Guppedanta Manasu May 31st: శైలేంద్రకు జగతి స్ట్రాంగ్ వార్నింగ్ - రిషిని కలిశాక మహేంద్రకు నిజం తెలుస్తుందా!
Guppedantha Manasu May 31th Update: శైలేంద్ర భూషణ్ ఎంట్రీతో గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
గుప్పెడంతమనసు మే 31 ఎపిసోడ్
భర్త మహేంద్ర కూడా తనను అపార్థం చేసుకోవడంతో జగతి బాధపడుతుంది. శైలేంద్ర అరాచకాలు చెప్పాలని ట్రై చేస్తుంది కానీ మహేంద్రని కూడా చంపేస్తానని బెదిరించడంతో ఏమీ మాట్లాడలేక ఆగిపోతుంది జగతి. మరోవైపు రిషిని చంపాలని శైలేంద్ర రౌడీలను పంపిస్తాడు. వాళ్లు రిషిని ఫాలో అవుతుంటారు. ఓ అమ్మాయి కారు పాడైందని రిపేర్ చేసుకుంటుంటే హెల్ప్ చేయనా అని అడుగి కారు బాగుచేస్తాడు. గుప్పెడంతమనసులో ఎంట్రీ ఇచ్చిన కొత్త క్యారెక్టర్...రిషిని గుర్తు పట్టి నన్ను గుర్తుపట్టలేదా అని పలకరిస్తుంది. నా పేరు ఏంజెల్, ఇంటర్‌మీడియట్, డిగ్రీ కలిసి చదువుకున్నామని అంటుంది. ఎందుకలా ఉన్నావని అడుగుతుంది కానీ రిషి ఏమీ మాట్లాడడు. ఏంజెల్ విజిటింగ్ ఇచ్చేసి అక్కడినుంచి వెళ్లిపోతుంది.
Also Read: మీరు రిషి కదా అంటూ ఆశ్చర్యపరిచిన కొత్తమ్మాయ్, జగతిని అపార్థం చేసుకున్న మహేంద్ర!
రిషి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో మహేంద్ర బాధలో మునిగిపోతాడు. రిషితో సంతోషంగా గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటుంటాడు. జగతి టీ తీసుకొచ్చి ఇస్తే కప్పు విసిరికొడతాడు.
మహేంద్ర: రిషిని కాలేజీ నుంచి పంపించడానికి కారణం ఏంటి..ఇక్కడ ఏం జరుగుతోందంటూ నిలదీస్తాడు
జగతి: శైలేంద్ర ఇచ్చిన వార్నింగ్ వల్ల నిజం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది
మహేంద్ర: జగతి నుంచి సమాధానం రాకపోవడంతో మహేంద్ర కోపం మరింత పెరుగుతుంది. నువ్వు నిజం చెప్పడం లేదంటే ఏదో తప్పుచేశావని అర్థమవుతోందంటూ ఫైర్ అవుతాడు
జగతి: నిజం తెలియకపోవడమే మంచిది
మహేంద్ర: రిషి దూరం కావడం మంచి విషయమా? నువ్వు చిన్నప్పుడు రిషిని వదిలిపెట్టినా క్షమించి ఇంటికి తీసుకొచ్చాడు? అలాంటి వాడిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టావు. రిషి ఇంట్లో లేడంటే భరించలేకపోతున్నాను. రిషికి బర్త్‌డే విషెస్ చెప్పలేదని బాధపడతాడు. నువ్వు వసుధార కలిసి రిషికి మంచి బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. కనీసం వసుధార ఎక్కడుందో అదైనా తెలుసా
జగతి: తెలియదు
మహేంద్ర: ముందు తెలుసుకో...ఆమెకు ఫోన్ చేయి
ఓ వైపు వసుధార-మరోవైపు రిషి ఎవరికి వారు ఒంటరిగా కూర్చుని తమలో తాము బాధపడతారు
వసుధార: జగతి కారణంగా రిషి తనను వదిలిపెట్టి వెళ్లిపోవడం, అమ్మ హాస్పిటల్‌లో చేరడంతో ఆమె కాల్ అంటెప్ట్ చేయడానికి వసుధార ఇష్టపడదు. జగతి నిజం చెప్పకపోవడం, వసుధార ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మహేంద్ర అసహనానికి గురవుతాడు. బర్త్‌డే రోజు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చామని వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది. బర్త్‌డే రోజు మహేంద్రకు రిషిని దూరం చేసినందుకు బాధపడుతుంది. తప్పు అని తెలిసినా తప్పని పరిస్థితుల్లో చేయాల్సివచ్చిందని బాధపడుతుంది. మిమ్మల్ని దోషిని చేయాలన్నది మా ఉద్దేశం కాదు, మీ క్షేమం కోసమే తప్పుడు నిర్ణయం తీసుకున్నామని అయినా మిమ్మల్ని శిక్షంచి తప్పు చేశానని అనుకుంటుంది.
రిషి : కూడా ఒంటరిగా కూర్చుని ఆలోచనలో పడతాడు. ప్రతి బర్త్‌డేకు తండ్రి తనను సర్‌ప్రైజ్ చేసేవాడని, ఈసారి మాత్రం నమ్మిన వాళ్లే సర్‌ప్రైజ్ చేశారని, నన్ను దోషిని చేయడం కరెక్ట్ కాదని రిషి ఆలోచిస్తుంటాడు. నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి తనకు చెబితే సరిపోయేదని, ఎందుకు నన్ను దోషిని చేశారని సతమతమవుతుంటాడు. నన్ను ఇలా శిక్షించడం కంటే డైరెక్ట్‌గా చంపేస్తే బాగుండునని రిషి అనుకుంటాడు. అనవసరమైన వాళ్ల గురించి ఆలోచించడం వేస్ట్ అని డిసైడ్ అవుతాడు. జీవితంలో వసుధార, జగతిలను కలవకూడదని, క్షమించకూడదని నిర్ణయించుకుంటాడు.
