News
News
వీడియోలు ఆటలు
X

Spirituality: మీ అరచేతిలో పంచభూతాలున్నాయని మీకు తెలుసా!

అరచేతిలో పంచభూతాలు ఉండడం ఏంటి..పంచభూతాలకు చేతి వేళ్లకి సంబంధం ఏంటి.. అసలు చేతివేళ్లలో ఇంత మహత్తుఉందా.. ఈ విషయాలు వివరంగా తెలియజేసేందుకే ఈ కథనం

FOLLOW US: 
Share:

Spirituality: చేతిలో పంచభూతాలు నిక్షిప్తమై ఉన్నాయని మీకు సంపూర్ణంగా అర్థం కావాలంటే..పురాతన వైదిక సాంప్రదాయాన్ని గమనించాలి.

  • బొటనవేలు - అగ్నితత్వం
  • చూపుడు వేలు - వాయుతత్వం
  • మధ్యవేలు - ఆకాశ తత్వం
  • ఉంగరపు వేలు - భూమి
  • చిటికెన వేలు - జలతత్వం

ఈ ఐదువేళ్ల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది. చేతి వేళ్ళలో ఉన్న శక్తి నరాల ద్వారా మెదడు వరకు వ్యాపిస్తుంది. అలాగే మెదడు నుంచి నరాల ద్వారా వేళ్ళల్లోకి ప్రసరిస్తుంది. చేతితో అన్నం తినమని చెప్పేది ఇందుకే.  అన్నాన్ని ముందుగా నీటితో శుద్ధి చేసుకుని చేత్తో తినటం వల్ల చేతిలో ఉన్న శక్తి తరంగాలు అన్నం జీర్ణం అయ్యేలా చేస్తాయి. తినే అన్నంలో ఏవైనా దోషాలు ఉన్నా అవి తగ్గుతాయి. కానీ ఇప్పుడు స్పూన్లతో తినడం ఓ ఫ్యాషన్. చేత్తో తింటే ఏదో తప్పుచేసినట్టు చూస్తున్నారు. మన చేతి వేళ్ళల్లో ఇలా శక్తి తరంగాలు, పంచభూతాలు నిక్షిప్తమై ఉండటం వల్ల చేతితో ఎక్కువసేపు పట్టుకునే వస్తువుల ప్రభావం కూడా మనపై ఎంతో ఉంటుంది. జపం చేసేవాళ్ళు మానసిక ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి వాళ్ళు తులసి పూసలు చేత్తో తిప్పుతూ జపం చేస్తారు. చేతితో కలం పట్టుకుంటే రాయాలని అనిపిస్తుంది..కర్ర పట్టుకుంటే ఎవరినైనా కొట్టాలని అనిపిస్తుంది. చాకు పట్టుకుంటే ఏదో ఒకటి చివరికి కూరగాయలకు గాట్లైన పెట్టితీరుతారు. ఇలా చేత్తో ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు సహజగుణాన్ని చేతులు గ్రహించి ఆ దిశగా ప్రేరేపిస్తాయి. 

Also Read: అమ్మో అమ్మవారి పాదాలకింద శివుడు, అప్పటికి కానీ ఆమె శాంతించలేదు

ఆశీర్వచనం వెనుకున్న ఆంతర్యం

పెద్దల ఆశీర్వచనం తీసుకునేటప్పుడు కిందకు వంగి వారి పాదాలకు నమస్కరిస్తే...వారు చేతిని తలపై పెట్టి ఆశీర్వదించి అక్షింతలు వేస్తారు.  పెద్దవాళ్ళు పిల్లల్ని ఆశీర్వదించటం ద్వారా వారి చేతిలో ఉన్న శక్తి  కలిపిన అక్షింతలకు తల మీద పడేసరికి  ఏదో తెలియని బలం వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే పంచభూతాల సాక్షిగా దీవించినట్టు అర్థం.

దేవుడికి చేసే కైంకర్యాలన్నీ చేత్తోనే

ఎప్పుడైనా పండితులు, పురోహితులు ఆరాధన చేస్తుండగా గమనిస్తే..దేవుడికి మొత్తం కైంకర్యాలన్నీ చేత్తోనే చేస్తారు. దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు, నైవేద్యం సమర్పించేటప్పుడు గమనిస్తే చేతులు తిప్పుతారు. స్వామివారికి ప్రత్యేక పూజల సమయంలో వేళ్లతో కొన్ని ముద్రలు పెడతారు. అంతేందుకు భరతనాట్యం, కూచిపూడి లాంటి నాట్యాల్లో కూడా ముద్రలకి ప్రత్యేక స్థానం ఉంది. యోగా, ధ్యానం సమయంలోనూ చేతి వేళ్లతో వివిధ రకాల ముద్రలు వేస్తుంటారు. 

Also Read: విదుర నీతి: మీకు సంతోషకరమైన జీవితం కావాలంటే ఈ నియమాలు పాటించండి

మీ జీవితం మీ చేతుల్లో

చివరికి జీవితం ఎలా ఉంటుందో చెప్పే రేఖలు కూడా అరచేతిలోనే ఉంటాయి. అందుకే హస్తసాముద్రికంలో భాగంగా చేతి రేఖలని చూసి జాతకం చెపుతారు. ఇలా  పంచాభూతలను చేతిలో నిక్షిప్తం చేసిన దేవుడికి చేతులెత్తి నమస్కరించడం కన్నా ఏం చేయగలం.

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.

Published at : 24 May 2023 12:10 PM (IST) Tags: Earth Spirituality vayu panchabhoothas in your palm Pancha Hasta Mudra The Element of Air ‎The Fire Element

సంబంధిత కథనాలు

మే 29 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు

మే 29 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు

Weekly Horoscope 29 May to 04 June: జూన్ మొదటివారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!

Weekly Horoscope 29 May to 04 June:  జూన్ మొదటివారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!

మే 28 రాశిఫలాలు, ఈ ఐదు రాశుల వారి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది

మే 28 రాశిఫలాలు, ఈ ఐదు రాశుల వారి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది

NTR Satajayanti: నిష్ఠాగరిష్ఠుడు తారకరాముడు - అందుకే ఆయనని దైవాంశ సంభూతుడు అంటారంతా!

NTR Satajayanti: నిష్ఠాగరిష్ఠుడు తారకరాముడు - అందుకే ఆయనని దైవాంశ సంభూతుడు అంటారంతా!

Sri Dakshinamurthy: ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన దేవుడి ఫొటో ఇది!

Sri Dakshinamurthy: ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన దేవుడి ఫొటో ఇది!

టాప్ స్టోరీస్

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!