Zodiac signs: ఈ రాశులవారు ఓడిపోతే చాలా చాలా హర్టవుతారు
జీవితంలో వేసే ప్రతిఅడుగు, సాధించిన విజయం, ఎదుర్కొన్న ఓటమి ఇవన్నీ మీ గహస్థితిపై ఆధారపడి ఉంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అయితే కొన్ని రాశులవారు ఓటమిని అస్సలు తట్టుకోలేరట...
Zodiac signs: ఆటలో అయినా, జీవితంలో అయినా గెలుపు ఓటములు సహజం. ఎప్పుడూ మనదే పైచేయి అనుకోకూడదు. ఎప్పుడు ఒకరే గెలిస్తే కిక్కేం ఉంటుంది. అయితే ఓటమిని జీర్ణించుకోవడం కూడా గొప్పదనమే. కొందరు ఓడిపోతే లైట్ తీస్కో అంటారు...యథావిధిగా తమపనుల్లో పడిపోతారు. మరికొందరు మాత్రం ఓడిపోతే హర్టవుతారు. అలుగుతారు..జీవితంలో మళ్లీ అవకాశం రాదన్నంతగా తెగబాధపడిపోతారు. ఇదంతా మీ రాశిప్రభావమే అంటారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. ఓడిపోతే హర్టయ్యే రాశులేంటో చూద్దాం..
మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
మేష రాశివారికి పోటీతత్వం ఎక్కువ. వీరు గెలవడాన్ని మాత్రమే ఇష్టపడతారు. విజయం సాధించడానికి ఏమైనా చేస్తారు. గెలిస్తే ఓకే కానీ ఓడిపోయారో అంతే. అస్సలు తట్టుకోలేరు. డిప్రెషన్ కి గురౌతారు. ఓటమిని జీర్ణించుకోలేక తొందరగా కోపం వచ్చేస్తుంది. ఓడిపోవడాన్ని పెద్ద వైఫల్యంలా చూస్తారు.
Also Read: మీ అరచేతిలో పంచభూతాలున్నాయని మీకు తెలుసా!
సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
సింహరాశివారు కూడా ఓటమిని అస్సలు తట్టుకోలేరు. తాము చాలా గొప్పగా ఊహించుకుంటారు. అన్నీ తామే సరిగ్గా చేస్తామనే గర్వంతో ఉంటారు. ముఖ్యంగా ఎదుటివారెప్పుడూ తమ కంట్రోల్ ఉండాలనే ఆలోచనతో ఉంటారు. తమని తాము చాలా గొప్పగా ఊహించుకోవడం వల్ల ఓటమి చెందితే అస్సలు భరించలేరట. ఓడిపోవడం అంటే ఆత్మగౌరవం దెబ్బతినడమే అన్నట్టు భావిస్తారు. ఎల్లవేళలా విజయం తమ సొంతం కావాలనుకుంటారు. పోటీతత్వం ఎక్కువగా ఉండే సింహరాశివారు గెలుపు తప్ప ఓటమిని అంగీకరించలేరు.
వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
వృశ్చిక రాశివారు అన్ని విషయాల్లోనూ చాలా ఎమోషనల్ గా ఉంటారు. పోటీకి సై అంటే సై ఏంటారు. గెలవడమే లక్ష్యంగా భావిస్తారు. దేనికీ భయపడరు. ఓడిపోవడం అస్సలు నచ్చదు. గెలిస్తే వీరి ఆనందానికి అవధులుండవు కానీ ఓడిపోతే మాత్రం అస్సలు తట్టుకోలేరు. అక్కడితో ఆగరు ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంటారు.
ధనుస్సు రాశి (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ధనుస్సు రాశివారిది చాలా సరదా మనస్తత్వం. వీరు చుట్టూ ఉండేవారంతా సంతోషంగా ఉంటారు. పోటీ మనస్తత్వం చాలా ఎక్కువ. పందెంకోళ్లలా సై అంటే సై అంటారు. అయితే కొన్ని సందర్భాల్లో రిస్క్ తీసుకునేందుకు వెనుకాడతారు. ఫలితంగా ఓటమి తప్పదు. ఓటమి చెందితే బాధపడనివారుండరు..కానీ ఆ బాధవీరిలో మరింత ఎక్కువ. జీవితం ఇక్కడితో అయిపోయిందా అన్నంతలా ఫీలవుతారట.
Also Read: మే 25 నుంచి రోహిణి కార్తె, రోళ్లు పగులుతాయని ఎందుకంటారు!
మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
మకరరాశి వారు చాలా కష్టపడి పనిచేస్తారు. తమని తాము గొప్పగా ప్రజెంట్ చేసుకోవాలి అనుకుంటారు. పోటీ పడి ముందుకుసాగుతారు. అందరి మధ్యా గౌరవంగా, గర్వంగా ఉండాలంటే తాము ఎందుకున్న మార్గంలో గెలవాలనుకుంటారు. కష్టపడేందుకు అస్సలు వెనుకాడరు కానీ ఆ కష్టానికి తగిన ఫలితం రాకపోతే మాత్రం హర్టవుతారు,డిస్సప్పాయింట్ అవుతారు.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.