Guppedanta Manasu May 30th: మీరు రిషి కదా అంటూ ఆశ్చర్యపరిచిన కొత్తమ్మాయ్, జగతిని అపార్థం చేసుకున్న మహేంద్ర!
Guppedantha Manasu May 30th Update: శైలేంద్ర భూషణ్ ఎంట్రీతో గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
గుప్పెడంతమనసు మే 30 ఎపిసోడ్
మెడికల్ కాలేజీ పనులపై ఢిల్లీ వెళ్లిన మహేంద్ర ఆనందంతో ఇంట్లో అడుగుపెడతాడు. తాను వెళ్లిన పని సక్సెస్ కావడంతో ఆ విషయాన్ని మొదట రిషితోనే పంచుకోవాలని రిషి రిషి అంటూ హడావుడి చేస్తాడు. హాల్లో ఉన్న ఫణీంద్రతో చెప్పడం మొదలెడతాడు. అదే సమయంలో జగతి హాల్లోకి రావడంతో సంతోషంగా రిషి గురించి, మెడికల్ కాలేజీ గురించి చెబుతుంటాడు. జగతి మాత్రం మౌనంగా ఉండిపోతుంది. ఢిల్లీలోని పెద్దలంతా రిషి మేథస్సుకు ఆశ్చర్యపోయారు...ఓ తండ్రిగా నాకు అంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పు..రేపు వాడి పుట్టినరోజు కదా అని మాట్లాడేస్తూ ఉంటాడు. అన్నయ్యా రిషి పుట్టిన రోజుని గ్రాండ్ గా చేయాలి శైలేంద్ర..నువ్వుకావాల్సిన ఏర్పాట్లు చేయమని చెబుతాడు. శైలేంద్ర క్రూరంగా నవ్వుకుంటాడు. ఆ తర్వాత వసు-రిషి ఎక్కడున్నారు కనిపించడం లేదేంటని అడుగుతాడు. జగతి మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది.
దేవయాని: రిషి వసుధారలు ఎక్కడికి వెళ్లారో చెప్పు జగతి
మహేంద్ర: ఏమైంది జగతి మాట్లాడవేంటి
దేవయాని: అక్కడ చేసిందంతా చేసి ఇక్కడ మాట్లాడవేంటి..నా కొడుకు ఎక్కడని మహంద్ర అడుగుతున్నాడు కదా నోరు తెరిచి చెప్పు
మహేంద్ర: అసలేం జరిగింది..ఏమైనా జరగరానిది జరిగిందా
శైలేంద్ర: రిషి మనసును జగతి పిన్ని గాయపరిచింది
దేవయాని: ఇంకెక్కడ రిషి...మనల్ని, కాలేజీని వదిలిపెట్టి రిషి ఎక్కడికి వెళ్లిపోయాడంటూ..జగతి ఇచ్చిన తీర్పు గురించి చెబుతుంది
మహేంద్ర: జగతి వల్లే రిషి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని అపార్థం చేసుకుని..ఎవరి మీద అభియోగం మోపావో తెలుసా అంటూ కోపంతో అరుస్తాడు. నీతి, నిజాయితికి నిలువెత్తు నిదర్శనం రిషి. అలాంటివాడి మీద ఎందుకు నింద మోపావు
జగతి కన్వీన్స్ చేయబోతున్నా ఆ మాటల్ని లెక్కచేయడు మహేంద్ర
Also Read: జగతిని దోషిని చేసి వెళ్ళిపోయిన వసు- గుండెనొప్పితో కుప్పకూలిన సుమిత్ర, ఇక రిషిధార కలవనట్టేనా?
