అన్వేషించండి

Jagadhatri Serial Today March 13th: కౌషికిపై దాడి చేసి రూ.10కోట్లు ఎత్తుకెళ్లిన మీనన్‌...సీఈవో పదవి నుంచి దిగిపోవాలంటూ కౌషిని కోరిన నిషిక

Jagadhatri Serial Today Episode March 13th: కౌషికిపై దాడి చేసి రూ.10కోట్లు ఎత్తుకెళ్లిన మీనన్‌...సీఈవో పదవి నుంచి దిగిపోవాలంటూ కౌషిని కోరిన నిషిక

Jagadhatri Serial Today Episode : తన తల్లి మర్డర్‌ గురించి మాజీ సీఎం చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్ ధనుంజయ్‌గారిని కలిసిన జేడీకి తొలుత నిరాశ ఎదురవుతుంది.ఆ కేసు గురించి నాకు ఏం తెలియదని...నన్ను ఏం అడగొద్దని ఆయన అంటాడు. చనిపోయిన ఇన్‌స్పెక్టర్‌ కూతురుని తానేనని మా అమ్మ ఎంత నిజాయితీపరురాలో మీకు తెలుసని...కానీ ఆమెపై పడిన నిందపోవడానికి 25 ఏళ్లుగా నేను పోరాటం చేస్తూనే ఉన్నానని జగధాత్రి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

నేను పోలీసు ఆఫీసర్ జేడీని అని చెప్పగానే ధనుంజయ్‌ షాక్‌కు గురవుతాడు. రాష్ట్రాన్ని గడగడలాడించిన మీనన్‌ను చంపిన జేడీవి నువ్వేనా అని అడగ్గా...తానేనని చెబుతుంది.అయితే నీకు నిజం చెబుతానని అంటాడు. మాజీ సీఎంను తనతో చేతులు కలపాలని మీనన్ చాలా ప్రయత్నించినా...ఆయన ససేమీరా అనడంతో అతన్ని చంపేందుకు మీనన్‌ ప్లాన్ వేస్తాడు. దీన్ని తెలుసుకున్న మీ అమ్మ అన్ని ఆధారాలు సేకరిస్తుంది. అదే సమయంలో ఓ కుట్ర వల్ల మీ అమ్మతోపాటు సీఎంను కూడా మీనన్ చంపేశాడని చెబుతాడు. 

ఆ తర్వాత ఈ కేసుతో సంబంధం ఉన్న అందరూ చనిపోతుండటంతో నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్నానని చెబుతాడు.ఇప్పుడు కూడా మీనన్ చనిపోయాడని తెలుసుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చానని అంటాడు. అన్నీ సరేకానీ మా అమ్మ చావుకు కారణం ఏంటని అడగ్గా....ధనుంజయ్‌ షాకింగ్ విషయం చెబుతాడు.నేను కూడా మీ అమ్మ చావు,సీఎం చావుపై ఎంక్వైయిరీ చేశానని....దీనికి కారణం మీ మేనమామ, జర్నలిస్టు నారాయణ కారణమని చెప్పడంతో జేడీ షాక్‌ తింటుంది. ఇది అసలు నమ్మశక్యంగా లేదని అంటుంది. 

మా మామయ్య అలాంటివాడు కాదని...ఎంతో నిజాయితీపరుడని అంటుంది.మీ అమ్మ కూడా అలాగే నమ్మి వాడి చేతుల్లో మోసపోయిందని చెబుతాడు.మీనన్‌కు ఆధారాలు అమ్మేసింది మీ మామయ్యేనని చెబుతాడు. కానీ ఆ తర్వాత మీనన్‌ చేతుల్లోనే మీమామయ్య కూడా చనిపోయాడని చెబుతాడు. మీమామయ్యకు సంబంధించి వస్తువులు ఏమైనా ఉంటే వెతకండి ఆధారాలు దొరుకుతాయని చెబుతాడు.సరేనని చెప్పి జేడీ, కేడీ అక్కడి నుంచి బయలుదేరతారు.

