మే 30 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశివారు ఎవర్నీ అతిగా నమ్మొద్దు
Rasi Phalalu Today 30th May: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మే 30 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. అందరితో సత్స సంబంధాలు ఏర్పరచుకుంటారు. వ్యాపారం లో భాగస్వామ్యులతో కలిసి విజయం సాధిస్తారు, వ్యాపారం విస్తరిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టమైనవిద్య పై ఆసక్తి కనబరుస్తారు. ప్రేమికులకు అనుకూలమైన రోజు . ఈరోజు పనులతో బిజీగా ఉంటారు.
వృషభ రాశి
ఈ రోజు మీరు ఆస్తులు కొనుగోలు చేస్తారు . ఉద్యోగంలోను , బయట మీకు తగిన గుర్తింపు లభిస్తుంది . కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు . ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు అనుభవజ్ఞులైన వ్యక్తుల సహకారాన్ని పొందే అవకాశం ఉంది.
మిథున రాశి
మీరుచేసిన కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఆర్ధిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం . ఎవరినీ అతిగా నమ్మకండి . కుటుంబంలో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది
Also Read: జూన్ మొదటివారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!
కర్కాటక రాశి
ఈ రోజు మీకు అత్యంత శుభకరం . మీ మేథస్సుతో అన్ని సమస్యలను పరిష్కరిస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు . వ్యాపార మెలకువలు, అభిప్రాయాలు, నిర్ణయాలు ఎవరితోనూ పంచుకోకండి. ప్రత్యర్థులు అడ్డంకులు సృష్టించవచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రత్యేక వ్యక్తుల కలయిక. వీరు మీ ప్రణాళికలను నెరవేర్చడంలో సహాయం చేస్తారు . ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి .
సింహ రాశి
సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. జీవిత భాగస్వామితో అనుకూలమైన సమయం , అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారులకు మంచి సమయం. పెద్ద డీల్ కారణంగా మీ వ్యాపారం పురోగమిస్తుంది. మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో పని చేస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి . మీ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
కన్యా రాశి
ఈరోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కార్యాలయంలో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో, కొత్త వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. కొత్త సమాచారం అందుతుంది. నూతన పనులకు శ్రీకారం చుట్టండి అంతా శుభం జరుగుతుంది. కళా రంగాలలో ఉన్న వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది . ధనలాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు .
Also Read: అమ్మో అమ్మవారి పాదాలకింద శివుడు, అప్పటికి కానీ ఆమె శాంతించలేదు
తులా రాశి
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీ సమర్థతతో ఇతరులను ఆకట్టుకుంటారు , అందరి మద్దతు లభిస్తుంది. మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.ఇతరుల నుంచి ప్రయోజనం పొందుతారు. మంచి వ్యక్తుల సహాయ సహకారాలు అందుతాయి.
వృశ్చిక రాశి
ఈరోజు ఆనందంగా గడుపుతారు . మానసిక ప్రశాంతతను పొందుతారు.విహార యాత్రలకు ,లేదా తీర్ధ యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది . మీరు కొత్త ప్రణాళికను రూపొందించడంలో విజయం సాధిస్తారు. స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఈ రోజు కార్యాలయంలో మీ నిర్ణయాలలో చాలా మందికి విభేదాలు ఉండవచ్చు, గందరగోళం పెరుగుతుంది. అయినా కానీ మీరు మీ మనోబలంతో నెగ్గుకొస్తారు.
ధనుస్సు రాశి
మీ పని తీరుతో అందర్నీ మీ వైపు తిప్పుకుంటారు . ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు, అనారోగ్య సూచనలు. ఇంట బయటా పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు ఆచితూచి అడుగేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు . కుటుంబంలో ఆనందం వెల్లి విరుస్తుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం.
మకర రాశి
ఈ రోజు జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీరు ఏ పని చేసినా విజయం సాధించే అవకాశాలున్నాయి. ధనలాభం ఉంటుంది. మనస్సు ఆధ్యాత్మికత విషయాల్లో నిమగ్నమై ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. విద్యార్థులకు మంచి సమయం. మంచి అవకాశాలు అందుకుంటారు.
కుంభ రాశి
ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో సత్ససంబంధాలు కొనసాగిస్తారు . ఉద్యోగస్తులకు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది . కవులకు, కళాకారులకు అనుకూలమైన రోజు . కొత్త అవకాశాలు పొందే అవకాశం ఉంది.
మీన రాశి
ఈరోజు వృత్తి జీవితం మెరుగుపడుతుంది. బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు గౌరవ ప్రతిష్టలు లభిస్థాయి . రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు పెద్ద పదవిని పొందవచ్చు. మీ మనోబలం పెరుగుతుంది. పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు . వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది. మానసికంగా దృఢంగా ఉండటానికి వ్యాయామం , యోగా, మెడిటేషన్ లాంటివి చేయండి. కుటుంబ సబ్యులకు సమయం కేటాయించండి .