Also Read: మే 31 రాశిఫలాలు, ఈ రాశులవారు శత్రువులపట్ల జాగ్రత్త వహించాలి
జగతి కాలేజీకి వెళ్లడానికి రెడీ అవుతుంది..ఎదురుపడిన దేవయాని టార్చర్ మొదలుపెడుతుంది. నీ వల్లే రిషి కాలేజీ, ఇల్లు వదిలివెళ్లిపోయాడని, ఆ బాధ లేకుండా కాలేజీకి ఎలా వెళ్తున్నావని అంటుంది.
జగతి: తప్పు చేసిన వాళ్లకు బాధలేదు. రిషి ఎవరి మాటకైతే విలువ ఇస్తాడో వాళ్లే ఊసరవెళ్లిలా ప్రవర్తిస్తున్నారు ఏదో ఒక రోజు నిజం బయటపడకపోదు. వాళ్ల ముసుగు బయటపడకపోదు. ఆ రోజు నా బాధ ఏమిటి? నా కొడుకు విలువ ఏమిటో అందరికి తెలుస్తుంది
శైలేంద్ర: అది జరగనివ్వను
దేవయాని: ఎలాగైనా నా కొడుకు ఎండీ సీట్‌లో కూర్చోవాలి
జగతి: మన ఆశకు హద్దు ఉండాలి. ఇష్టపడ్డదాని కోసం కష్టపడాలి. మనుషుల మీద అభియోగాలు మోపి, ప్రమాదాలు సృష్టిస్తే ఇలాగే ఉంటుంది
దేవయాని: అవన్నీ మాకు అనవసరం. నువ్వు ఎండీ సీట్ నుంచి తప్పుకోవాలి. ఆ సీట్ శైలేంద్రకు నువ్వే అప్పచెప్పాలి
జగతి: మీ బెదిరింపులకు భయపడతానని ఎలా అనుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలు రిషికి నన్ను దూరం చేశావు. ఇప్పుడు ఇద్దరు కలిసి నా కొడుకును నేనే వెళ్లగొట్టేలా చేశారు. రిషి క్షేమం కోసం నాలో నేనే కుమిలిపోయా. ఇప్పుడు రిషి నా కళ్ల ముందు లేకుండా ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటాడు. ఇంకా నేను మీకు భయపడాల్సిన అవసరం లేదు
శైలేంద్ర: ఎండీ స్థానంలో మీరే ఉంటారని అంటారా
జగతి: అందులో మరే మాట లేదు
దేవయాని: పదవి కోసమే రిషిని వెళ్లగొట్టి ఎండీ సీట్‌లో కూర్చున్నావని మేనేజ్‌మెంట్ అనుకునే ప్రమాదం ఉంది, నీ మేలు కోరి చెబుతున్నా ఆ సీట్‌ను శైలేంద్రకు ఇవ్వు
జగతి: నా మనసు చంపుకొని నా బిడ్డ మీద అందరి ముందు చెరగని మచ్చవేశాను. కాలేజీ కోసం ఎన్ని అవమానాలైన భరిస్తాను, అంతే తప్ప కాలేజీ బాధ్యతల్ని నీ చేతిలో పెట్టను. ఖచ్చితంగా రిషి ఏదో రోజు వస్తాడు. మళ్లీ ఎండీ సీట్‌లో కూర్చుంటాడు. అప్పటివరకు నేనే ఎండీనని ఆశలు పెట్టుకోకని శైలేంద్రతో చెబుతుంది జగతి. నా సహనం , బాధ మాత్రమే చూశావు. కోపాన్ని చూడాలని అనుకోకు. నీకే మంచిది కాదని శైలేంద్రకు వార్నింగ్ ఇస్తుంది
జగతి కాలేకి వెళ్తున్నా అని జగతి చెబితే మహేంద్ర నేను రానంటాడు. ఇదే అదనుగా దేవయాని నోరు పారేసుకుంటుంది. ఎందుకలా అంటావని ఫణీంద్ర, ఈ డిస్కషన్ ఇక్కడితో వదిలేయమని మహేంద్ర అంటారు. రిషి ఫ్రెండ్ కాల్ చేశాడు తనెక్కడో కనిపించాడట నేను తన దగ్గరకు వెళుతున్నాను ఎలాగోలా ఇంటికి తీసుకొస్తానంటాడు. తాను కూడా వస్తానని జగతి అంటే వద్దంటాడు మహేంద్ర. ఎవ్వరూ రావొద్దని చెప్పేస్తాడు. దేవయాని మళ్లీ రిషికోసం తపించిపోతున్నట్టు నాటకం ఆడుతుంది. మరోవైపు రిషి తిరిగి ఇంటికొస్తే తాను ఎప్పటికీ డీబీఎస్‌టీ కాలేజీకి ఎండీని కాలేనని శైలేంద్ర భయపడతాడు. ఇప్పుడు ఏం చేద్దామని దేవయాని అంటే నువ్వు అనుకున్నది కచ్చితంగా జరిగితీరుతుందని హామీ ఇస్తాడు శైలేంద్ర...