టెంట్‌గా సెలెక్ట్ చేసుకున్నాను... 
పక్కనే ఉన్న మహేంద్ర అబ్బా... అంటూ గుండె పట్టుకుంటాడు... దెబ్బ కొట్టేశావు కదా... సిగ్గు పడుతున్నాడు.. ఎంతైనా నీ కొడుకు కదా... అంటాడు.. జగతి అందుకొని ఇప్పటి వరకు నా కొడుకూ నా కొడుకూ అన్నావు అంటూ దెప్పి పొడుస్తుంది. ఆ... అదే... మన కొడుకు సిగ్గు పడుతున్నాడని కవర్ చేస్తాడు మహేంద్ర... ఇంతలో అక్కడి నుంచి పదా అంటూ మహేంద్రను జగతి తీసుకెళ్లిపోతుంది. 

వసుధార, రిషి ఇద్దరూ కూడా కాస్త టెన్షన్‌లో ఉంటారు. ఏం మాట్లాడాలో అర్థం కానట్టు...ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. 

రిషి- ఆ..... చూడు వసుధారా...నాకు స్పష్టత లేనిదే నేను ఏదీ మాట్లాడను... అలా అని చెప్పి సగం సగం చెప్పి తప్పించుకోలేను. నువ్వు ఒక స్పెషల్ స్టూడెంట్‌వి.. ప్రత్యేకమైన స్టూడెంట్‌వి నా దృష్టిలో... 

కాసేపు ఇద్దరి మధ్య సైలెంట్‌.... అంతే అక్కడకి ఆ సీన్ అయిపోతుంది. 

కాలేజీ నుంచి రిషి బయటకు వెళ్తుంటాడు... ఇంతలో గౌతమ్‌ రిషిని పిలుస్తాడు.

గౌతమ్‌- అరే... రిషి... రిషి... 
రిషి- ఏంట్రా
గౌతమ్‌- వసుధార కనిపించలేదు.. కాలేజీలో లేదా..
రిషి- వెళ్లిపోయిందేమో... 
రిషి- అయినా... వసుధార గురించి... తన వివరాల గురించి నీకెందుకు? అసలు ఈ టైంలో కాలేజీకి ఎందుకు వచ్చావు... ఈ టైంలో వచ్చి వసుధార గురించి నన్నే అడుగుతున్నావా?  అసలేంట్రా నువ్వు... నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. 

గౌతమ్‌- అరే.... అర్థం కాని మనిషివి నువ్వు... అర్థం కాకుండా బిహేవ్ చేసేది నువ్వు.. అర్థం కాకుండా మాట్లాడేది నువ్వు.. నన్ను అర్థం కాలేదంటావేంట్రా .... నేను క్లియర్‌గా ఉంటాను.. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాను. ఏదైనా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాను... 

రిషి- ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్... 
గౌతమ్- నిజం మాట్లాడితే ఎక్కువ మాట్లాడుతున్నావ్‌ అంటావ్‌.. ఇదే నీతో ప్రాబ్లమ్‌.. కాలేజ్‌కు ఎందుకు వస్తాను... వసుధార కోసం వచ్చాను.. వసుధార కోసం ఎందుకు వస్తున్నావంటే... ఏం చెప్తాను.. నా ఏంజిల్‌ను చూడాలనిపించి వచ్చాను... 
రిషి- అరే... ఇంకోసారి తనను ఏంజిల్ అన్నావంటే ఊరుకోను.. 
గౌతమ్‌- ఎందుకు ఊరుకోవురా... నీకేంటి ప్రాబ్లమ్‌... 
రిషి-  ఏంజిల్ ఏంజిల్ అంటే వసుధార బాధపడదా? ఏదో నువ్వు నా ఫ్రెండ్‌వి కాబట్టి నిన్ను కొట్టాలనిపించిచనా కొట్టకుండా నేను ఆగిపోతున్నాను... అసలు ఎందుకులా మాట్లాడతావ్‌... అది తప్పు కదా.. మర్యాద కాదది... 
గౌతమ్‌- అబ్బో... సరేలేరా చెప్పొచ్చవ్‌... నీకు మనుషులు గురించి బంధాలు గురించి అభిప్రాయ గురించి నువ్వేమనుకుంటున్నావో తెలియదు.. నీవు అన్నీ మనసులో అనుకుంటావ్‌... నేను బయటకు ఎక్స్‌ప్రెస్‌  చేస్తాను. అంతే తేడా.. నిజం చెప్పనా... ధరణి వదిన పంపించింది. పాపం రాత్రి వసుధార ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందోనని పాపం ధరణి వదినా టెన్షన్ పడుతోంది. తెలుసుకొని రమ్మని పంపించింది. పెద్దమ్మకు చెప్పొద్దని చెప్పిందిలే.. 

