Guppedanta Manasu Serial Today May 25th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: జైలులో రాజీవ్‌ను కలిసిన శైలేంద్ర – పొడుపుకథతో దేవయానిని ఆట పట్టించిన ధరణి
Guppedanta Manasu Today Episode : పొడుపుకథతో దేవయాని, శైలేంద్రను ధరణి ఆట పట్టించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ కొంచెం ఫన్నీగాను కొంచెం ఆసక్తిగానూ జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode : దేవయాని ఏదో ఆలోచిస్తూ ఉంటే ధరణి వచ్చి ఏదో చెప్పబోతుంది. వెంటనే ఏమీ చెప్పకుండా వెళ్లిపోతుంటే ఏదో చెప్పాలని వచ్చి ఎందుకు మళ్లీ చెప్పకుండా వెళ్తున్నావు అంటూ అడుగుతుంది. దీంతో ధరణి నేను మీకు ఒక పొడుపుకథ వేస్తాను మీరు విప్పాలి అంటుంది. దీంతో వాటిలో నేను ఆరితేరినదాన్ని నా తెలివి ఏంటో చూపించి నీకు తెలివి లేదని నిరూపిస్తాను అంటుంది దేవయాని. వెంటనే ధరణి ఒక పొడుపు కథ పొడుస్తుంది. దీంతో దేవయాని ఆలోచించి నేను చెప్పను అంటుంది. దీంతో మీకు తెలియదని చెప్పండి అంటుంది. దీంతో దేవయాని సరే నువ్వె చెప్పు అంటుంది. చెప్పనని ధరణి వెళ్లిపోతుంది. మరోవైపు శైలేంద్ర జైలుకు వెళ్లి రాజీవ్‌ను కలుస్తాడు. రాజీవ్ తో నేను కాదు నేను కాదు అంటూ బిత్తిరి బిత్తిరి గా మాట్లాడుతుంటే
రాజీవ్: ఏం చేశారు భయ్యా.. నేను కాదు నేను కాదు అంటున్నావు.
శైలేంద్ర: నేనా నేనేం చేశాను. నేనేం చేయలేదు.
రాజీవ్: భయ్యా జైలు లోపల ఉంది నువ్వా నేనా? ఎందుకలా భయపడుతున్నావు.
శైలేంద్ర: భయమా అదేం లేదే..?
రాజీవ్: లేదు భయ్యా నువ్వు దేని గురించో భయపడుతున్నావు. పర్లేదు నీ గురించి నేను ఎవ్వరికీ ఏం చెప్పనులే..
అంటూ రాజీవ్, వసు గురించి అడుగుతాడు. వాళ్లు అంతా పక్కాగా ప్లాన్ ఎలా చేశారో నాకు అర్థం కావడం లేదు. మీ బాబాయ్ ని చూస్తే కామెడీ ఫేస్ అనుకున్నాను. కానీ హీరో మెటిరియల్ అని మొన్నే తెలిసింది. అంటూ రాజీవ్ మాట్లాడుతుంటే అసలు నిన్ను పట్టించింది వాళ్లేనంటావా? అంటూ డౌట్ క్రియేట్ చేస్తే రాజీవ్ కూడా నిజమే అయ్యుండొచ్చు అంటాడు.
రాజీవ్: వసు వాళ్ల వెనకున్న వాడెవడో తెలుసుకోవాలి..
శైలేంద్ర: అయినా వాడెవడో తెలుసుకుని ఏం చేస్తావు బ్రదర్..
రాజీవ్: చంపేస్తాను. అవును భయ్యా నా పెళ్లిని ఆపినవాడిని ఊరికే వదలను. వాణ్ని చంపిన తర్వాతే వసు మెడలో తాళి కడతాను. భయ్యా నాకు నువ్వు ఒక సాయం చేయాలి.
శైలేంద్ర: ఏం సాయం..
రాజీవ్: వాళ్లకు సాయం చేసిందెవరో నువ్వు తెలుసుకోవాలి.
అని రాజీవ్ అడగడంతో శైలేంద్ర షాక్ అవుతాడు. నేనెలా తెలుసుకుంటానంటాడు శైలేంద్ర.. దీంతో ఎందుకు కంగారుపడతున్నావు అంటూ రాజీవ్ అడుగుతాడు. అదేం లేదని అక్కడి నుంచి వెళ్లిపోతాడు శైలేంద్ర. మరోవైపు దేవయాని, ధరణి వేసిన పొడుపుకథ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో శైలేంద్ర వస్తాడు. మామ్ దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతే పొడుపుకథ గురించి ఆలోచిస్తున్నాను అంటూ ధరణి ఈ పొడుపుకథ వేసిందని దానికి సమాధానం చెప్పకపోతే తక్కువైపోతానని అంటుంది దేవయాని.
పొడుపుకథని శైలేంద్రకు చెబితే విప్పడం తన వల్ల కాదంటాడు శైలేంద్ర. ఇంతలో ధరణి వస్తుది. శైలేంద్ర పొడుపు కథకు ఆన్సర్ చెప్పమని అడుగుతాడు. ధరణి చెప్పనని అనడంతో శైలేంద్ర కోపంగా ధరణిని అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్తాడు. దీంతో ధరణి వెళ్లిపోతుంది. తర్వాత రాజీవ్ ఏమన్నాడని అడుగుతుంది దేవయాని. జరిగిందంతా చెప్తాడు శైలేంద్ర. మరోవైపు మను చాంబర్‌లో కూర్చుని శైలేంద్ర మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటాడు. వసు వచ్చి మనును ఓదారుస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సత్యభామ ట్రైలర్ వచ్చేసింది - యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్