అన్వేషించండి

Guppedanta Manasu Serial Today June 17th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: మను తండ్రి మహేంద్ర అని లెటర్ రాసిన వసుధార - లెటర్ మార్చేసిన శైలేంద్ర

Guppedanta Manasu Today Episode: మను తండ్రి మహేంద్ర అని వసుధార రాసిన లెటర్ ను మార్చేస్తాడు శైలేంద్ర దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Guppedanta Manasu Serial Today Episode: వసుధార వెళ్లిపోతూ  తన చాంబర్‌లో రాసిన లెటర్‌ శైలేంద్ర కు దొరుకుతుంది. అది  తీసుకుని చదువుతాడు. అందులో మను తండ్రి మహేంద్ర అని రాసి ఉంటుంది. దీంతో షాక్‌ అయిన శైలేంద్ర ఆ లెటర్‌ తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. ఆ విషయం దేవయానికి చెప్తాడు. ఆమె షాక్‌ అవుతుంది. అయితే అదే లెటర్‌ స్థానంలో శైలేంద్ర వేరే లెటర్‌ రాసి పెట్టానని చెప్తాడు. అందులో మను తండ్రి లేరని ఆయన ఎప్పుడో చచ్చపోయాడని రాశానని చెప్తాడు. నిజం చెప్పలేక, అనుపమ మేడం చాలా బాధపడేవారని ఆ లెటర్‌లో రాశానని ఆ లెటర్‌ మను చూశాడని చెప్పడంతో దేవయాని, శైలేంద్ర చెంప పగులగొడుతుంది.

శైలేంద్ర: ఏంటి మామ్‌ ఇలా కొట్టావు..

దేవయాని: నీ తెలివి ఏడ్చినట్టు ఉంది.

శైలేంద్ర: ఇప్పుడు నేనేం చేశాను.

దేవయాని: ఇన్ని చేసిన వాడివి.. ఆలెటర్‌ రాసే ముందు నాకు ఒక్క మాట చెబితే ఏం రాయలో చెప్పేదాన్ని కదా?

శైలేంద్ర: నేను రాశాను కదా మామ్‌. వాడు కచ్చితంగా అది నిజమని నమ్ముతాడు.

దేవయాని: వాడు అది నమ్మడురా? నమ్మకపోగా వాడికి లేని పోని డౌట్స్‌ క్రియేట్‌ చేశావు నువ్వు. ఇన్ని సంవత్సరాలుగా తన తండ్రి ఎవరో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాడు. తన తల్లి ముందు బాధ వెళ్లగక్కుకున్నాడు. అసలు ఈ లెటర్‌ రాసింది వసుధార కాదని అది నువ్వే రాశావని అసలు లెటర్‌ నీ దగ్గరే ఉందని వాడు అనుమానిస్తాడు.

శైలేంద్ర: మరి అయితే ఈ లెటర్‌ చించివేద్దామా?

దేవయాని: ఇక నుంచి నువ్వు వాడితో  చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపడిపోయి వాణ్ని ఏదో చేయాలనుకుని లెటర్‌ విషయం వాడి దగ్గర  ఎత్తకు..

శైలేంద్ర: సరే మామ్‌ కానీ ఇప్పుడు ఏం చేద్దాం..

దేవయాని: ఈ లెటర్ ను మనం అస్త్రం గా వాడి వాణ్ని మనకు అడ్డు రాకుండా చేద్దాం..

శైలేంద్ర: అందుకే కదా మామ్‌ ఈ లెటర్‌ ని నీదగ్గరకు తెచ్చాను..

ధరణి: ఏ లెటర్‌ అండి

 అంటూ ధరణి వస్తుంది. శైలేంద్ర, దేవయాని షాక్‌ అవుతారు. ధరణికి సమాధానం చెప్పరు దీంతో ఏం చెప్పరేంటని ధరణి అడగ్గానే అది ఇన్‌లాండ్‌ లెటర్‌ అంటూ శైలేంద్ర ఏదేదో చెప్తుంటే మీరు ఏదో మాట్లాడుతున్నారు అని ధరణి అనగానే శైలేంద్ర, ధరణిని అక్కణ్నించి వెళ్లిపోమ్మని అరుస్తాడు. ధరణి వెళ్లిపోతుంది. మరోవైపు రంగా ఇంట్లో ఉన్న వసుధార రిషి సార్‌ అంటూ కలవరిస్తుంది. పక్కన కూర్చున్న రంగ  వసుధారనే చూస్తుంటాడు. ఇంతలో సరోజ బట్టలు తీసుకుని వస్తుంది.

సరోజ: ఏయ్‌ బావ ఏం చేస్తున్నావు..?

రంగ: నేనేం చేస్తున్నా.. నేనేం చేయట్లేదు..

సరోజ: ఏం చూస్తున్నావు..

రంగ: నేనేం చూస్తున్నాను నేనేం చూడలేదు..

సరోజ: నువ్వు ఆ పిల్లని అలానే చూస్తున్నావు..అంతలా మైమరచిపోయి చూస్తున్నావు పక్కన మనిషి వచ్చినా పట్టించుకోకుండా.. అంత అందంగా ఉందా?

రంగ: ఏయ్‌ ఏం మాట్లాడుతున్నావు. నీకు తెలుసుగా నాకు అమ్మాయిలు అంటే ఎంత సిగ్గో.. అంతెందుకు చిన్నప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు అయినా నీతో మాట్లాడటానికి ఎంత భయపడేవాణ్ని..

సరోజ: మాట్లాడ్డానికి ఇబ్బంది పడతావేమో కానీ చూడ్డానికి ఇబ్బంది పడవు.. అందుకే అంతలా చూస్తున్నావు. పెళ్లానికి బాగోలేకపోతే మొగుడు దగ్గరుండి సపర్యలు చేస్తాడు చూడా అలా చేస్తున్నావు.

  అంటూ సరోజ మాట్లాడుతుంటే ఎందుకు ఆవిడను డిస్టర్బ్‌ చేస్తున్నారు అంటూ మీరు బయటకు వెళ్లండి అంటాడు రంగ. దీంతో కోపంగా సరోజ వెళ్లిపోతాను నా బట్టలు కూడా ఇవ్వను అంటుంది.   తర్వాత తను దొంగేమో అందుకే రౌడీలు తరిమారేమో అంటుంది సరోజ.. తన ముఖం చూస్తుంటే అలా అనిపించడం లేదని రంగ చెప్తాడు. దీంతో బట్టలిచ్చి సరోజ వెళ్లిపోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

  ALSO READ: అన్నయ్య పెద్ద స్టార్‌, అయినా పవన్‌ కళ్యాణ్‌ ఇండస్ట్రీలో చాలా కష్టపడ్డారు - ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Embed widget