Ennenno Janmalabandham May 8th: యష్ కోరిక తీర్చిన వేద- చిత్రని పెళ్లి చేసుకోవడానికి అభి స్కెచ్, బుట్టలో పడిన వసంత్
యష్, వేద ఒక్కటి కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వేద బాధగా నిలబడి ఉంటే మాళవిక వచ్చి సూటిపోటి మాటలతో మరింత బాధపెడదామని ట్రై చేస్తుంది. కానీ వేద తనకి గట్టిగానే బుద్ధి చెప్తుంది. యష్ ఇంటికి వచ్చేసరికి రూమ్ అంతా చీకటిగా ఉండటం చూసి అందరూ ఎక్కడికి వెళ్లారని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వేద యష్ కోణం మోడ్రన్ డ్రెస్ వేసుకుని ఎదురుగా వస్తుంది. తన అందాన్ని చూసి నోరెళ్ళబెడతాడు. యష్ తో డాన్స్ వేస్తూ తెగ హడావుడి చేస్తుంది. ఈ డాన్స్ చేసింది నా భార్య వేదయేనా లేదంటే నేను భ్రమలో ఉన్నాన అని యష్ అనుకుంటూ ఉంటాడు. హలో యశోధర్ గారు కాస్త బయటకి రండి అంటుంది. ఈ డ్రెస్ లో సూపర్ గా ఉన్నావాని అంటాడు. అదేదో పార్టీకి వేసుకొచ్చి ఉంటే బాగుండేది కదా అంటే అసలు బాగోదు అందరూ నన్ను గుచ్చి గుచ్చి చూడటం తనకి నచ్చదని వేద చెప్తుంది. సందర్భాన్ని బట్టి భార్య అందాన్ని చూసే అదృష్టం భర్తకి మాత్రమే ఉందని మీకు నచ్చిన డ్రెస్ వేసుకున్నా హ్యపీనా అంటుంది. మీరు నాకు ఇంత ప్రేమగా గిఫ్ట్ గా ఇస్తే వేరే వాళ్ళకి ఎలా ఇస్తాను ఇది నేను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్తుంది.
Also Read: దివ్య గురించి విక్రమ్ మనసులో విషబీజం నాటిన రాజ్యలక్ష్మి- మళ్ళీ ఫస్ట్ నైట్ గోవింద
పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి వెళ్దామని వసంత్ తో అంటుంది. కానీ తను మాత్రం డల్ గా ఉంటాడు. నువ్వు అక్కడికి రాగానే ఏదో ఒక విధంగా గొడవలు జరుగుతాయని చెప్తాడు. అక్కడికి వచ్చినా ఏ గొడవలు పెట్టుకోవద్దని చెప్తాడు. సరేనని వెళ్తుంటే అభిమన్యు ఎదురుపడతాడు. ఎక్కడికి వెళ్తున్నారంటే యష్, వేద దగ్గరకి వెళ్తున్నాం చిత్ర, వసంత్ పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కదా అందుకని పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి వెళ్తున్నామని చెప్తుంది. ఆ మాట విని అభి షాక్ అవుతాడు. ఎలాగోలా చిత్రని దారిలోకి తెచ్చుకోవాలని నేను ట్రై చేస్తుంటే ఇప్పుడు ఈ పెళ్లి ముహూర్తాలు ఏంటని అనుకుంటాడు. వాళ్ళు వెళ్లబోతుంటే మా అక్క మన పెళ్ళికి ఒప్పుకుంది ముహూర్తాలు పెట్టుకోకుండా ఎప్పుడైనా తాళి కట్టేయమని చెప్పిందని చెప్తాడు. గుడ్ న్యూస్ చెప్పావని మాళవిక సంబరపడుతుంది.
వసంత్ పెళ్లి ముహూర్తం రోజునే మనం కూడా పెళ్లి చేసుకుందామని అభి అనేసరికి సూపర్ ఆలోచన అలాగే చేద్దామని చెప్తుంది. కానీ వసంత్ మాత్రం మొహం మాడ్చుకుంటాడు. వదినని కన్వీన్స్ చేయవచ్చు కానీ యష్ ఒప్పుకోడని వసంత్ చెప్తాడు. ఎందుకు ఒప్పుకోడు నువ్వు మాళవిక తమ్ముడివి నీ పెళ్ళిలో మేము ఎలాగూ ఉంటాం మేమిద్దరం పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు కదా అంటాడు. యష్ ని ఒప్పించాలని నువ్వు చెప్తే తప్పకుండా వింటాడని, వేదని కూడా అడుగుతాను పెళ్లి చేసుకుంటామంటే ఎందుకు ఒప్పుకోరని మాళవిక చెప్తుంది. నాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటానంటే ఎలా చిత్ర ఒకే టైమ్ కి ముహూర్తాలు పెట్టించి దానికంటే పది నిమిషాల ముందే నీ మెడలో తాళి కడతానని అభి తన మనసులో కుట్రని బయట పెడతాడు.
Also Read: జానకికి డెడ్ లైన్ పెట్టిన మనోహర్- రామ కోసం ఉద్యోగానికి రిజైన్ చేస్తుందా?
వేద అద్దం ముందర కూర్చుని తల దువ్వుకుంటుంటే యష్ యాపిల్ తింటూ కన్ను ఆర్పకుండా తననే చూస్తూ ఉంటాడు. యాపిల్ తింటే చాలు ఇంకేం తినోద్ధని కష్టపడుతుంటే చూడకపోతే వచ్చి జడ వేయవచ్చు కదా అంటుంది. కాసేపు ఇద్దరి మధ్య రొమాన్స్ జరుగుతుంది. యష్ వేదకి ప్రేమగా జడ వేస్తాడు. అది చూసి తెగ మురిసిపోతుంది. ఇద్దరూ సరదాగ ఉండగా మాళవిక వచ్చి ఏంటి ఏమైనా విశేషమా చెప్పు నేను సంతోషిస్తానని అంటుంది. అసలు నువ్వు ఎందుకు వచ్చావని తిడతారు.