Guppedanta Manasu Serial Today June 5th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: వసుధారతో జాగ్రత్తగా ఉండమని శైలేంద్రకు దేవయాని హెచ్చరిక – పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వసు, మహేంద్ర
Guppedanta Manasu Today Episode: వసుధారను అనవసరంగా రెచ్చగొట్టావని ఇకపై జాగ్రత్తగా ఉండమని దేవయాని, శైలేంద్రను హెచ్చరించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్ట్ గా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: వసుధారతో శైలేంద్ర మాట్లాడటాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారని దేవయాని తిడుతుంది. వసుధార సైలెంటుగా ఉంది కాబట్టే మన ఆటలు సాగుతున్నాయి. తను ఒక్కసారి తెగించి అడుగు ముందుకు వేసిందంటే మనం భస్మం అయిపోతాం అంటూ శైలేంద్రను హెచ్చరిస్తుంది దేవయాని. దీంతో తన ధైర్యం రిషితో పాటే గంగలో కలిపిపోయిందని తనిప్పుడు చాలా వీక్‌గా ఉందంటాడు శైలేంద్ర. ఇంతలో అక్కడికి ధరణి వచ్చి ఏదేదో మాట్లాడుతుంటే
దేవయాని: ఏయ్ ఎందుకు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నావు.
ధరణి: ఎందుకు లేదు అత్తయ్యా పొంతన ఉంది. కానీ మీకే అర్థం కావడం లేదు.
శైలేంద్ర: ధరణి ఇరిటేషన్ తెప్పించకు?
ధరణి: ఇదేనండి ఈ ఇరిటేషనే మనిషికి ఉండకూడదు. ఎవండి మీరు చాలా మారిపోయారు. కానీ మరీ ఇంతలా మారిపోతారని అనుకోలేదు. ఒంటి మీద బట్టలు లేకుండా తాగి ఇంటికొస్తారనుకోలేదు.
అనగానే శైలేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ధరణి కూడా వెళ్లిపోతుంది. దేవయాని ధరణి గురించి ఆలోచిస్తుంది. మరోవైపు వసుధార అలోచిస్తుంది. మహేంద్ర ఏం ఆలోచిస్తున్నావు అని అడిగితే ఏం పలకదు.
మహేంద్ర: నిన్న వదిన గారు అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? తన మాటలు ఏం పట్టించుకోకు అమ్మా.. నోటికి ఎంత వస్తే అంత వాగేస్తుంది.
వసు: లేదు మామయ్య తన మాటలు నా మనసులో నాటుకుపోయాయి. తను అలా మాట్లాడుతుంటే ఎందుకీ బతుకు అనిపించింది మామయ్య.
అనుపమ: నువ్వు అలా మాట్లాడకూడదు వసుధార. తన మాటలను కొట్టిపారేసి ముందుకు వెళ్లాలి. అంతే కానీ అక్కడే నిలబడిపోకూడదు అమ్మ.
మహేంద్ర: అయినా రిషి కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. అయినా తన అచూకి తెలియడం లేదు. అసలు ఎందుకమ్మా నాకు ఈ బతుకు అప్పుడే నా జగతి పోయినప్పుడే నేను పోయింటే బాగుండేది.
అనుపమ: మహేంద్ర ఏంటా? మాటలు నువ్వు కూడా
వసు: నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మామయ్యా
మహేంద్ర: ఏం నిర్ణయం తీసుకున్నావమ్మా.. చెప్పమ్మా ఇప్పుడు మనం ఏం చేద్దాం..
అని అడగ్గానే వసు లేచి వెళ్లిపోతుంది. మహేంద్ర ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అడుగుతాడు. మీరు కూడా నాతో రావొచ్చని చెప్పగానే మహేంద్ర, వసుతో పాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు. రిషి సార్ మిస్సయిన కేసు ఎంతవరకు వచ్చిందని పోలీసులను అడుగుతుంది వసు. దీంతో ఆయన చనిపోయారని కేసు ఎప్పుడో క్లోజ్ చేశామని పోలీసులు చెప్పడంతో వసు షాక్ అవుతుంది. వెంటనే రిషి సార్ ఇంకా బతికే ఉన్నాడని వసుధార చెప్తుంది. దీంతో ఆయన బతికే ఉన్నాడని మీరు నమ్మితే ఒక్క క్లూ తీసుకురండి ఫైల్ రీఓపెన్ చేస్తామని పోలీసులు చెప్పడంతో రిషి సార్ ఎక్కడున్నాడో నేనే కనుక్కుంటానని చెప్పి వసుధార, మహేంద్ర స్టేషన్ నుంచి కాలేజీకి వెళ్లిపోతారు.
మహేంద్ర: అమ్మ వసుధార ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు.
వసు: ఏం చేయాలో అర్థం కావడం లేదు మామయ్య. ఇంకొన్ని రోజులైతే గడువు పూర్తవుతుంది. మామయ్యా రిషి సార్‌కు నేనంటే ప్రాణం కదా
మహేంద్ర: అవునమ్మా నువ్వంటే రిషికి ప్రాణం. నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడు. నువ్వు వాడి గుండె చప్పుడు అమ్మ.
వసు: ఆ గుండె చప్పుడు ఎదురుచూస్తుంటుందని రిషి సార్‌కు తెలియదా మామయ్యా.. రిషి సార్ కోసం వెతకని చోటంటూ లేదు. అడగని మనిషి లేడు.
అంటూ ఇద్దరూ కలిసి రిషి గురించి ఆలోచిస్తూ ఉంటారు. వసుధార ఏడుస్తుంది. మహేంద్ర వసుధారను ఓదారుస్తాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నానమ్మ అంటూ మహేంద్ర చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మా కుటుంబానికి గర్వకారణమైన రోజు! - బాబాయ్ గెలుపుపై రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్