కాసేపు టెన్షన్‌ మ్యూజిక్‌తో ఇద్దరి మోహాలు క్లోజప్‌ షాట్‌లు వేస్తారు.. 

గౌతమ్‌- ఏంట్రా... 
రిషి- ఏం లేదులే... నువ్వు వెళ్లు.. 
గౌతమ్‌- ఇద్దరం వెళ్దాం రా
రిషి- నాకు కాస్త పని ఉంది మళ్లీ వస్తానులే.. 
గౌతమ్- ఇదేరా నీవంటే... ఏం ఆలోచిస్తున్నావో చెప్పవ్.... ఏం చేయబోతున్నావో చెప్పవ్‌... 
సర్లే నాకు తప్పుతుందా... వెళ్తున్నాలే.. నీకు ఇన్‌ఫర్మేషన్ ఇవ్వడానికే వచ్చినట్టు ఉన్నాను. 

రిషి- పాపం తనకు ఎక్కడుందో ఏంటో (మనసులో అనుకుంటాడు)

సీన్ వసుధార రూమ్‌కు షిప్ట్ అవుతుంది.  

ఏదో గుర్తు తెలియని రూమ్‌ వైపు జగతి, మహేంద్ర వెళ్తుంటారు... డోర్‌ నాక్ చేస్తారు. లోపలి నుంచి వసుధార డోర్ తీస్తుంది. 

అక్కడ జగతి, మహేంద్రను చూసి షాక్ అవుతుంది. మేడం అంటూ ఆశ్చర్యపోతుంది. 

వసుధార- రండీ లోపలికి
జగతి- ఇక్కడ ఉంటావా నువ్వు... 
వసుధార- అవును మేడం. కింద రెస్టారెంట్‌ పైన నేను.. 
మహేంద్ర- ఏంటమ్మా.. ఈ రూం నీకు ఓకేనా.. 
వసుధార- నాకు ఈ రూం చాలు కదా సార్‌... మా రెస్టారెంట్ మేనేజర్ గారు కూడా చాలా మంచివారు. 
నన్ను మేడం ఎలా చూసుకుంటారో అలానే చూసుకుంటారు. రాత్రి పూట టాక్సీలు, ఆటోలు అంటూ తిరిగే పనే ఉండదు. ఈ విషయంలో మాత్రం టైం, మనీ రెండూ మిగులుతాయి మేడం. 
మహేంద్ర- వసుధార!.. కొంచెం జాగ్రత్తగా ఉండాలి .
వసుధార- నాకేం సార్‌... నేను బాగానే ఉంటాను. మీరు ఉన్నారు. మేడం ఉన్నారు.. రిషి సార్ ఉన్నారు. 
మహేంద్ర- అందరూ ఉన్నా... మనసులో ధైర్యం కూడా ఉండాలమ్మ. 
జగతి- అవును వసూ... నీవు ధైర్యవంతురాలివే.. కాదనను అలాగని... నిర్లక్ష్యంగా మాత్రం ఉండకు. 
వసుధార- నాకేం సెక్యూరిటీ ప్రాబ్లమ్ లేదు మేడం. రెస్టారెంట్‌లో పని చేసే స్టాఫ్ సగం మంది అక్కడే పడుకుంటారు. 
జగతి- ఈ మాత్రం ధైర్యం ఉండాలి వసుధార
వసుధార- మేడం... మొదటి సారి నా రూంకి వచ్చారు. కాఫీ, టీ, జ్యూస్ గానీ...

జగతి- వసూ... ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం పెట్టుకోకు... నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టు

వసుధార- మీరు, రిషి సార్‌ ఇద్దరూ ఒకటే మేడం... ప్రతి మూడు మాటల్లో ఒకటైనా చదువు, లక్ష్యం అంటుంటారు...
జగతి- నా కొడుకే కదా వసూ... అందులోనూ మీ ఎండీగారికి నీపై ప్రత్యేక శ్రద్ధ కదా... 
వసుధార- అలా ఏం లేదు మేడం.. 
మహేంద్ర- హలో... హలో.. తెలుసు ఇక్కడ... నీ చదువుపై రిషికి ఎంత ఇంట్రస్టో తెలుసు.. 

ఆ మాటలు విన్నకా.. వసుధార సిగ్గు పడుతూ పక్కకి మొహం తిప్పుకుంటుంది. జగతి ఆమె మొహాన్ని పట్టుకొని... 

జగతి- మేం వెళ్లొస్తాం... జాగ్రత్త వసూ.. 
వసుధార- ఓకే మేడం... 
జగతి- బై వసూ.. జాగ్రత్తా...
వసుధార- బై మేడం, బై సార్‌... 
వసుధార-- అయ్యో ఫోన్‌..  అయ్యో ఛార్జింగ్ అయిపోయిందే... అయ్యో ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలా...

సీన్‌ మళ్లీ మహేంద్ర ఇంటికి షిప్టు అవుతుంది. 

తన బెడ్‌రూంలో ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తుంటాడు రిషి. 
కాలేజీలో లంచ్‌టైంలో వసుధార అడిగిన ప్రశ్నలు మైండ్‌లో ఫ్లాష్ అవుతుంటాయి. గౌతమ్ చెప్పిన మాటలు కూడా గుర్తుకు వస్తాయి. 

రిషి- ఈ పొగరు ఎక్కడ ఉంది? ఏం చేస్తూ ఉంటుంది...అసలు నాకు ఏం తెలియకుండా అయిందేంటి? అసలు తనైనా నాకు చెప్పాలి కదా!
సార్ ఇదిగో ఇక్కడ ఉన్నాను అని చెప్పాలి కదా.. 
వెంటనే ఫోన్ అందుకొని వసుధారకు ఫోన్ చేస్తాడు. ఫోన్ కనెక్ట్ కాదు.. రిషిలో టెన్షన్ పెరుగుతుంది. వసుధార ఎక్కడ ఉంటుంది.. ఎలా ఉంటుంది... మళ్లీ ట్రై చేస్తాడు.. ఫోన్ రింగ్ అవుతుంది... ఫోన్ ఎత్తితే తిట్టేద్దామన్న రేంజ్‌లో ఫోన్ చేస్తాడు. కాలేజీలో నిలదీసింది అది కూడా అడగాలి అనుకుంటాడు. ఫోన్ లిఫ్ట్ చేయదు.   
రిషి- ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. ఈరోజు ఏ టైం అయినా ఫోన్‌లో మాట్లాడాలి. డాడీ వాళ్లు ఏంటి ఇంకా ఇంటికి రాలేదు. డాడ్‌కి ఫోన్ చేసి అడగాలా.. వసుధార ఎక్కడ ఉందని... అడిగితే ఇంకోలా అనుకుంటారేమో... అసలు ఏమైంది నాకు... తన గురించి ఎందుకిలా ఆలోచిస్తున్నాను... వసుధార అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటి... నేను ఏమవుతాను.. ఎందుకింత శ్రద్ధ తన మీద నాకు... తనతో నాకేంటి బంధం... 

ఇంతలో కారు వచ్చిన సౌండ్ అవుతుంది. 
రిషి- డాడ్‌ వాళ్లు వచ్చినట్టు ఉన్నారు. వసుధార వాళ్లతో వచ్చి ఉంటుందా? అక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

మంగళవారం ఎపిసోడ్‌

ఫోన్‌లో వసుధారను గట్టిగా అరుస్తాడు రిషి... ఎన్నిసార్లు ఫోన్ చేయాలి. నువ్వు ఎక్కడ ఉన్నావ్. ఎలా ఉన్నావో అని నేను టెన్షన్ పడుతున్నాను... వసుధారకు తెలియకుండానే వెనుకాలే ఉంటాడు..
వసుధార- తిట్టకండి సార్... 
రిషి- నేను మాట్లాడుతున్నాను... తిట్టడం లేదు..
వసుధార- భలే విచిత్రంగా ఉంది సార్.  
రిషి- ఏంటి విచిత్రం
వసుధార- నా వెనకాలే ఉండి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది.  ఇదేం మాయ సార్... 
రిషి- మాయదారి మాయ అంటారులే కానీ.. 
వసుధార- ఈ ప్లేస్‌ గురించి తెలియదు కానీ... అంటూ వెనుకాలే ఉన్న రిషిని చూసి షాక్ అవుతుంది... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
High Court: ఆ 106 మంది ఉద్యోగులకు ఊరట - విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు కీలక ఉత్తర్వులు
ఆ 106 మంది ఉద్యోగులకు ఊరట - విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు కీలక ఉత్తర్వులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
ITR 2024: ఐటీఆర్‌ను ఇప్పుడు సబ్మిట్‌ చేయాలా, ఆగాలా? - ఎక్స్‌పర్ట్స్‌ ఏం చెప్పారు?
ఐటీఆర్‌ను ఇప్పుడు సబ్మిట్‌ చేయాలా, ఆగాలా? - ఎక్స్‌పర్ట్స్‌ ఏం చెప్పారు?
Embed widget