Varalaxmi Sarathkumar: టాలీవుడ్ సెలబ్రిటీలకు వరలక్ష్మి స్పెషల్ ఇన్విటేషన్ - సమంతతో సెల్ఫీ
Varalaxmi Sarathkumar: టాలీవుడ్ సెలబ్రిటీలను తన పెళ్లికి ఇన్వైట్ చేయడం కోసం వరలక్ష్మి హైదరాబాద్ వచ్చింది. ప్రస్తుతం తను సెలబ్రిటీలను ఇన్వైట్ చేస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Varalaxmi Sarathkumar: కోలీవుడ్‌లో ఇప్పటికే ఐశ్వర్య అర్జున్ పెళ్లి ఘనంగా జరిగి కొన్నిరోజులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఆ లిస్ట్‌లో యాడ్ అవ్వనుంది. గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న వరలక్ష్మి.. తన పెళ్లి కోసం అన్నీ సమకూర్చుకుంటోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు తన పెళ్లికి ఆహ్వానించే బాధ్యతను తానే తీసుకుంది. కుదిరితే సెలబ్రిటీల ఇళ్లకు వెళ్లి లేదా వారి షూటింగ్ స్పాట్స్‌కు వెళ్లి వారిని ఆహ్వానించడంలో బిజీగా ఉంది వరలక్ష్మి. తాజాగా తను టాలీవుడ్ సెలబ్రిటీలకు స్పెషల్‌గా ఇన్విటేషన్ ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘క్రాక్’తో కెరీర్ టర్న్..
కోలీవుడ్ స్టార్లు అయిన రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి వారిని ఆహ్వానించడానికి తన కుటుంబంతో సహా వారి ఇళ్లకు వెళ్లింది వరలక్ష్మి. టాలీవుడ్ సెలబ్రిటీలను మాత్రం తనే స్పెషల్‌గా వచ్చి ఇన్వైట్ చేసింది. రవితేజను ఆహ్వానించడం కోసం ‘మిస్టర్ బచ్చన్’ మూవీ షూటింగ్ సెట్‌లో వెళ్లింది. మాస్ మహారాజా హీరోగా నటించిన ‘క్రాక్’ మూవీ వరలక్ష్మి శరత్‌కుమార్ కెరీర్‌ను మలుపు తిప్పింది. అప్పటినుండి రవితేజతో వరుకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ మూవీ డైరెక్టర్ అయిన గోపీచంద్ మలినేనిని కూడా స్పెషల్‌గా ఇంటికి వెళ్లి పెళ్లికి ఆహ్వానించింది. ఇక ‘మిస్టర్ బచ్చన్’ సెట్‌కు వెళ్లింది కాబట్టి అక్కడే ఉన్న హరీష్ శంకర్‌కు కూడా తన పెళ్లి కార్డును అందించింది.
సమంతతో సెల్ఫీ..
గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్‌తో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ ఫ్యామిలీస్‌ను కూడా ఇంటికి వెళ్లి మరీ తన పెళ్లికి ఇన్వైట్ చేసింది వరలక్ష్మి శరత్‌కుమార్. ఇటీవల ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’లో కూడా వరు కీలక పాత్రలో కనిపించింది. హీరో తేజ సజ్జాకు అక్కగా నటించి అందరినీ మరోసారి మెప్పించింది. ఈ మూవీ ద్వారా వరలక్ష్మి ఖాతాలో మొదటి ప్యాన్ ఇండియా హిట్ పడింది. యంగ్ హీరో అడవి శేష్‌కు కూడా తన మూవీ సెట్స్‌కు వెళ్లి పెళ్లి పత్రికను అందించింది. వీరితో పాటు సమంతను కూడా ఇన్వైట్ చేసిన వరలక్ష్మి.. తనతో పాటు సెల్ఫీ కూడా తీసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తుంటే వరలక్ష్మి పెళ్లి బాధ్యతలు తనపైనే వేసుకుందని ఫ్యాన్స్ అంటున్నారు.
Actress @varusarath5 invites her close friends and colleagues from the industry to her wedding, which will be held in July. #VaraLaxmiSarathKumar pic.twitter.com/9UFKtmAJ56
— Suresh PRO (@SureshPRO_) June 13, 2024
అక్కడే పెళ్లి..
వరలక్ష్మి శరత్‌కుమార్ కొన్నాళ్ల క్రితం వరకు తనకు ప్రేమ, పెళ్లి అనేవి సెట్ అవ్వవు అంటూ వ్యాఖ్యలు చేసింది. కానీ అనూహ్యంగా ముంబాయ్‌కు చెందిన గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయినా కూడా తాను అవన్నీ పట్టించుకోనని వరలక్ష్మి స్టేట్‌మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి థాయ్‌ల్యాండ్‌లో జరగనుందని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.
Also Read: నటి వరలక్ష్మి పెళ్లి జరిగేది ఈ దేశంలోనే - అక్కడ గ్రాండ్ వెడ్డింగ్‌కి భారీగా ఏర్పాట్లు..