Guppedanta Manasu October 2nd: ఓ వైపు రిషి పెళ్లి పనులు- మరోవైపు జగతి చావుకి ముహూర్తం పెట్టిన శైలేంద్ర
కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. రిషి-జగతిని చంపించేందుకు ప్లాన్ చేస్తే రిషిని కాపాడి తూటాకు బలైంది జగతి.
వసు జగతి దగ్గర కూర్చుని ఉంటుంది. తనని క్షమించమని జగతి వసుని అడుగుతుంది.
వసు: మీరే నన్ను క్షమించాలి. మీరు మా మంచి కోసం చేస్తే అది అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టాను
జగతి: నీ స్థానంలో ఎవరు ఉన్నా అదే చేస్తారు
వసు: కానీ నేను చేయకూడదు. ఆరోజు డీబీఎస్టీ కాలేజ్ కి పంపించకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు. నేను ఏదైనా సాధించినప్పుడు చప్పట్లు కొట్టారు, బాధలో ఉన్నప్పుడు ఓదార్చారు. నేను మిమ్మల్ని చాలా కష్టపెట్టాను
జగతి: అదంతా వదిలేయ్ రిషికి నువ్వు తోడు, నీడగా ఉండాలి. రిషి ఏ తప్పు చేయలేదని నువ్వే నిరూపించాలి. నేను బతుకుతానో లేదో తెలియదు. నేను ఇక బతకను ఏమో కానీ రిషి మీద పడిన మచ్చని నువ్వే చెరిపేయాలి. ఆ బాధ్యత నీది. ఎన్ని కష్టాలు ఎదురైన నువ్వు మాత్రం రిషిని వదలకు. నేను తనని వదిలిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. కాలం గడిచేకొద్ది అది ఎంత పెద్ద శాపం అయ్యిందో నాకు అర్థం అయ్యింది. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు, రిషి డీబీఎస్టీ కాలేజ్ రాజుగా నిలబడాలంటే అది నీ వల్లే సాధ్యం అవుతుంది. అసలు దోషులు ఎవరో తెలుసుకునేలా తనకి నువ్వే దారి చూపించాలి. ఇది నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ
Also Read: రిషి-వసుకి పెళ్లిచేసి కన్నుమూసిన జగతి, గుప్పెడంతమనసు నెక్స్ట్ లెవల్!
జగతిని తీసుకుని మహేంద్ర ఇంటికి వస్తాడు. రిషి మాత్రం రాకుండా గుమ్మం దగ్గరే రాకుండా నిలబడిపోతాడు. మీరు చేసిన వాగ్ధానం గుర్తుకు వచ్చిందా అని వసు అంటుంది. ఎన్నో చేస్తాం కానీ విధిరాత ముందు వాటిని పక్కన పెట్టాలని చెప్తుంది. తల్లి కోసం రిషి తన పంతాన్ని పక్కన పెట్టి ఇంట్లోకి అడుగుపెడతాడు.
దేవయాని: జగతి ఈ టైమ్ లో రిషి పెళ్లి జరిపించడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. బంధువుల సమక్షమంలో చేయాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇంత హడావుడిగా చేయడం ఎందుకు. జగతి కోలుకున్న తర్వాత ఈ పెళ్లి జరిపిద్దామని నువ్వైన చెప్పు రిషి
రిషి: లేదు పెద్దమ్మ అమ్మకి ఏది ఇష్టమో అదే చేద్దాం
దేవయాని: ఈ పెళ్లి తర్వాత చేద్దామని నువ్వైన చెప్పు
జగతి: నా కళ్ళ ముందే పెళ్లి జరగాలి. అది ఇప్పుడే జరగాలి
ఫణీంద్ర: తను ఇప్పుడే జరగాలని చెప్తుంది కదా ఎందుకు విసిగిస్తున్నావ్. తాను అనుకున్నట్టు ఇప్పుడే పెళ్లి జరిపిస్తున్నాం. శైలేంద్ర పెళ్లి పనులన్నీ దగ్గరుండి పూర్తి చేయాలి నువ్వే చూసుకో
తమ ప్లాన్ వర్కౌట్ కాలేదని శైలేంద్ర రగిలిపోతూ ఉంటాడు. అమ్మా కొడుకులు గదిలోకి వచ్చి మాట్లాడుకుంటారు.
శైలేంద్ర: ఎవరినైతే మనం చంపాలని అనుకుంటున్నామో వాడి పెళ్లి మనం చేయాల్సి వచ్చింది. రిషిని పంపించేసి ఒంటరి వాడిని చేస్తే ఇప్పుడు ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఈ పెళ్లి జరిగితే వాడు ఇంట్లో నుంచి కదలడు. ఏదో ఒక రోజు మనం దొరికిపోతాం. మనం ఆశ పడుతున్న ఎండీ సీటు దొరకదు. ఈ పెళ్లి ఆపడం కోసం ఏదైనా చేస్తాను కానీ ఏం చేసినా చూస్తూ ఉండు. చెప్పిన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయి అని తల్లికి ఏదో ప్లాన్ చెప్తాడు. ఈ ప్లాన్ అసలు ఫెయిల్ అవకూడదు అప్పుడే మన కోరిక నెరవేరుతుంది
జగతి పెళ్లి పనులు జరిగే దగ్గరకి వచ్చి సంతోషంగా ఉంటుంది. దేవయాని వచ్చి పలకరిస్తుంది.
దేవయాని: ఇన్నాళ్ళూ ద్వేషించిన నీ కొడుకు నీ కోరిక తీర్చడం కోసం పెళ్లి చేసుకుంటున్నాడు. రిషిని చాలా తెలివిగా మార్చావ్
జగతి: అది మార్చడం కాదు. ప్రేమ
దేవయాని: నీ కొడుకు మాట్లాడుతున్నాడని సంతోషపడుతున్నావ్
జగతి: మీరు ఇదంతా చూస్తూ తట్టుకోలేక నిప్పుల్లో ఉన్నట్టు ఉన్నారు. ఏరోజుకైనా మంచితనం నిలబడుతుంది. ఇన్నాళ్ళూ నా కొడుకుని దూరం చేసి మా మధ్య బంధాన్ని తెంపేయాలని అనుకున్నారు
Also Read: ఆ వెబ్ సీరిస్ కోసం సీరియల్ తల్లి జ్యోతి రాయ్ గ్లామర్ షో - ఇక ఫ్యాన్స్‌కు పండగే!
దేవయాని: రిషి నీమీద జాలితో మాత్రమే అమ్మ అని పిలిచాడు. ఈ పరిస్థితిలో నీకోసం పెళ్ళికి ఒప్పుకున్నాడు. నా స్థానం తన గుండెల్లో ఉంటుంది. రిషి ఎప్పుడు నా మాట జవదాటాడు
జగతి: రిషి గుండెల్లో ఉన్న మీ స్థానం చెరిగిపోయే రోజు వచ్చింది
రిషి జగతి ఇచ్చిన సూట్ చూసుకుంటూ ఉండగా మహేంద్ర వస్తాడు. అమ్మ ఎప్పుడు తన పక్కనే ఉండాలి. మనం అందరం కలిసి ఈ ఇంట్లోనే ఉండాలి. మనం తనని సంతోషంగా చూసుకోవాలని రిషి కోరుకుంటాడు. అమ్మకి ఏం కాదు కదా అని బాధపడతాడు. తనకి ఏం కాదని కొడుక్కి ధైర్యం చెప్పడానికి చేస్తాడు.
మహేంద్ర: చిన్నప్పటి నుంచి నీకు ఏ ముచ్చట తీర్చలేదని నాతో చెప్పుకుని బాధపడేది. ఇప్పుడు నీ పిల్లలకి పనులు చేసి ఆ ముచ్చట తీర్చుకుంటుంది. తనకి ఏం కాదు హ్యాపీగా ఉండటానికి ట్రై చేయి
ధరణి వసుని పెళ్లి కూతురిగా ముస్తాబు చేస్తుంది. మాయన చేసే పనులు కలిచివేస్తున్నాయ్. ప్రమాదాలు ఆన్ని ఆయనే సృష్టిస్తూ ఇలా చేస్తుంటే చూడలేకపోతున్నా. చిన్నత్తయ్యకి ఇలా చేస్తారని అనుకోలేదు. ఈ పరిస్థితిలో నీ పెళ్లి జరుగుతుందని అసలు ఊహించలేదు. రిషి సర్ నా ప్రాణం, మేడమ్ ఇష్టప్రకారం ఆయన నా మెడలో తాళి కడుతున్నారు. మనం అందరం కన్న కల ఈరోజు నిజమవుతుందని వసు అంటుంది.