Guppedanta Manasu Serial Today June 14th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: వసుధారను సేవ్ చేసిన రంగ – రంగను చూసి రిషి అనుకున్న వసుధార
Guppedanta Manasu Today Episode: రిషి పోలికతో ఉన్న ఆటో రంగ వసుధారను సేవ్ చేస్తాడు. అయితే రంగను చూసి రిషి అనుకున్న వసుధారకు నిరాశే ఎదురవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: రౌడీలను కొడుతున్న రిషిలాగే ఉన్న రంగను చూసి వసుధార షాక్ అవ్వడమే కాదు హ్యాపీగా ఫీలవుతుంది. రంగ రౌడీలందరినీ కొట్టిన తర్వాత వసుధార హ్యాపీగా రిషి సార్ అంటూ వెళ్లి హగ్ చేసుకుంటుంది. ఇంతలో వెనక నుంచి ఒక రౌడీ కర్రతో రంగను కొట్టబోతుంటే వసుధార అడ్డుపడతుంది. దీంతో రౌడీ కొట్టిన దెబ్బకు వసుధార స్పృహ కోల్పోతుంది. రౌడీలు పారిపోతారు. రంగ ఆటోలో వసుధారను తన ఇంటికి తీసుకుపోతాడు. మరోవైపు వసుధార ఎక్కడికి వెళ్లిందోనని మహేంద్ర బాధపడుతుంటాడు.
మహేంద్ర: అసలు వసుధార ఎక్కడికి వెళ్లిందో ఏంటో? ఎలాంటి సిచ్చుయేషన్‌లో ఉందో ఏంటో ఆలోచిస్తుంటే భయంగా ఉంది.
మను: మేడం ఫోన్ స్విచ్చాప్ లో ఉంది. సార్
మహేంద్ర: తను వెల్లాలనే వెళ్లిపోయింది మను. వసుధార పంతం నాకు బాగా తెలుసు. తను ఒకటి అనుకుంటే సాధించుకునే వరకు తను వదలదు. తనకై తానే తిరిగి వచ్చే వరకు మనం వెయిట్ చేయడం తప్పా మనం ఏం చేయలేము అనిపిస్తుంది.
అనుపమ: మహేంద్ర ప్లీజ్ ఎమోషన్ అవ్వకు
మహేంద్ర: లేదు అనుపమ వసుధార గురించి తలుచుకుంటే నా మైండ్‌లో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. కాళ్లు చేతులు ఆడటం లేదు. ఏం చేయాలో తెలియక నా గుండె బరువెక్కి పోతుంది.
మను: సార్ మీరు అలా మాట్లాడకండి. వసుధార మేడంకు ఏమీ కాదు. నేను తనని వెతికి తీసుకొస్తాను.
మహేంద్ర: మను నువ్వు నాకు ఒక మాట ఇస్తావా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు మమ్మల్ని, కాలేజీని వదలనని మాటిస్తావా? ఆ దుర్మార్గుల నుంచి కాలేజీని కాపాడే సత్తా నీకొక్కడికే ఉంది మను. అర్హత లేని వాళ్ల చేతుల్లో కాలేజీని పెడితే కాలేజీ పాడవుతుంది.
మను: మాటిస్తున్నాను సార్.. ఎన్ని అడ్డంకుల ఎదురైనా సరే వాళ్లు ఎన్ని ప్లాన్లు చేసినా కానీ కాలేజీ వాళ్ల సొంతం అవ్వకుండా చూస్తాను.
అనుపమ: ఇన్ని రోజులు మహేంద్రకు అండగా ఉండి ధైర్యం చెప్తూ ఉండే వసుధార ఇప్పుడు వెళ్లిపోయింది. మహేంద్ర ఇప్పుడు ఒంటరివాడయ్యాడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు మహేంద్ర నీకు అండగా ఉన్నాడు. అలాంటి మహేంద్రకు నువ్వు అండగా ఉండాల్సిన సమయం ఇది.
మను: నాకు అర్థం అయ్యింది మేడం. నేను చెయ్యని నేరానికి జైలులో ఉన్నప్పుడు వీళ్లు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోను మేడం.
అంటూ మీరు కూడా నాతో పాటు రండి అని అడుగుతాడు మను. దీంతో నేను ఇక్కడి నుంచి రాలేనని ఇక్కడ రిషి, జగతి జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు కూడా ఇక్కడే ఉండండి అని మహేంద్ర చెప్పగానే అనుపమ కూడా అవునని ఇక్కడే ఉందామని చెప్పడంతో మను సరే అంటాడు. మరోవైపు వసుధారను ఇంటికి తీసుకెళ్లిన రంగ డాక్టర్‌ను తీసుకొచ్చి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తాడు. వసుధార.. రిషి సార్ అని కలవరిస్తుంది.
డాక్టర్: ఇందాకటి నుంచి రిషి సార్ అని కలవరిస్తుంది. ఎవరా? రిషి సార్.
రంగ ఫ్రెండ్: వాళ్ల కులదైవం అయ్యుండొచ్చు
రంగ: కాదురా సార్ సార్ అంటుందంటే.. పాఠాలు చెప్పిన మాస్టారో.. పాఠాలు నేర్పిన మాస్టారో ఎవరికి తెలుసు చెప్పు.
డాక్టర్: మెడిసిన్ రాస్తున్నాను ఇవి రెగ్యులర్‌గా వాడండి..
రంగ: డాక్టర్ గారు పూర్తిగా స్పృహలోకి ఎప్పుడు వస్తుంది.
డాక్టర్: తలకి గట్టిగా గాయం తగలడం వల్ల ఎప్పుడు స్పృహలోకి వస్తుందో చెప్పలేం. గంటలో రావొచ్చు రోజులో రావొచ్చు ఎప్పుడైనా రావొచ్చు. వీలుంటే రిషి సార్‌ను తీసుకురండి.
అని డాక్టర్ చెప్పడంతో ఆయనెవరో మాకు తెలియదని రంగ చెప్తాడు. డాక్టర్ వెళ్లిపోతుంది. రంగ మరదలు సరోజ రాగానే తన బట్టలు వసుధారకు ఇవ్వమని చెప్తాడు. సరేనంటుంది సరోజ. మందులు తీసుకురమ్మని రంగ చెప్పగానే తన ఫ్రెండ్ వెళ్లబోతూ వసుధారను చూసి కళ్లు తెరుస్తుదని చెప్తాడు. వసుధార కళ్లు తెరచి రంగను చూసి రిషి సార్ అంటూ హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: టాలీవుడ్ సెలబ్రిటీలకు వరలక్ష్మి స్పెషల్ ఇన్విటేషన్ - సమంతతో సెల్ఫీ