మే 31 రాశిఫలాలు, ఈ రాశులవారు శత్రువులపట్ల జాగ్రత్త వహించాలి
Rasi Phalalu Today 31st May: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మే 31 రాశిఫలాలు
మేష రాశి
ఈ రాశివారు ఈ రోజు కష్టపడి అంకితభావంతో పని చేస్తారు. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. బయటి వ్యక్తుల విషయాల్లో జోక్యం చేసుకోపోవడమే మంచిది. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. ఇతరులతో కలిసి పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి.
వృషభ రాశి
ఈ రాశివారు శుభవార్త వింటారు. స్నేహితులతో కలసి ఆనందంగా గడుపుతారు. పెండింగ్ పనులను త్వరలోనే పూర్తిచేస్తారు. సోదరుల నుంచి సహకారం లభిస్తుంది. పోటీపరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.
మిథున రాశి
ఈ రాశివారికి ఈ రోజు శుభ ప్రదంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న అవివాహితల పెళ్లికి సంబంధించి చర్చలు సఫలం. నూతన వాహన ప్రాప్తి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులు మీకు సంబధించిన శుభవార్త వింటారు . గతంలో మీరు చేసిన కొన్ని పొరపాట్లు కుటుంబ సభ్యులు సరిదిద్దుతారు.
Also Read: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!
కర్కాటక రాశి
ఈ రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. జీవిత భాగస్వామి సలహాలు మీకు కలిసొస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి . వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. కొన్ని విషయాల్లో ధైర్యంగా అడుగు ముందుకు వేయండి కలిసొస్తుంది.
సింహ రాశి
ఈ రాశివారు ఆనందంగా ఉంటారు. కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే అది తొలగిపోతుంది. ఈరోజు మీకుశుభ ప్రదం. ఏదైనా కొత్త పని చేసే ముందు మీ సోదరులను సంప్రదించాలి. ఆర్థిక విషయాలలో కొనసాగుతున్న సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం పొందుతారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి.
కన్యా రాశి
ఈ రాశి వ్యాపారులకు మంచి రోజు. మిమ్మల్ని ప్రభావితం చేసే వ్యక్తులను కలుస్తారు. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది.నూతన కార్యక్రమాలు మంచి ప్రయోజనాలు ను చేకూరుస్తాయి. ఈ రోజు మీరు గొప్ప పనిలో చేరే అవకాశం ఉంటుంది.కుటుంబ విషయాలలో సహనంతో ఉండాలి. విద్యార్థులు కొత్త కోర్సులు చేయాలి అనుకుంటారు.
తులా రాశి
మీరు మేధస్సును సరైన మార్గంలో వినియోగించడం మంచిది. సహకార స్ఫూర్తి మీలో ఉంటుంది , అందర్నీమీ వెంట తీసుకెళ్లే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. కుటుంబ సంబంధాలలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏ పనిలోనైనా మంచి అవగాహనతో సాగండి ప్రయోజనాలు పొందుతారు.
వృశ్చిక రాశి
ఈ రాశివారు మంచి పేరు సంపాదిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి. మీలో పోటీ స్ఫూర్తి ఉంటుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు చురుగ్గా ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎవ్వరికీ సలహాలు ఇవ్వకుండా మీపని మీరు చూసుకోవడం మంచిది.
ధనుస్సు రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. మీ ప్రవర్తన మెరుగుపడుతుంది . ఆర్థిక విషయాలలో రిస్క్ తీసుకోకూడదు. ఏదైనా శుభకార్యాల్లో పాల్గొంటారు. సన్నిహితులను కలుస్తారు. కుటుంబానికి సంబంధించిన పనులు పూర్తిచేస్తారు.
Also Read: ఈ రాశులవారు ఓడిపోతే చాలా చాలా హర్టవుతారు
మకర రాశి
ఈ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది. ఏదైనా స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలని మీరు ఆలోచిస్తే భవిష్యత్ లో ప్రయోజనం పొందుతారు. కెరీర్ గురించి ఆందోళన చెందుతున్న వారు శుభవార్త వింటారు. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది.
కుంభ రాశి
ఈ రోజు మీలో ధైర్యం పెరుగుతుంది కానీ ముఖ్యమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. ఎవరైనా చెప్పింది గుడ్డిగా నమ్మేయకుండా వాస్తవాలు తెలుసుకోవడం మంచిది. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది .నూతన వ్యక్తుల పరిచయం. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
మీన రాశి
ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ హోదా కీర్తి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో వెళ్లి బంధువులను కలుస్తారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. సామాజిక , కుటుంబ సంబంధాలు మరింత బల పడతాయి. కుటుంబ కలహాలు పరిష్కారమవుతాయి.