వదిన ఎక్కడి వరకు వెళ్లిందో ఓసారి ఫోన్ చేయమని ధాత్రి కేదార్‌కు చెబుతుంది. కేదార్‌ కౌషికి ఫోన్ చేయగా...ఇంకా వెళ్లలేదని దారిలో ఉన్నామని చెబుతారు. అప్పుడే మీనన్‌ వారి కారుకు తన కారు అడ్డుపెట్టి ఆపుతాడు. కౌషికి ఫోన్ కట్‌ అవుతుంది దీంతో కంగారుపడిన ధాత్రి...రమ్యకు ఫోన్ చేసి వదిన ఎక్కడ ఉందో నాకు లొకేషన్ పెట్టమని చెబుతుంది. మీనన్‌ను చూసి కౌషికి,సుధాకర్‌ షాక్‌కు గురవుతారు. 

నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని అడుగుతారు. ఈ మీనన్‌కు చావు రాదని చెప్పి సుధాకర్‌పై దాడి చేసి రూ.10కోట్లు లాక్కుంటాడు. సుధాకర్‌ను, కౌషికిని చంపేందుకు ప్రయత్నిస్తుండగా..జగధాత్రి,  కేదార్‌ అక్కడికి రావడం చూసి డబ్బులు తీసుకుని పరారవుతారు. గాయపడిన సుధాకర్‌ను తీసుకుని ధాత్రి, కేదార్ ఇంటికి వెళతారు. ఏ జరిగిందని నిషిక వాళ్లు అడగ్గా...మీనన్‌ ఎటాక్ చేశాడని సుధాకర్ చెబుతాడు. మీనన్ బతికే ఉన్నాడని కౌషికి చెప్పినా వినలేదని...నేను కళ్లారా చూశానని చెబుతాడు. ఎవరో దొంగలు కొట్టడంతో మీరు షాక్‌లో మీనన్ అనకుంటున్నారని యువరాజు కొట్టిపడేస్తాడు. 

నేను నా కళ్లారా చూశానని చెప్పడంతో...నిషిక భయపడుతుంది.అయితే మీనన్ మన ఇంట్లో వాళ్లందరినీ చంపేస్తాడని అంటుంది. దీనంతటికీ ఈ కౌషికియే కారణమని మండిపడుతుంది.వాడిని అడిగినప్పుడు పెన్‌డ్రైవ్‌ ఇచ్చేసి ఉంటే ఇదంతా జరిగేది కాదని అంటుంది. ఆవిడ గొప్ప కోసం ఇంట్లో అందరి ప్రాణాల మీదకు తెచ్చిందని మండిపడుతుంది. 

ఇదే సరైన సమయమని నిషిక కౌషికిని సీఈవో పదవి నుంచి దిగిపొమ్మని చెబుతుంది. ఇంతకు ముందులా మీరు ఈ కంపెనీని నడపలేకపోతున్నారని అంటుంది. హోంమినిష్టర్‌తో గొడవ పెట్టుకుని ల్యాండ్‌ విషయం కోర్టుకు తీసుకెళ్లారని ఇప్పుడు 10 కోట్లు పోగొట్టి ఢీల్‌ క్యాన్సిల్  అయ్యేలా చేశారని అంటుంది. మనం కోడ్‌ చేసిన టెండర్‌ లీక్‌ అవుతున్నా మీకు పట్టడం లేదని ....కాబట్టి మీరు సీఈవోగా ఉండే అర్హతలేదని అంటుంది. దీనికి యువరాజు, వైజయంతి కూడా వత్తాసు పలుకుతారు. మీరు దిగిపోయి...మాలో ఒకరిని నియమించమని కోరతారు.

నిషిక మాటలకు మండిపడిన కౌషికి...అసలు మనకు ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుసా అని అడుగుతుంది. మన షేర్‌ విలువ ఎంతో నీకు తెలుసా,అసలు మనకు ఎన్ని షేర్లు ఉన్నాయో కూడా తెలియని నువ్వు నాకు నీతులు చెప్పేస్థాయికి వచ్చావా అని అంటుంది.నిజంగా సీఈవో పదవికి నేను అర్హురాలు కానని భావించినప్పుడు నేనే రాజీనామా చేస్తానని అంటుంది. ఈ ఢీల్ ఇంకా క్యాన్సిల్ కాలేదని....ఒకవేళ ఈ ఢీల్‌ నేను సెట్‌ చేయకపోతే మీరు అన్నట్లు నేను సీఈవో పదవి నుంచి దిగిపోయి మిమ్మల్ని నియమిస్తానని చెబుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget