Guppedanta Manasu Serial Today May 14th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్ : వసు ఛాంబర్‌లో సీక్రెట్ మైక్ పెట్టిన శైలేంద్ర – పిచ్చిగా తిట్టేసిన మహేంద్ర
Guppedanta Manasu Today Episode : వసుధార క్యాబిన్ లో శైలేంద్ర సీక్రెట్ మైక్ పెట్టడం.. ఈ విషయం మహేంద్రకు తెలియడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: శైలేంద్ర వసుధార ఛాంబర్‌లో సీక్రెట్ మైక్ పెట్టిస్తాడు. మైక్ పని చేస్తుందా? లేదా అని చెక్ చేయమని మైక్ పెట్టిన వ్యక్తిని అనుమానిస్తాడు శైలేంద్ర. కావాలంటే చెక్ చేసుకోండని నేను ఇక్కడే ఉండి మాట్లాడతాను మీరు బయటకు వెళ్లి వినండి అని చెప్తాడు. శైలేంద్ర బయటకు వెళ్లి ఇయర్‌బర్డ్ పెట్టుకోగానే మైక్ పెట్టిన వ్యక్తి శైలేంద్రను తిడతాడు. లోపలికి వచ్చిన శైలేంద్ర మైక్ పెట్టిన వ్యక్తిని తిట్టి డబ్బులిచ్చి పంపిస్తాడు. శైలేంద్ర కూడా తన క్యాబిన్‌లోకి వెళ్లి కూర్చుంటాడు. తర్వాత వసుధార, మహేంద్ర క్యాబిన్‌లోకి వస్తారు.
వసు: మామయ్య నా క్యాబిన్‌లోకి ఎవరైనా వచ్చారా? టేబుల్ మీద ఫైల్స్ కదలినట్టున్నాయి.
మహేంద్ర: ఏం లేదమ్మా..
వసు: మామయ్యా మొన్న మన ప్రాజెక్టుకు ఒక పాస్‌వర్డ్ పెట్టాము కదా అది మర్చిపోయాను మీ దగ్గర ఉందా? అని వసు అడగ్గానే మహేంద్ర నేను రాసిపెట్టుకున్నానని తీసి ఇస్తాడు. ఇంతలో మహేంద్ర రిషిని గుర్తు చేసుకుంటుంటే.. రిషి సార్ త్వరలోనే వస్తారని వసు ధైర్యం చెప్తుంది. ఇంతలో మహేంద్ర పర్సు కింద పడిపోతే తీసుకోవడానికి కిందికి వంగగానే టేబుల్‌కు పెట్టిన మైక్ కనబడుతుంది. దీంతో మహేంద్ర ఏమీ మాట్లాడకుండా పేపరు మీద రాసి వసుధారకు చూపిస్తాడు. వెంటనే వసు, మహేంద్ర శైలేంద్ర గురించి మాట్లాడుకుంటారు. శైలేంద్ర మారిపోయాడని మహేంద్ర అంటే లేదని ఆయన కాలేజీ కోసం మారినట్టు నటిస్తున్నాడని వసుధార అంటుంది. ఇదంతా తన ఛాంబర్‌లో కూర్చుని వింటుంటాడు శైలేంద్ర.
మహేంద్ర: ఈ మను లాంటివాణ్ని డీల్ చేయాలంటే ఆ శైలేంద్రే కరెక్టు అమ్మా..
వసుధార: కానీ మామయ్యా తను ఏం చేసినా ఆ ఎండీ సీటు కోసమే చేస్తాడు. ఆ విషయం నాకు పక్కాగా తెలుసు మామయ్యా.
మహేంద్ర: అయితే ఆ ఎండీ సీటు ఇచ్చేద్దాం అమ్మా..
వసు: మామయ్యా అందుకు నేను ఒప్పుకోను..
మహేంద్ర: ఎండీ సీటు ఇవ్వకపోయినా ముందు మనం ఈ సమస్య నుంచి బయటపడాలి. అందుకే ఆ శైలేంద్ర హెల్ప్ తీసుకుందాం..
వసు: తను ఏమీ చేయలేడు మామయ్యా..
మహేంద్ర: వాడే చేయగలడు అమ్మా..
అంటూ ఇద్దరూ కలిసి ఒకరేమో శైలేంద్రను పొగుడతూ.. మరొకరేమో తిడుతూ.. వాదులాడుకుంటుంటే అంతా వింటున్న శైలేంద్ర బాబాయ్‌కి నా మీద నమ్మకం బాగా పెరిగిపోయింది ఇప్పుడే అక్కడకు వెళ్లి ఈ కాలేజీ ఎండీ సీటు కొట్టేయాలని వసు ఛాంబర్‌లోకి వెళ్తాడు.
శైలేంద్ర: ఏంటి బాబాయ్ ఏదో మాట్లాడుకుంటున్నారు.
మహేంద్ర: మేమేదో మాట్లాడుకుంటున్నాము నీకెందుకు? నీకు వేరే పనిలేదా? మేము ఏం మాట్లాడుకుంటున్నాము ఏం చేస్తున్నాము అని ఎదురుచూడటమేనా నీ పని అసలు నువ్వెందుకు వచ్చావు వెళ్లు..
శైలేంద్ర: మీరేదో టెన్షన్ పడుతున్నారు చెప్పండి బాబాయ్.. ఏం చేయాలో
అనగానే మహేంద్ర ఇప్పుడు కాలేజీ కష్టాల్లో ఉందని నువ్వు కాపాడగలవా? అని అడుగుతాడు. దీంతో నేను కాపాడతానని.. మనును జైలు నుంచి బయటకు తీసుకువస్తానని కాలేజీని కాపాడతానని కానీ నేను చెప్పింది మీరిద్దరూ చేయాలని కండీషన్ పెడతాడు శైలేంద్ర. దీంతో వసుధార మేము చేయమని చెప్పడంతో మీరు చేస్తేనే నేను హెల్ఫ్ చేస్తానని మీరు నన్ను నమ్మండి నేను కాలేజీని కాపాడతానని చెప్పి వెళ్లిపోతాడు. ఈ మైక్ నేను ముందే చూసినందుకు మనం బతికిపోయామని మహేంద్ర అంటాడు. అవును మామయ్య లేకపోతే పరిస్థితి ఇంకోలా ఉండేది అంటుంది. తర్వాత శైలేంద్ర, మహేంద్ర, వసు స్టేషన్‌కు వెళ్లి మనును కలుస్తారు. మహేంద్ర, మనును తిడుతుంటాడు. ఇంతలో శైలేంద్ర అగ్రిమెంట్ పేపర్ తీసి మహేంద్ర చేతిలో పెడతాడు. ఏంటని మహేంద్ర అడగ్గానే ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: షాకింగ్, భార్యకు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ విడాకులు - 11ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి