Guppedanta Manasu May 8th: క్రూర మృగం కంటే దారుణంగా ఉన్న శైలేంద్ర- కొడుకుని కౌగలించుకుని గుండెలు పగిలేలా ఏడ్చిన జగతి
Guppedantha Manasu May 8th Update: శైలేంద్ర భూషణ్ ఎంట్రీతో గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
దేవయాని, శైలేంద్ర మాటలు విని జగతి ఆవేశంతో రగిలిపోతుంది. వెంటనే మీ నిజస్వరూపం రిషికి చెప్తానని వెళ్తుంది.
శైలేంద్ర: రిషి చివరి క్షణాలు చూడటానికి వెళ్తున్నావా పిన్ని. ఉండు మేము కూడా వస్తాం
జగతి: నా గొంతులో ప్రాణం ఉండగా నా కొడుకుని ఏమి చేయలేరు
శైలేంద్ర: మళ్ళీ రిషి ఇక్కడి దాకా వచ్చి ఛాన్స్ ఇవ్వడం ఎందుకు
దేవయాని: జగతి మాటలు రిషి నమ్మడు కదా
Also Read: కావ్య పదహారు రోజుల పండగ - ఈసారైనా అప్పు ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
శైలేంద్ర: అవును కదా అంటే ఆవిడ ఇంట్లోనే రెఫ్యూజ్ లా బతుకుతున్నావ్ కదా
దేవయాని: రిషి నీమాటలు నమ్ముతాడని బ్రమ పడుతున్నావ్ కదా. ఇప్పుడు నీ కొడుకు ప్రాణాలు ముఖ్యమా మమ్మల్ని దోషులుగా నిలబెట్టడం ముఖ్యమా
జగతి: మీ తల్లి కొడుకులని వదిలి పెట్టను
దేవయాని: నిన్ను రిషి అమ్మ అని పిలవకుండా చేశాను వాడి మెదడు నిండా నేను వినేలా మాత్రమే చేశా. ఇప్పుడు నువ్వు వసుధార జీవితంలోకి వచ్చి కొత్త జీవితం చూపిస్తుంటే చూస్తూ ఊరుకుంటామా. వాడికి నేనే అమ్మని నేనే పెద్దమ్మని
జగతి: చీ పెంచిన ప్రేమలో కూడ స్వార్థం వెతుక్కునే మీకు అమ్మ అని పిలిపించుకునే అర్హత లేదు
శైలేంద్ర: నువ్వు మా గురించి రిషికి చెప్తే వింటాడా, నమ్ముతాడా, నమ్మితే ప్రాణాలతో ఉంటాడా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు. మీకు మంచి ఆఫర్ ఇస్తా. ఈరోజు పిన్ని మన మాటలు వినడం వల్ల చాలా మంచి జరిగింది. నీ అంతట నువ్వే రిషిని డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా తప్పుకునేలా చెయ్యి. మోసం చేస్తావా బుజ్జగిస్తావా అది నీ ఇష్టం. ఏం చేసినా వాడు కాలేజ్ పరిసర ప్రాంతాల్లో కనిపించకూడదు. సాధ్యమైనంత త్వరగా చెయ్యి ఇలా చేస్తేనే నీ కొడుకుని ప్రాణాలతో వదిలిపెడతా
జగతి: అన్నయ్య అని నీ కోసం పరితపించే రిషి మీద నీకు ఎందుకు అంత ద్వేషం
దేవయాని: చెప్పిన పని చెయ్యి నీ కడుపున పుట్టడమే రిషి చేసుకున్న పాపం. నీ ప్రాణాలు ముగ్గురిలో ఉన్నాయి. నా కొడుకు తలుచుకుంటే అవి గాల్లో కలిసిపోతాయి. కాలేజ్ శైలేంద్ర చూసుకుంటాడు. నువ్వే ఏదో ఒకటి చేసి రిషిని పదవి నుంచి తప్పించు
జగతి; ఇదంతా చేసి ఏం బాగుపడతారు. మీరు చేస్తున్నది చాలా తప్పు
శైలేంద్ర: వాడు అంటే నాకు మొదటి నుంచి ఇష్టం ఉండదు కానీ అమ్మ మాట విని ప్రేమ నటిస్తూ వచ్చాను నేను చెప్పినట్టు చేయండి రిషి ప్రాణాలా లేదంటే కాలేజా? మీరే ఏదో ఒకటి చేసి రిషిని కాలేజ్ కి దూరం చేయండి. రిషికి, బాబాయ్ కి నిజం చెప్పాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి
Also Read: యష్ కోరిక తీర్చిన వేద- చిత్రని పెళ్లి చేసుకోవడానికి అభి స్కెచ్, బుట్టలో పడిన వసంత్
జగతి బాధగా వెళ్ళిపోతుంది. మహేంద్ర జగతి కోసం వసు దగ్గరకి వెళ్ళి అడుగుతాడు. రిషి గదికి వెళ్ళిందేమోనని వెళతారు. మహేంద్ర టెన్షన్ గా ఉండటం చూసి ఏమైందని అడుగుతాడు. జగతి కనిపించడం లేదని చెప్తాడు. ఇల్లంతా వెతికాము కానీ ఎక్కడ కనిపించలేదని అంటాడు. టెర్రస్ మీ జగతి వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంటుంది. ఇంటి టెర్రస్ మీద ఉందేమో వెతికారా అంటాడు. లేదని చెప్పి మహేంద్ర వాళ్ళు వెళ్ళేసరికి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నారని వసు వాళ్ళు అడిగినా చెప్పకుండా ఉంటుంది. రిషి రాగానే ఏడుస్తూ వెళ్ళి కౌగలించుకుని చిన్న పిల్లలా ఏడుస్తుంది.