మహేంద్ర: నేను నిన్ను ప్రాణంగా ప్రేమించినందుకు నా ప్రాణాలను తీసేశావు. చిన్నప్పుడు రిషిని ఒంటరిగా వదిలివేసి ఏవేవో సాకులు చెప్పావు. ఇప్పుడు వాడిని ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేశావు. నువ్వు ఈ ఇంట్లో నుంచి రావడానికి కారణమైన వాడినే బయటకు గెంటేశావు. రిషిని పంపించేసి మళ్లీ నన్ను ఒంటరివాడిని చేశావు. ఎందుకు రిషి మీద నీకు అంత కోపం...నీ కడుపున పుట్టడమే వాడు చేసిన తప్పా
జగతి: మౌనంగా ఉంటుంది
ఫణీంద్ర: రిషి తప్పకుండా మనకోసం ఇంటికి తిరిగి వస్తాడు ఆవేశపడొద్దు
మహేంద్ర: రిషికి అత్మాభిమానం ఎక్కువ. వాడు మన మొహం కూడా చూడడు అన్నయ్యా
దేవయాని: నా కొడుకుపై కట్టుకథలు అల్లి గురుశిష్యురాళ్లు కలిసి మా అందరికి దూరం చేశారు
శైలేంద్ర : రిషి ఏ తప్పు చేయడు. ప్రాణం పోయినా చిన్న మిస్టేక్ చేయడని మేము చెప్పినా మా మాట లెక్కచేయలేదు
మహేంద్ర: దీని వెనుక ఏం కారణం ఉంది. ఏం ఆశించి ఈ పని చేశావు. వాడికి గొప్ప తల్లిగా నువ్వు, గొప్ప భార్యగా వసుధార ఉంటారనుకున్నా. కానీ వాడిని మోసం చేసి మీరిద్దరు చిరకాలం చరిత్రలో నిలిచిపోయారు
జగతి: రిషి బాగు కోసమే ఇదంతా చేశాను
మహేంద్ర: వాడిని మోసం చేసే బలమైన కారణం ఏంటి
జగతి నిజం చెప్పాలి అనుకుంటుంది కానీ శైలేంద్ర మాత్రం కళ్లతోనే బెదిరిస్తాడు..రిషిని కాలేజీ నుంచి దూరం చేయమని ఎవరైనా బెదిరించారా? మహేంద్ర: కొడుకును చూడాలని సంతోషంగా వచ్చాను చివరకు తనకు కన్నీళ్లే మిగిల్చారంటూ వెళ్లిపోతాడు
శైలేంద్ర: బాధేస్తుందా, ధైర్యం సరిపోవడం లేదా పిన్ని. కన్నీళ్లకు కరిగిపోయి నిజం చెబితే బాబాయ్‌ని కూడా మట్టిలో కలిపేస్తాను. మేం చెప్పాల్సింది చెప్పాం...ఆ తర్వాత నీ ఇష్టం..కొడుకును ఎలాగూ దూరం చేసుకున్నావు. ఇక నీ పసుపు కుంకుమలను కాపాడుకుంటావో లేదో నువ్వే ఆలోచించుకో అని దేవయాని కూడా జగతిని భయపెడుతుంది.
Also Read: మే 30 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశివారు ఎవర్నీ అతిగా నమ్మొద్దు
రిషి నుంచి కాలేజీతో పాటు ఇంట్లో నుంచి బయటకు పంపించినా ఎండీ సీట్ దక్కకపోవడంతో శైలేంద్ర కోపంతో రగిలిపోతుంటాడు. రిషిని ఇంట్లో లేకపోవడంతో జగతి తాను చెప్పింది వినదని అనుకుంటాడు. నిజం తెలిసి రిషి తిరిగివస్తే జన్మలో తన కల నెరవేరదని, . డీబీఎస్‌టీ కాలేజీకి తాను రాజును కాలేనని అతడికి అర్థమవుతుంది. అందుకే రిషిని చంపేయాలి నిర్ణయించుకుని కొందరు రౌడీలు ఫోన్ చేసి చంపేయమని చెబుతాడు. రిషి ఛాప్టర్ క్లోజ్ అని శైలేంద్ర తనలో తానే అనుకుంటాడు.
రోడ్‌పై నడుచుకుంటూ వెళుతున్న రిషిని రౌడీలు ఫాలో అవుతుంటారు. ఓ యువతి కారు పాడైపోతుంది. రిపేర్ చేయడం రాక ఇబ్బంది పడుతుంది. ఆమెకు రిషి హెల్ప్ చేస్తానని అంటాడు. రిషి ప్రాణాలకు తీసే అవకాశం కోసం ఎదురుచూస్తోన్న రౌడీలకు మధ్యలో ఆ అమ్మాయి ఎంట్రీ కావడంతో ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలోనే ఆ అమ్మాయి మీరు రిషి కదా అనడంతో ఆశ్చర్చపోతాడు.